Sanaa, April 20: యెమన్ లో (Yemen) తీవ్ర విషాదం నెలకొంది. రంజాన్ ఆర్థిక సాయం పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట (Stampede in Yemen) జరిగింది. తొక్కిసలాటలో 80 మందికిపైగా మృతి చెందారు. వందలమందికి గాయాలు అయ్యాయి. వారిని చికిత్స కోసం వివిధ ఆస్పత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి యెమన్ రాజధాని సనాలో రంజాన్ ఆర్థిక సాయం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆర్థిక సాయం తీసుకోవడానికి భారీగా జనం ఎగబడ్డారు. దీంతో అక్కడ తొక్కిసలాట (Stampede in Yemen) జరిగింది. ఈ ఘటనపై తిరుగుబాటు సంస్థ హౌతీ అధికారి సమాచారం ఇచ్చారు. హౌతీ ఆధ్వర్యంలో నడిచే అంతర్గత మంత్రిత్వశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. సంHouthi ఘటన జరిగిన సమయంలో వందలాది మంది పేదలు కార్యక్రమంలో గుమిగూడారు. హౌతీ తిరుగుబాటుదారుల అల్-మసీరా శాటిలైట్ టీవీ ఛానెల్ ప్రకారం.. సనాలోని సీనియర్ ఆరోగ్య అధికారి మోతహెర్ అల్-మరౌనీ మరణాల సంఖ్య సమాచారాన్ని అందించారు. కనీసం 13 మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు.
Breaking: 79 people killed and 110 injured after a stampede in a school in Sanaa, Yemen where poor people gathered to receive charities during Ramadan.
📽️@SaadAbedine#Yemen pic.twitter.com/f0ti65IUQB
— World Times (@WorldTimesWT) April 20, 2023
ఈ ఘటనపై తిరుగుబాటు సంస్థ హౌతీ అధికారి సమాచారం ఇచ్చారు. హౌతీ ఆధ్వర్యంలో నడిచే అంతర్గత మంత్రిత్వశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. సంఘటన జరిగిన సమయంలో వందలాది మంది పేదలు కార్యక్రమంలో గుమిగూడారు. హౌతీ తిరుగుబాటుదారుల అల్-మసీరా శాటిలైట్ టీవీ ఛానెల్ ప్రకారం.. సనాలోని సీనియర్ ఆరోగ్య అధికారి మోతహెర్ అల్-మరౌనీ మరణాల సంఖ్య సమాచారాన్ని అందించారు. కనీసం 13 మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. మరోవైపు సాయుధ హౌతీ తిరుగుబాటుదారులు ప్రజలను నియంత్రించేందుకు గాలిలోకి కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలు భయాందోళనకు గురై పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగిందని పేర్కొన్నారు. కాగా, ఇద్దరు నిర్వహకులను అదుపులోకి తీసుకున్నామని, ఘటనపై విచారణ చేపట్టామని అంతర్గత మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇరాన్ మద్దతు కలిగిన హౌతీ తిరుగుబాటుదారులు సనాను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.