First Republic Bank Logo (Photo Credit- Facebook)

అమెరికాను బ్యాంకుల సంక్షోభం వెంటాడుతోంది. ఇప్పటికే రెండు బ్యాంక్‌ల పతనాన్ని చూసిన అమెరికాలో 14వ అతిపెద్దదైన ఫస్ట్‌ రిపబ్లిక్‌ బ్యాంక్‌ లిక్విడిటీ కొరతతో సంక్షోభంలోకి (First Republic Bank Down) కూరుకుపోతుందనే వార్తలు (Third collapse in a week) ఆందోళన కలిగిస్తున్నాయి. రెండు రోజుల క్రితమే ఈ బ్యాంక్‌ను రేటింగ్‌ ఏజెన్సీలు ఫిచ్‌, ఎస్‌ అండ్‌ పీలు డౌన్‌గ్రేడ్‌ చేశాయి. లిక్విడిటీ, ఫండింగ్‌ రిస్క్‌ల కారణంగా ఫస్ట్‌ రిపబ్లికన్‌ బ్యాంక్‌ రేటింగ్‌ ‘నెగిటివ్‌ వాచ్‌’లోకి డౌన్‌గ్రేడ్‌ అయ్యింది. వారంలోనే 70 శాతం పతనమైన ఫస్ట్‌ రిపబ్లికన్‌ షేరు గురువారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 30 శాతం మేర నష్టపోయింది. 1985లో ప్రారంభమైన ఈ బ్యాంక్‌ వాణిజ్య బ్యాంకింగ్‌ సర్వీసులతో పాటు ఇన్వెస్ట్‌మెంట్‌, వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసుల్ని సైతం నిర్వహిస్తున్నది.

లిక్విడిటీ కొరత నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం హుటాహుటిన ఫస్ట్‌ రిపబ్లికన్‌కు వివిధ వనరుల ద్వారా 70 బిలియన్‌ డాలర్ల నిధుల్ని ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ జేపీ మోర్గాన్‌ అందుబాటులో ఉంచినట్లు మరో వార్త బయటకు వచ్చింది.ఫెడ్‌ నుంచి లభించిన అదనపు బారోయింగ్‌ సదుపాయం, జేపీ మోర్గాన్‌ అందించిన నిధులతో ప్రస్తుతం బ్యాంక్‌ మనుగడ సాగిస్తున్నది. JP మోర్గాన్ చేజ్, సిటీ గ్రూప్, బ్యాంక్ ఆఫ్ అమెరికా కార్ప్, వెల్స్ ఫార్గో, గోల్డ్‌మన్ సాచ్స్ మరియు మోర్గాన్ స్టాన్లీలతో సహా పెద్ద US బ్యాంకులు గురువారం నాడు ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్‌లో $30 బిలియన్ల డిపాజిట్లను ఇంజెక్ట్ చేశాయని వార్తలు వస్తున్నాయి.

సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ దివాళా, డేంజర్ జోన్‌లో లక్ష ఉద్యోగాలు, 10 వేల స్టార్టప్‌లపై పెను ప్రభావం, భార‌త్‌లోని స్టార్ట‌ప్‌ల భవిత‌వ్యంపై ఆందోళన

స్విస్ బ్యాంక్ క్రెడిట్ సూయిస్ తన లిక్విడిటీని పెంచుకోవడానికి $54 బిలియన్ల వరకు అత్యవసర సెంట్రల్ బ్యాంక్ రుణాన్ని పొందిన ఒక రోజులోపే ఈ ప్యాకేజీ వచ్చింది, ఇది గ్లోబల్ బ్యాంకింగ్ సంక్షోభం గురించి భయాందోళనలను కొంతవరకు తగ్గించిందని తెలుస్తోంది.కాగా ఫస్ట్‌ రిపబ్లికన్‌ బ్యాంక్‌ డిపాజిట్లలో 70 శాతానికి ఇన్సూరెన్స్‌ లేదు. ఇటీవల సంక్షోభంలో కూరుకున్న సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌, సిగ్నేచర్‌ బ్యాంక్‌ల తర్వాత ఫస్ట్‌ రిపబ్లిక్‌కే ఇన్సూరెన్స్‌ లేని డిపాజిట్లు అధికంగా ఉన్నాయని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా ఒక నోట్‌లో తెలిపింది.

సిలికాన్ వ్యాలీ బ్యాంక్ సంక్షోభంపై బైడెన్ కీలక ప్రకటన, డబ్బు ఎక్కడికీ పోదంటూ ప్రజలకు, వ్యాపారులకు అమెరికా అధ్యక్షుడు హామీ

ఇక అమెరికా బ్యాంక్‌ల్లో మొదలైన సంక్షోభం త్వరితంగా యూరప్‌కు వ్యాపించింది. సిట్జర్లాండ్‌ కేంద్రంగా బ్యాం కింగ్‌ కార్యకలాపాలు నిర్వహించే క్రెడిట్‌ స్వీస్‌ అల్లకల్లోలమైంది. పదేండ్ల పాటు ఆర్జించిన లాభాలన్నీ ఒక్క ఏడాదిలోనే (2022) కోల్పోయామని, గత రెండేండ్ల తమ బ్యాలెన్స్‌ షీట్స్‌లో కొన్ని తప్పులు చోటుచేసుకున్నాయంటూ క్రెడిట్‌ స్వీస్‌ తాజాగా ప్రకటించడంతో ఆ షేరు బుధవారం స్విస్‌ స్టాక్‌ మార్కెట్లో 26 శాతంపైగా పతనమయ్యింది.బ్రిటన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, ఇటలీ తదితర యూరప్‌ దేశాల్లో బ్యాంక్‌ షేర్లు కుప్పకూలాయి.

ఇక అమెరికాలో యూబీఎస్‌, బీఎన్‌పీ పారిబా, సొసైటె జనరెలె, కామర్జ్‌బ్యాంక్‌, డాయిష్‌ బ్యాంక్‌, జేపీ మోర్గాన్‌, సిటీబ్యాంక్‌, హెచ్‌ఎస్‌బీసీ, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా తదితర పశ్చిమ దేశాల బ్యాంకింగ్‌ దిగ్గజాల షేర్లు నిలువునా పతనమయ్యాయి.యూఎస్‌కి చెందిన సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌, సిగ్నేచర్‌ బ్యాంక్‌ల పతన ప్రభావం అంతటా వ్యాపిస్తున్నదని, యూరప్‌లోని క్రెడిట్‌ స్వీస్‌కి ఈ సెగ తొలుత తాకిందని విశ్లేషకులు చెప్పారు. ప్రపంచంలో 8వ పెద్ద ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ అయిన క్రెడిట్‌ స్వీస్‌ వాణిజ్య బ్యాంకింగ్‌, అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కార్యకలాపాలను సైతం నిర్వహిస్తున్నది.