Business
Airtel RS.4 Lakh Insurance Plan: ప్రీపెయిడ్‌ కస్టమర్లకు ఎయిర్‌టెల్ బంపరాఫర్, రూ.599 ప్లాన్‌ మీద రూ.4 లక్షల బీమా సౌకర్యం, భారతి ఆక్సా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీతో ఒప్పందం, ప్లాన్ పూర్తి వివరాలు తెలుసుకోండి
Hazarath Reddyభారతి ఎయిర్‌టెల్‌ (Airtel) తన ప్రీపెయిడ్‌ కస్టమర్ల (prepaid plan Users) కోసం బంపర్‌ఆఫర్‌ తీసుకొచ్చింది. రూ.599 ప్లాన్‌ (Rs 599 prepaid plan) రీచార్జ్‌ చేసుకున్న వినియోగదారులకు రూ.4 లక్షల విలువైన బీమా సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఇందుకోసం భారతి ఆక్సా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ(Bharti AXA Life Insurance)తో ఒప్పందం కుదుర్చుకుంది.
Jio Discount Offers: జియో మరో బంపరాఫర్, పేటీఎం ద్వారా రీఛార్జ్ చేసుకుంటే రూ.50 తగ్గింపు, రూ.444, రూ.555 ప్యాక్‌లపై మాత్రమే, కోడ్ వివరాలు తెలుసుకోండి
Hazarath Reddyదేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో ఐయూసీ ఛార్జీలు అమల్లోకి వచ్చిన తరువాత రీఛార్జ్ ప్యాక్ రేట్లు పెరిగిపోయాయి. రూ.399 రీఛార్జ్ కు 1.5 జిబి డేటాను అందిస్తున్న జియో దానికి అదనంగా ఐయూసీ ఛార్జీలను తీసుకుంటోంది. ఈ పాలసీ అమల్లోకి వచ్చిన తరువాత జియో ఆల్ ఇన్ వన్ ప్యాక్ ల పేరుతో రూ.444, రూ.555 ఆఫర్లను ప్రవేశపెట్టింది.
LPG Cylinder Price Hike Again: మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర, ఏకంగా రూ.76 పెంపు, ప్రస్తుత ధర రూ.733.50, సబ్సిడీ సిలిండర్‌ ధరలో ఎటువంటి మార్పు లేదు
Hazarath Reddyమధ్యతరగతి ప్రజలకు నవంబర్ 1వ తేదీ షాక్ తగిలింది. వంట గ్యాస్ ధర పెరిగింది. ఎల్‌పీజీ సిలిండర్ ధర పెరుగుదల నవంబర్ 1 నుంచి అమలులోకి వచ్చింది. సిలిండర్ ధర ఏకంగా రూ.76 మేర పెరిగింది. ఇదిలా ఉంటే నాలుగు నెలలుగా ధర పైపైకి వెళ్తోంది.
Audi Car Bumper Offer: ఆడి ఎస్‌యూవీలపై రూ.6లక్షల తగ్గింపు, పరిమిత కాల ఆఫర్‌గా డిస్కౌంట్, 2009లో లాంచ్ అయిన క్యూ5, క్యూ7 ఎస్‌యూవీ కార్లు, ప్రారంభ ధర రూ.55.8 లక్షలు
Hazarath Reddyఆటోమైబల్ రంగంలో దిగ్గజాలకు సవాల్ విసురుతున్న జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి కారు అభిమానుల కోసం బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఈ కంపెనీ నుంచి వచ్చిన ప్రముఖ ఎస్‌యూవీలపై రూ. 6లక్షల దాకా భారీ తగ్గింపును ఆఫర్‌ చేస్తోంది. పరిమిత కాల ఆఫర్‌గా ఈ డిస్కౌంట్‌ను అందిస్తున్నట్టు ఆడి ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.
