London, Jan 19: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)పై బీబీసీ ఛానల్ ‘India: The Modi Question’ పేరిట ప్రసారం చేసిన సిరీస్‌పై కేంద్రం తీవ్రంగా స్పందించింది.ఇది పక్షపాతంతో కూడిన ప్రచారంలో భాగమని తీవ్రంగా ఆక్షేపించింది.ఈ డాక్యుమెంటరీ.. దానిని రూపొందించిన ఏజెన్సీ విధానానికి ప్రతిబింబం. ప్రధాని మోదీని అపఖ్యాతి పాల్జేసేందుకు ఈ కథనాన్ని ప్రచారంలోకి తీసుకువచ్చారని మేం భావిస్తున్నాం. ఈ విశ్వసనీయత లేని డాక్యుమెంటరీని ప్రసారం వెనుక వలసవాద మనస్తత్వం కనిపిస్తోందని తెలిపింది.
ఇక్కడ పక్షపాత ధోరణి, వలసవాద మనస్తత్వం స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి చిత్రాలను మేం గౌరవించలేం. దీనిని వెనక ఉద్దేశం మమ్మల్ని తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది’ అని విదేశీ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి(Arindam Bagchi) ఘాటుగా స్పందించారు. బ్రిటన్‌లోని అంతర్గత నివేదిక ఆధారంగా రూపొందించిన ఈ డాక్యుమెంటరీలో వలసవాద మనస్తత్వం, ఆలోచనా ధోరణి కనిపిస్తోందని విదేశీ మంత్రిత్వ శాఖ పేర్కొంది.ఈ సిరీస్‌లో 2002 గుజరాత్ అల్లర్ల ఘటనకు సంబంధించి ప్రస్తావన ఉంది. 2002 గుజరాత్ అల్లర్ల కేసులో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవంటూ సిట్ ఇచ్చిన క్లీన్‌చిట్‌ను ఇదివరకే సుప్రీంకోర్టు సమర్థించిన సంగతి తెలిసిందే.
బ్రిటన్ నేషనల్ బ్రాడ్‌కాస్టర్ బీబీసీ (BBC) భారత ప్రధాని మోదీపై రెండు భాగాలుగా ఓ డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. 2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్ల సమయంలో మోదీ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్తూ, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వంపై ఈ డాక్యుమెంటరీలో విమర్శలు గుప్పించింది. ప్రధాని మోదీ, భారతదేశంలోని ముస్లిం మైనారిటీల మధ్య ఉద్రిక్తతలను పరిశీలించడం, వెయ్యి మంది వరకు మరణించిన గుజరాత్ 2002 అల్లర్లలో ప్రధాని మోదీ పాత్ర గురించి వాదనలను పరిశీలించడం లాంటి ఉద్దేశాలను ప్రముఖంగా చూపించడంతో.. దుమారం మొదలైంది.పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. కొన్ని ప్లాట్‌ఫామ్‌ల నుంచి దీనిని తొలగించారు. భారతీయ మూలాలుగల బ్రిటన్ పౌరులు ఈ డాక్యుమెంటరీని తీవ్రంగా ఖండించారు. ప్రముఖ బ్రిటన్ పౌరుడు లార్డ్ రమి రేంజర్ మాట్లాడుతూ, 100 కోట్ల మందికిపైగా గల భారతీయుల మనసును బీబీసీ తీవ్రంగా గాయపరిచిందన్నారు.
అల్లాహు అక్బర్ అని అరుస్తూ ప్రయాణికులను నరికివేసిన ముస్లింలు, బెల్జియంలో దారుణ ఘటన
ఇటువంటి కథనాన్ని ప్రచారం చేయడంలో బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (BBC), వ్యక్తుల ధోరణి కనిపిస్తోందని తెలిపారు. దీనిని ప్రసారం చేయడంలో ఎజెండా ఏమిటని ప్రశ్నించారు. గౌరవ, మర్యాదలతో పని చేయాలని కోరుకుంటున్నామన్నారు. ఈ డాక్యుమెంటరీలో బ్రిటన్ మాజీ సెక్రటరీ జాక్ స్ట్రా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, జాక్ స్ట్రా ఏదో అంతర్గత బ్రిటన్ నివేదికను ప్రస్తావించినట్లు కనిపిస్తోందని, అది తనకు ఏవిధంగా అందుబాటులో ఉంటుందని ప్రశ్నించారు. అది ఇరవయ్యేళ్ళ క్రితంనాటి నివేదిక అని, దానిపైన మనం ఇప్పుడు ఎందుకు స్పందించాలని అడిగారు.
