Dream Controlling Chip

Kazakhstan, July 22:  మనిషికి కలలు రావటం సర్వసాధారణమే. అవికావాలనుంటే రావు..వద్దు అనుకుంటే పోవు.కానీ ఓ వ్యక్తి మాత్రం పిచ్చి పీక్ స్టేజ్ కు వెళ్లిందో ఏమో దాని కలల్ని కంట్రోల్ చేయటాని ఏకంగా తన బుర్రకు డ్రిల్లింగ్ మిషన్ తో రంధ్రం చేసి ఓ చిప్ పెట్టుకున్నాడు. అదేమన్నా రోడ్డా, లేదా గోడా డ్రిల్లింగ్ మిషన్ తో డ్రిల్ చేయటానికి.. అందుకే కపాలానికి డ్రిలింగ్ మిషన్ తో రంధ్రం చేయటంతో తీవ్రంగా రక్తస్రావం అయ్యింది.దీంతో చావుబతుకుల్లో ఆస్పత్రిలో చేరాడు. అతని వయస్సు 40 ఏళ్లు. కానీ చిన్నపిల్లాడికి ఉండే విచక్షణ కూడా లేకుండా ఏకంగా తన బుర్రకు తానే డ్రిల్లింగ్ మిషన్ తో బెజ్జం పెట్టేసుకున్నాడు. ఆనక చావు అంచులకు వెళ్లాడు.

మిఖాయిల్‌ రాదుగా (Mikhail Raduga) అనే 40 ఏళ్ల రష్యన్ వ్యక్తి (Russian Man)తన కలలను నియంత్రించుకోవాలనుకున్నాడు. దాని కోసం డ్రీమ్స్ కంట్రోల్ చిప్ (Dream Controlling Chip)తన తల (Skull)లో అమర్చుకోవాలనుకున్నాడు. దాని కోసం ఇంటర్నెట్‌లో సమాచారం తెలుసుకున్నాడు.

 

యూటూబ్ లో న్యూరో సర్జరీల వీడియోలు చూశాడు. అంతే డ్రిల్లింగ్ మిషన్ (Drilling mission) కొనుక్కొని తెచ్చుకున్నాడు. తనపై తానే ప్రయోగం చేసుకోవాలనుకున్నాడు. మే (2023)17 తను ఉండే అపార్ట్ మెంట్ లో తన కపాలానికి రంధ్రం చేసుకున్నాడు. ఎలక్ట్రోడ్‌ చిప్‌ను అమర్చుకున్నాడు.

US Shooting: తుపాకీతో ఆడుకుంటూ పొరపాటున ఏడాది వయసున్న చెల్లిని కాల్చేసిన మూడేళ్ల చిన్నారి, తలలో నుంచి బుల్లెట్ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి 

ఈ ఆపరేషన్‌లో భాగంగా అతడికి తీవ్ర రక్తస్రావం అయింది. తీవ్రంగా రక్తస్రావం కావటంతో దాదాపు చావు అంచులవరకు వెళ్లాడు. అతని టైమ్ బాగుండి ఎవరో చూసి రక్తపు మడుగులో పడి ఉన్న అతడిని ఆస్పత్రిలో చేర్చడంతో బతికి బయటపడ్డాడు. తాను చేసిన ప్రయత్నానికి సంబంధించిన ఫొటోలను అతడు ట్విటర్‌ లో పోస్ట్‌ చేశాడు.

2,600 Flights Cancelled in US: అమెరికాలో 2600 విమానాలు రద్దు, భారీ వరదలకు తోడైన పిడుగులు, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిక 

‘మెదడుపై స్వయంగా ఎలక్ట్రోడ్ ఇంప్లాంటేషన్ చేశాను. మెదడులోని ఓ భాగంలో ఎలక్ట్రిక్‌ స్టిమ్యులేషన్‌ నిర్వహించాను. కలలు కనేటప్పుడు మెదడు ఉద్దీపనను పరీక్షించడానికి ఇది అవసరం. ఇటువంటి ప్రయోగం చరిత్రలో ఇదే మొదటిసారి’ అని అతడు పేర్కొన్నాడు. ఈ ట్వీట్ పై నెటిజన్లు తమ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.