Gold Prices: సామాన్యులకు అందని ద్రాక్షల బంగారం, డిసెంబర్ నాటికి 10 గ్రాముల బంగారం ధర రూ. 42 వేల గరిష్టానికి చేరుకోవచ్చని అంచనా, ఆర్థిక మందగమనంతో పాటు ఎన్నో కారణాలు
Vikas Mandaసామాన్యులకు అందని ద్రాక్షగా బంగారం మారిపోయింది. భారీ ధరల కారణంగా సామాన్య, మధ్య తరగతి వర్గాల్లో ఈ దీపావళి వెలుగులు నింపలేకపోయింది. ఈ ఏడాది మార్కెట్లో బంగారం కొనుగోళ్లు దారుణంగా పడిపోయాయి....
Discount Sales Ban: బ్యాన్ దిశగా డిస్కౌంట్ సేల్స్, ఈ కామర్స్ దిగ్గజాల వ్యాపారంపై కేంద్ర ప్రభుత్వం కన్ను, ఫిర్యాదు చేసిన సీఏఐటీ, డిస్కౌంట్‌ దందాపై దర్యాప్తు చేపడతామన్న కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌
Hazarath Reddyఈ కామర్స్ దిగ్గజాలు పండుగ సమయాల్లో ప్రకటిస్తున్న డిస్కౌంట్ దందాలపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది. మొత్తం ఏడాది వ్యాపారంలో సగం పండగ సీజన్‌లోనే జరుగుతుందనే అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ) వరుస ఫిర్యాదుల నేపథ్యంలో మోడీ ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది.
Jio Phone All-in-One Plans: జియో ఆల్‌ ఇన్ వన్ ప్లాన్స్‌, జియో ఫోన్ వాడేవారికి ఇది శుభవార్తే, ఒకే ప్లాన్‌లో అన్ని రకాల సేవలు, ఈ మధ్య ప్రకటించిన కొత్త ప్లాన్ల వివరాలు కూడా తెలుసుకోండి
Hazarath Reddyరిలయన్స్ జియో తమ 4జీ ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్లను ప్రవేశపెట్టింది. రూ.75-రూ.185 మధ్య ప్రవేశపెట్టిన ఈ ప్లాన్లు ప్రస్తుతం ఉన్న వాటికి అదనమని కంపెనీ తెలిపింది. కాగా కొద్ది రోజుల క్రితమే స్మార్ట్‌ఫోన్‌లో జియో ఉపయోగించేవారికి ఆల్‌ ఇన్ వన్ ప్లాన్స్‌ను జియో ప్రకటించిన సంగతి తెలిసిందే.
Reliance Jio New Strategy: అప్పులు లేని కంపెనీగా జియో, డిజిటల్ సేవల కోసం ప్రత్యేక సంస్థ ఏర్పాటు, ఇందుకోసం రూ.1.08 లక్షల కోట్ల పెట్టుబడి,సరికొత్త వ్యూహంతో ముకేష్అంబానీ
Hazarath Reddyచమురు నుంచి టెలికం రంగం వరకు సేవలు అందిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా డిజిటల్ సేవలు అందించడానికి ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది.ఇందులో భాగంగా రిలయన్స్‌ జియో (ఆర్‌జియో) లిస్టింగ్‌ దిశగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) ప్రయత్నాలు ప్రారంభించింది.
Mobikwik Gold Offer: మొబిక్విక్ మెగా ఎక్స్చేంజ్ వన్ గెట్ వన్, 1 గ్రాము డిజిటల్ గోల్డ్‌ మార్చుకుంటే ఒక గ్రాము డిజిటల్ గోల్డ్ ఉచితం, ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు ఆఫర్ వర్తింపు, పరిమిత కాలం మాత్రమే
Hazarath Reddyదీపావళి, ధన్‌తేరాస్ సందర్భంగా ప్రముఖ ఇ-వాలెట్ సంస్థ మొబీక్విక్ యూజర్ల కోసం మెగా ఎక్స్చేంజ్ వన్ గెట్ వన్ ఆఫర్ ప్రకటించింది. ఈ పండుగ సీజన్‌లో బంగారం కొనుగోలు చేసే వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరింది.
