New Delhi, March 17: చెక్ రిపబ్లిక్ కార్ల తయారీ కంపెనీ స్కోడా ఆటో (Skoda).. తన ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ కారు ‘ఎపిక్ (Epic)’ను ఆవిష్కరించింది. అత్యంత చౌక ఎలక్ట్రిక్ కారు ‘స్కోడా ఎపిక్’ను వచ్చే ఏడాది గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరిస్తుంది. అటుపై భారత్ మార్కెట్లోకి తీసుకు వస్తుంది. ఈ కారు ధర సుమారు రూ.23 లక్షలు (25 వేల యూరోలు) పలుకుతుంది. గ్లోబల్ మార్కెట్లలో ఫోక్స్ వ్యాగన్ ఐడీ.2 ఎలక్ట్రిక్ హ్యాచ్ బ్యాక్, భారత్ మార్కెట్లో టాటా నెక్సాన్.ఈవీ కారుతో పోటీ పడుతుంది. స్కోడా తీసుకొస్తున్న రెండో ఎలక్ట్రిక్ కారు ‘స్కోడా ఎపిక్’. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లలో స్కోడా ఎన్‌యాక్ (Enyaq) ఎలక్ట్రిక్ కారు ఒక్కటే అందుబాటులో ఉంది. ఈ ఏడాది చివర్లో భారత్ మార్కెట్లో ఎన్‌యాక్ (Enyaq)ను ఆవిష్కరిస్తారు. కంప్లీట్ బిల్ట్ యూనిట్ (CBU)గా విక్రయిస్తారు. గత నెలలో నిర్వహించిన మొబిలిటీ ఎక్స్‌పోలో ఎన్‌యాక్ మోడల్ కారును ఆవిష్కరించింది స్కోడా ఆటో.
What do you all think of the upcoming Skoda Epiq?
Our upcoming electric SUV is will premier in 2025, with extremely competitive pricing and fresh modern styling. We think it's set to be absolutely epic!#Skoda #Epiq #SkodaEpiq pic.twitter.com/r8e6m6yfXV
— White Dove Škoda (@WhitedoveSkoda) March 15, 2024
స్కోడా ఆటో తన ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ కారు స్పెషిఫికేషన్స్ వెల్లడించకున్నా మీడియా కథనాల ప్రకారం రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు – 38 కిలోవాట్లు, 56 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో లభిస్తుంది. బ్యాటరీ ఫుల్ చార్జింగ్‌తో 400 కి.మీ దూరం ప్రయాణిస్తుంది.ఫోక్స్ వ్యాగన్ గ్రూప్ ఎంఈబీ ఎంట్రీ ప్లాట్ ఫామ్ ఆధారంగా స్కోడా ఎపిక్ ఈవీ కారు డిజైన్ చేశారు. ఫ్రంట్‌లో యూనిక్ ఎల్ఈడీ లైటింగ్, స్కోడా వర్డ్‌మార్క్‌తో స్కల్‌ప్టెడ్ బాయ్‌నెట్ వస్తుంది. సిగ్నేచర్ గ్రిల్, గ్రిల్లెకు రెండు వైపులా న్యూ టీ-షేప్డ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, మ్యాట్రిక్స్ టెక్నాలజీతో హెడ్ లైట్స్, అమెరికాలో జీప్ ఎస్‌యూవీ మాదిరిగా మాసివ్ వెర్టికల్ స్లాట్స్ బంపర్ వస్తుంది.
స్కోడా ఎపిక్ గ్లాస్ స్లాపింగ్ రూఫ్ కలిగి ఉంటుంది. ఫ్లేర్డ్ వీల్ ఆర్చెస్, ఎయిరో డైనమిక్ ఎఫిషియెన్సీ కోసం రూఫ్ లైన్‌లో రూఫ్ స్పాయిలర్ విలీనం చేస్తారు. రేర్‌లో టీ-షేప్డ్ ఎల్ఈడీ టెయిల్ లైట్స్, స్ట్రాంగ్ బంపర్, టెయిల్ గేట్‌పై స్కోడా డార్క్ క్రోమ్ ఉంటాయి. స్కోడా ఎపిక్ కారు క్యాబిన్‌లో డ్యుయల్ టోన్ థీమ్, టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, 5.3 అంగుళాల డ్రైవర్ డిస్ ప్లే, 13 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్ లెస్ చార్జింగ్ ఫీచర్లు ఉంటాయి.