Las Vegas, Dec 07: అమెరికాలో మళ్లీ పేలిన తూటా, యూనివర్సిటీలోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపిన దుండగుడు, ముగ్గురు మృతి, నిందితుడు ఆత్మహత్య? అమెరికాలో మరోసారి జరిగిన కాల్పులు (US Firing) కలకలం రేపాయి. యునైటెడ్ స్టేట్స్ లాస్ వెగాస్‌లోని నెవాడా విశ్వవిద్యాలయంలో జరిగిన కాల్పుల (Las Vegas Firing) ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఈ కాల్పుల్లో నిందితుడు కూడా మరణించాడని యూఎస్ పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని యూఎస్ (US) అధికారులు తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తిని గుర్తించామని లాస్ వెగాస్ (Las Vegas Firing) పోలీసులు చెప్పారు.
At least three people are dead and one is in critical condition after a shooting at a Las Vegas university, police say https://t.co/utzcbxhWR0
— CNN Breaking News (@cnnbrk) December 6, 2023
కాల్పులు జరిపిన నిందితుడు పోలీసుల కాల్పుల్లో మరణించాడా లేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడా అనే విషయంపై స్పష్టత రాలేదు. కాల్పుల ఘటన అనంతరం యూనివర్శిటీని పోలీసులు ఖాళీ చేయించారు. బ్యాక్‌ప్యాక్‌లతో ఉన్న పలువురు విద్యార్థులను పోలీసులు క్యాంపస్ వెలుపలికి తీసుకెళ్లడం కనిపించింది. నెవాడా యూనివర్శిటీ క్యాంపస్ లో తుపాకీ కాల్పుల శబ్ధం వినిపించిందని ప్రొఫెసర్ విన్సెంట్ పెరెజ్ చెప్పారు.
కాల్పుల శబ్దాన్ని విని తాము లోపలకు పరుగెత్తామని ప్రొఫెసర్ చెప్పారు. కాల్పుల ఘటనతో దక్షిణ నెవాడా యూనివర్శిటీని మూసివేశారు. యూనివర్శిటీ సమీపంలోని రోడ్లను సైతం పోలీసులు మూసివేశారు. లాస్ వెగాస్ క్యాంపసులో 25వేలమంది అండర్ గ్రాడ్యుయేట్లు, 8వేల మంది పోస్టుగ్రాడ్యుయేట్లు చదువుతున్నారు. 2017వ సంవత్సరంలో లాస్ వెగాస్ లో ఓ సాయుధుడు హోటల్ నుంచి జరిపిన కాల్పుల్లో 60 మంది మరణించారు.