Fuel Home Delivery: ఇక మీ ఇంటికే పెట్రోల్, డీజిల్, ఎంత కావాలంటే అంత ఆర్డర్ చేసుకోవచ్చు, కసరత్తు చేస్తున్నకేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ, యాప్‌ను రెడీ చేస్తున్న చమురు సంస్థలు
Hazarath Reddyకేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ త్వరలో శుభవార్తను అందించబోతోంది. ఇకపై మీరు నేరుగా డీజిల్, పెట్రోల్ కోసం పెట్రోలు బంకులు చుట్టూ తిరగకుండా మీ ఇంటికే నేరుగా అవి వచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు పెట్రోలియం ఎక్స్ ప్లోజివ్స్ భద్రతా విభాగం (PESO)తో కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.
Modi New Schemes: రోజుకు రూపాయి చెల్లిస్తే రూ.2 లక్షల భరోసా, రెండు కొత్త పథకాలను ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం, అదరహో అనిపిస్తున్న మోడీ స్కీముల గురించి తెలుసుకోండి
Hazarath Reddyకేంద్ర ప్రభుత్వం రెండు కొత్త పథకాలను ప్రవేశపెట్టింది. ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై)Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana (PMJJBY)ను అలాగే ప్రధానమంత్రి సురక్షా యోజన (పీఎంఎస్‌బీవై)Pradhan Mantri Suraksha Bima Yojana (PMSBY)ల పేరుతో ఇన్సూరెన్స్ స్కీమ్స్‌ను అందిస్తోంది. వీటి కాలపరిమితిని ఏడాదిగా నిర్ణయించింది.
Uber-Ola Drivers On Strike: తెలంగాణకి మరో షాక్, ఈ నెల 19 నుంచి హైదరాబాద్ క్యాబ్ డ్రైవర్ల నిరవధిక సమ్మె, అదే రోజున సమ్మెలోకి వెళుతున్న ఆర్టీసీ కార్మిక సంఘాలు
Hazarath Reddyతెలంగాణా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వాసులకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే తెలంగాణాలో 13 రోజుల నుంచి ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. అందరూ ప్రత్యామ్నాయ మార్గాలతో గమ్యస్థానానికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరో వర్గం కూడా సమ్మెకు సిద్ధమైంది. ఈనెల 19 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్టు తెలంగాణ ట్యాక్సీ, డ్రైవర్ల జేఏసీ నిర్ణయించింది.
Satya Nadella: అమెరికాను ఏలుతున్న తెలుగువాడు, ఏడాదికి రూ.305 కోట్ల ప్యాకేజీతో దుమ్మురేపిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల, ప్రగతి పథంలో దూసుకెళ్తున్న మైక్రోసాఫ్ట్, ప్రశంసలతో ముంచెత్తిన బోర్డు డైరకర్లు
Hazarath Reddyతెలుగువాడు సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఆ సంస్థ అమితవేగంతో దూసుకువెళుతోంది. క్యాపిటలైజేషన్ విషయంలో మైక్రోసాఫ్ట్ ఇటీవల 1 ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను అందుకుంది.
Coriander Price Hike: ఉల్లిగడ్డతో పోటీకి కొత్తిమీర సై, అమాతంగా పెరిగిన ధర, 2రూపాయిల నుంచి 17 రూపాయిలకు చేరిక, నవంబర్ నెలలో ఇంకా పెరిగే అవకాశం
Hazarath Reddyకొత్తిమీర వంటకాలకు మంచి సువాసనను ఇవ్వడమే కాకుండా బరువును తగ్గించడంలో దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇందులోని సి,కె. ఐరన్, క్యాల్షియం వంటివి పుష్కలంగా వున్నాయి.
PF Interest Credit: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే మీ ఖాతాలో వడ్డీ క్రెడిట్ అయింది, పీఎఫ్ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంతుందో చెక్ చేయడం ఎలాగో తెలుసుకోండి?
Hazarath Reddyఈపీఎఫ్ ఖాతాదారులకు ఎంప్లాయిస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గానైజేషన్ (EPFO)శుభవార్తను అందించింది. దీపావళి సెలబ్రేషన్ ను మీఇంటికి తీసుకువచ్చింది. పండగకు ముందుగానే 2018-2019 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చాలామంది పీఎఫ్ అకౌంట్ దారుల అకౌంట్లలో 8.65 శాతం వరకు వడ్డీని క్రెడిట్ చేసింది.
