Credits: Twitter

Newdelhi, Feb 17: ప్రపంచంలోనే  దిగ్గజ టెక్నాలజీ కంపెనీల్లో భారతీయుల హవా నడుస్తున్నది. మొన్న సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google) సీఈవోగా సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ (Microsoft) సీఈవోగా సత్య నాదెళ్ల, నిన్న అడోబ్ (Adobe) సీఈవోగా శంతను నారాయణ్ వంటి భారతీయులు నియమితులు కాగా తాజాగా వీడియో స్ట్రీమింగ్, సోషల్ మీడియా దిగ్గజం యూట్యూబ్ (Youtube) సీఈవోగా (CEO) ఇండియన్-అమెరికన్ నీల్ మోహన్ (Neal Mohan) నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆ పదవిలో కొనసాగిన సూసన్ వొజిసికి (Susan Wojcicki) వైదొలగడంతో యూట్యూబ్‌లో చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్‌గా ఉన్న నీల్ మోహన్‌ను సీఈవోగా నియమించింది.

సెల్ఫీలు ఇవ్వనందుకు టీమిండియా బ్యాట్స్ మెన్‌పై బ్యాట్‌తో దాడి, ముంబైలో పృథ్వీషాపై అటాక్ చేసిన అభిమానుల గుంపు

స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఎలక్ట్రిక్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన నీల్ మోహన్ 2008 నుంచి గూగుల్‌లో పనిచేస్తున్నారు. అంతకుముందు ఆయన మైక్రోసాఫ్ట్, స్టిచ్ ఫిక్స్, జెనోమిక్స్ అండ్ బయోటెక్నాలజీ కంపెనీ  ‘23 అండ్ మి’లోనూ పనిచేశారు.

దేశంలో భారీగా పెరిగిన డేటా వినియోగం, సగటున నెలకు 19.5 GB డేటాను ఉపయోగిస్తున్న యూజర్, Nokia నివేదికలో వెల్లడి