జాక్ చెప్పినంత మాత్రానికి అది సరైనదని వారు ఎలా చెప్పగలరని ప్రశ్నించారు. ఇంక్వైరీ, ఇన్వెస్టిగేషన్ అనే మాటలను తాను విన్నానని, వలసవాద ఆలోచనా ధోరణి అనే పదాలను మనం మాట్లాడటానికి ఓ కారణం ఉందని తెలిపారు. మనం పదాలను ఇష్టానుసారం వాడబోమన్నారు. ఇంక్వైరీ ఏమిటి? వారు అక్కడ దౌత్యవేత్తలు కదా? అన్నారు. ఇన్వెస్టిగేషన్ అంటే దేశాన్ని వారు పాలిస్తున్నారా? అని ప్రశ్నించారు.
Here's Rishi Sunak Statement
UK PM #RishiSunak dismisses Pak-origin #British MP's statement about #PMModi's leadership during 2002 Gujarat riot over BBC documentary#Pakistan #NewsUpdate #ModiGovt @PMModiNews @rishisunakmp1 @PMModiArmy #RIOT @PmModiFanClub1 @rishisunak_66
Video Credit: @kapilkumaron pic.twitter.com/uFhN8gOTMw
— News9 (@News9Tweets) January 19, 2023
ఈ డాక్యుమెంటరీపై యూకే ప్రధాని రిషి సునాక్ స్పందించారు. బ్రిటన్ పార్లమెంట్‌లో పాకిస్థాన్ సంతతి ఎంపీ ఇమ్రాన్ హుస్సేన్ ఒకరు దీని ప్రస్తావన తీసుకొచ్చి భారత ప్రధానిని ఉద్దేశిస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అలాంటి దేశంతో యూకే దౌత్య సంబంధాలు కొనసాగించడం సరికాదంటూ మాట్లాడారు. అయితే దీన్ని సునాక్ ఖండించారు. ‘‘దౌత్య సంబంధాల విషయంలో యూకే ప్రభుత్వం స్పష్టంగా ఉంది. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న సంబంధాల్లో ఎలాంటి మార్పు ఉండదు. అయితే ఎంపీ చెప్పిన మాటల్లో నిజం ఉందని నేను పూర్తిగా అంగీకరించలేను’.అలాగని ఎక్కడైనా హింసను సహించబోం అని సునాక్ వెల్లడించారు.
2002 ఫిబ్రవరి నెలలో అయోధ్య నుంచి తిరిగి వస్తున్న సబర్మతి ఎక్స్ ప్రెస్ రైలులో కరసేవకులు ఉన్న బోగీకి గోద్రా రైల్వేస్టేషన్ లో నిప్పు పెట్టడంతో 59 మంది చనిపోయారు. ఈ ఘటనతో గుజరాత్ వ్యాప్తంగా హిందూ-ముస్లింల మధ్య ఘర్షణలు తలెత్తాయి. మూడు నెలల పాటు గుజరాత్ రాష్ట్రం అట్టుడికింది. ఈ ఘర్షణలో వెయ్యి మరణించారు. ఆ సమయంలో గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. సీఎంగా నరేంద్ర మోదీ ఉన్నారు. అయితే ఈ అల్లర్లపై ఏర్పాటు చేసిన సిట్ 2012లో ప్రధాని మోదీకి క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ అల్లర్లలో ప్రభుత్వ ప్రమేయం లేదని చెప్పింది. కొంతమంది మాత్రం నరేంద్రమోదీ పాత్ర ఉందని తప్పుడు ఆరోపణలు చేశారని వెల్లడించింది.
ఇక తీస్తా సెతల్వాడ్ అనే హక్కుల కార్యకర్త నరేంద్ర మోదీని తప్పుడు ఆరోపణలతో ఇరికించే ప్రయత్నం చేసినట్లు తేలింది. దీనికి కాంగ్రెస్ పార్టీ, దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ ప్లాన్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కిందటి ఏడాది.. గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి గతంలో హైకోర్టు ఇచ్చిన క్లీన్ చిట్‌ను సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ మేరకు ఆ హింసాకాండలో మరణించిన కాంగ్రెస్ ఎంపీ ఈషాన్ జఫ్రీ భార్య జాకియా జఫ్రీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు అర్హత లేనిదిగా పేర్కొంది