Raghuram Rajan: బ్యాకింగ్ వ్యవస్థను వెంటనే ప్రక్షాళన చేయాలి, ప్రమాదకర స్థాయిలో భారత ద్రవ్యలోటు, కీలక నిర్ణయాలలో రాజకీయ వ్యవస్థ జోక్యం తగదు, హెచ్చరించిన ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌
Hazarath Reddyభారత ద్రవ్య లోటు ప్రమాదకర స్థాయిలో ఉందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ హెచ్చరించారు. 2016లో భారత వృద్ధి రేటు 9శాతం ఉండగా, క్రమక్రమంగా ఇప్పుడు అయిదు శాతానికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు.
Whatsapp Disappear: గూగుల్ ప్లే స్టోర్ నుంచి సడన్‌గా వాట్సప్ మాయం, కొత్తగా ఇన్‌స్టాల్‌ చేసుకునే వారికి కనపడని యాప్, అందుబాటులో వాట్సప్ ఫర్‌ బిజినెస్‌
Hazarath Reddyఇన్‌స్టంట్ మెసేజింగ్ రంగంలో దూసుకుపోతున్న మెసేజింగ్ దిగ్గజం యూజర్లకు ఒక్కసారిగా షాకిచ్చింది. కొత్తగా ఇన్‌స్టాల్‌ చేసుకోవడానికి ప్రయత్నించిన యూజర్లకి గూగుల్ ప్లే స్టోర్ లో ఈ యాప్ ఎంత వెతికినా కనపడలేదు.
Jio Good News: జియో యూజర్లకు ఊరట, మీ ప్లాన్ ముగిసే దాకా ఎటువంటి ఛార్జీలు ఉండవు, ఆ తర్వాత ఖచ్చింతగా రీఛార్జ్ చేసుకోవాల్సిందే, ట్విట్టర్ ద్వారా తెలిపిన జియో
Hazarath Reddyటెలికం దిగ్గజం రిలయన్స్ జియో ఇంటర్‌కనెక్ట్ యూజ్ చార్జీల పేరుతో యూజర్ల దగ్గర నుంచి బాదుడు మొదలుపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఇకపై యూజర్లు ఇతర నెట్‌వర్క్‌లకు చేసే అవుట్‌గోయింగ్ కాల్‌లకు నిమిషానికి ఆరు పైసలు వసూలు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
Jio Charge For Calls: ఇకపై జియోలో ఉచిత కాల్స్ ఉండవు, ఔట్ గోయింగ్ కాల్స్‌పై నిమిషానికి 6 పైసల చొప్పున ఛార్జ్, కొత్త టాపప్ వోచర్స్ వివరాలు ఇలా ఉన్నాయి
Vikas Mandaఇతర నెట్ వర్క్స్ కారణంగా ట్రాయ్ (TRAI) నుంచి వచ్చిన ఒత్తిడి మేరకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు జియో నెట్ వర్క్ ఒక ప్రకటనలో తెలిపింది. IUC ఛార్జీలకు బదులుగా వసూలు చేసిన మొత్తానికి డేటాను ఉచితంగా అందిస్తామని వెల్లడించింది. గత మూడేళ్లలో IUC ఛార్జీల కింద ఎయిర్ టెల్, వోడాఫోన్ మరియు ఐడియా లాంటి...
EMI Offers On Debit Card: మీ డెబిట్ కార్డుకు ఈఎమ్ఐ ఆఫర్ ఉందో లేదో తెలుసుకోవడం ఎలా?, లిమిట్ వివరాలు తెలుసుకోవడం ఎలా?, స్టెప్ బై స్టెప్ మీకోసం
Hazarath Reddyబ్యాకింగ్ రంగంలో దూసుకుపోతున్న ప్రముఖ ప్రభుత్వ బ్యాకింగ్ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) (state bank of india)తన కస్టమర్లకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇకపై ఎస్‌బీఐ డెబిట్ కార్డును వాడే వినియోగదారుల ఈఎంఐ సౌకర్యాన్ని పొందవచ్చు.