London, March 17: చైనాకు (China) చెందిన ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ (Tik Tok) కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. భారత్ సహా ఇప్పటికే పలు దేశాల్లో నిషేధానికి గురైన ఈ యాప్ కు బ్రిటన్ (Britain) లోనూ కష్టకాలం తప్పలేదు. ప్రభుత్వ కార్యాలయాల్లోని కంప్యూటర్లు, ఉద్యోగులకు ప్రభుత్వం అందించే ల్యాప్ టాప్ లు, ట్యాబ్ లు, స్మార్ట్ ఫోన్లలో టిక్ టాక్ వినియోగంపై బ్రిటన్ ప్రభుత్వం నిషేధం విధించింది. టిక్ టాక్ పై నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ప్రభుత్వం అనుమతించిన థర్డ్ పార్టీ యాప్ లను మాత్రమే వినియోగించాలని ఆదేశించింది. ప్రభుత్వ పరికరాల్లో ఎంతో సున్నితమైన సమాచారం ఉంటుందని, అందుకే ముప్పును నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు బ్రిటన్ ప్రభుత్వం వెల్లడించింది.
UK government phones issued to ministers and civil servants banned from using TikTok on security groundshttps://t.co/pqo8eMnyES
— BBC Politics (@BBCPolitics) March 16, 2023
కారణం ఏంటంటే?
యూజర్ల డేటాపై చైనాకు నియంత్రణ ఉండడమే టిక్ టాక్ పై ఆయా దేశాల బ్యాన్ కు కారణమని తెలుస్తోంది. కాగా, అమెరికా, బెల్జియం కూడా ఇంతకుముందే ప్రభుత్వ పరికరాల్లో టిక్ టాక్ పై నిషేధం విధించాయి. చట్టసభల్లో టిక్ టాక్ వినియోగించరాదని అమెరికా గతేడాది డిసెంబరులో ఆదేశాలు జారీ చేసింది. అటు, కెనడా, న్యూజిలాండ్ కూడా ఈ చైనా యాప్ పై నిషేధం కొరడా ఝుళిపించింది. భారత్ లో టిక్ టాక్ యాప్ పై 2020లోనే వేటు పడడం తెలిసిందే.
టిక్ టాక్ పై ఇప్పటివరకూ నిషేధం విధించిన దేశాలు ఇవే..
- భారత్
- అమెరికా
- బెల్జియం
- న్యూజిలాండ్
- కెనడా
- యూకే