New Delhi, OCT 07: దేశంలోనే అతిపెద్ద టూ వీలర్స్ కంపెనీ హీరో మోటో కార్ప్ మార్కెట్‌లోకి తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించింది. తమ ఈవీ బ్రాండ్ విదా ( VIDA ) కింద రెండు వేరియంట్లలో ఈ స్కూటర్‌ను తీసుకొచ్చింది. విదా వీ1 ప్రో (VIDA V1 Pro ), విదా వీ1 ప్లస్ ( Vida V1 Plus )లను శుక్రవారం ఆవిష్కరించింది. వీ1 ప్లస్ స్కూటర్ ధర రూ.1.45 లక్షలు, వీ1 ప్రో స్కూటర్ ధర రూ.1.59 లక్షలు పలుకుతుంది. రూ.2,499 పే చేసి ఈ స్కూటర్లు బుక్ చేసుకోవచ్చు. ఈ స్కూటర్‌తోపాటు కస్టమర్లు విదా ( VIDA ) ప్లాట్ ఫామ్, విదా ( VIDA) సర్వీసులు పొందొచ్చు. విదా వీ1 ప్రో ( Vida V1 Pro) స్కూటర్ 3.94 కిలోవాట్ల సామర్థ్యం, విదా వీ1 ప్లస్ ( Vida V1 Plus ) 3.44 కిలోవాట్ల స్వాప్పబుల్ (మార్చుకునే వెసులుబాటు గల) బ్యాటరీతో వస్తున్నాయి. సింగిల్ చార్జింగ్‌తో విదా వీ1 ప్లస్ ( Vida V1 Plus ) స్కూటర్‌పై 165 కి.మీ. దూరం ప్రయాణించొచ్చు.
Gear up for a Hero's welcome as we launch India’s #NotFirst #ElectricScooter 🛵 today at 1:15pm IST, at the Hero Global CIT, Jaipur.
Catch our launch Livestream on Facebook at https://t.co/FiUyeWC5VE or YouTube at https://t.co/QWzB2k8YDe #VidaEV #VidaEScooter pic.twitter.com/XD7NSMA6xC
— VIDA World (@VidaDotWorld) October 7, 2022
65 నిమిషాల్లోపు 80 శాతం చార్జింగ్ అవుతుంది. సింగిల్ చార్జింగ్‌తో విదా వీ1 ప్రో (Vida V1 Pro) 165 కిలోమీటర్లు, విదా వీ1 ప్లస్ ( Vida V1 Plus ) తో 143 కి.మీ. దూరం ప్రయాణం చేయొచ్చు. వైదా చార్జింగ్ నెట్‌వర్క్‌ను కస్టమర్లకు త్వరలో హీరో మోటో కార్ప్ తీసుకొస్తుంది. విదా వీ1 ప్రో, విదా వీ1 ప్లస్ స్కూటర్లు రెండూ గరిష్ఠంగా 80 కిమీ స్పీడ్‌తో దూసుకెళ్లగలవు. రెండింటికీ 7- అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ విత్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ కలిగి ఉంటాయి. విదా వీ 1 ప్రో స్కూటర్ 3.2 సెకన్లలో 40 కి.మీ. స్పీడ్, విదా వీ1 ప్లస్ స్కూటర్ 3.4 సెకన్లలో 40 కి.మీ స్పీడందుకుంటాయి.
LUNA: ‘లూనా’ బండి మళ్లీ వస్తోంది..!.. అయితే కొత్త అవతార్ లో.. ఎలక్ట్రిక్ వాహనంగా..
ఎకో, రైడ్, స్పోర్ట్ మోడ్‌లలో లభిస్తాయి. రెండింటికీ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. వీటితోపాటు కీలెస్ కంట్రోల్, ఎస్వోఎస్ అలర్ట్ ఫీచర్లు ఉంటాయి. విదా వీ1 ఫ్రంట్ డిస్క్ బ్రేక్, రేర్ డ్రమ్ బ్రేక్ ఫీచర్లు ఉంటాయి. 26 లీటర్ల స్టోరేజీ కెపాసిటీ ఉంటుంది. హీరో మోటో కార్ప్ న్యూ ఆల్ ఎలక్ట్రిక్ బ్రాండ్ విదా.. కొత్త లోగో, ఐడెంటిటీతో వస్తోంది.