ఎంటర్టైన్మెంట్

67th National Film Awards: దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు అందుకున్న రజనీకాంత్, నా ముగ్గురు ప్రాణ మిత్రులకు అవార్డును అంకింతం చేస్తున్నానని తెలిపిన దక్షిణాది సూపర్ స్టార్

Hazarath Reddy

భారతీయ సినీ పరిశ్రమలో అతిపెద్ద పురస్కారంగా భావించే ‘దాదా సాహెబ్‌ ఫాల్కే’ అవార్డు (Dadasaheb Phalke Award) సూపర్ స్టార్ రజనీకాంత్ అందుకున్నారు. ఈ అవార్డ్‌ను తన గురువు, స్నేహితులు, అభిమానులు, తమిళ ప్రజలు, తన సినీ కుటుంబానికి అంకితం ఇస్తున్నట్లుగా తెలిపారు. ఈ విషయం తెలుపుతూ ఆయన (South indian Superstar Rajinikanth) అధికారికంగా ఓ లేఖను విడుదల చేశారు.

HOOTE Launch: హూట్ యాప్ ప్రారంభించిన రజినీకాంత్, భారతదేశం నుండి ప్రపంచం కోసం అంటూ ట్వీట్ చేసిన సూపర్ స్టార్

Hazarath Reddy

సూపర్ స్టార్ రజనీకాంత్ "హూట్"ను ప్రారంభించారు, ఇది వాయిస్ ఆధారిత సోషల్ మీడియా యాప్‌. ఆయన కుమార్తె సౌందర్య విశాగన్ యామ్‌టెక్స్ సీఈఓ సన్నీ పోకాలతో కలిసి స్థాపించారు.

Telugu Actor Raja babu Dies: తెలుగు చిత్ర సీమలో మరో విషాదం, అనారోగ్యంతో ప్రముఖ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ రాజబాబు కన్నుమూత

Hazarath Reddy

టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్‌ నటుడు, ప్రముఖ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ రాజబాబు(64) (Senior Telugu actor Rajababu passes away) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గతరాత్రి మృతి (Telugu Actor Rajababu Dies) చెందారు.

Aryan Khan Drug Case: షారూక్ ఖాన్, బాలీవుడ్ న‌టి అన‌న్య పాండే ఇంటికి ఎన్సీబీ అధికారులు, విచార‌ణ‌కు హాజ‌రుకావాలంటూ ఆదేశాలు

Hazarath Reddy

బాలీవుడ్ న‌టుడు షారూక్ ఖాన్ షారూక్ నివాసం మ‌న్న‌త్ వ‌ద్ద‌కు ఇవాళ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు వెళ్లారు. డ్ర‌గ్స్ కేసులో షారూక్ కుమారుడు ఆర్య‌న్ ఖాన్ అరెస్టు అయిన విష‌యం తెలిసిందే. ఆర్డ‌ర్ రోడ్డు జైలులో ఉన్న ఆర్య‌న్‌ను ఇవాళ షారూక్ వెళ్లి క‌లిసాడు.

Advertisement

Aryan Khan Drug Case: ముంబై డ్రగ్స్ కేసు, 3వ సారి ఆర్యన్‌ ఖాన్‌కు కోర్టులో చుక్కెదురు, బెయిల్‌ నిరాకరించిన ముంబై స్పెషల్ కోర్టు, హైకోర్టును ఆశ్రయించిన షారుక్ ఖాన్‌ తనయుడు

Hazarath Reddy

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌కు మళ్లీ కోర్టులో చుక్కెదురైంది. తాజాగా ఆర్యన్‌ బెయిల్‌ పిటిషన్‌ను (Shah Rukh Khan’s Son’s Bail Application) విచారించిన స్పెషల్ ముంబై కోర్టు మరోసారి అతడికి బెయిల్‌ నిరాకరిస్తూ తీర్పునిచ్చింది.

Anasuya Bharadwaj: నా డ్రస్ కోడ్ మీకు నచ్చేలేదా, మీ తాగుబోతు తనం మంచిగా ఉందా, కోట శ్రీనివాసరావుపై మండిపడిన యాంకర్ అనసూయ, మిమ్మల్ని మీరు సంస్కరించుకోవాలని హితవు

Hazarath Reddy

టాలీవుడ్ నటి, యాంకర్ అనసూయ (Anasuya Bharadwaj) సీనియర్ నటుడు కోట తన డ్రెస్ కోడ్ పై చేసిన వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందించారు. తన దుస్తులు, వేషధారణపై ఓ సీనియర్ నటుడి (Kota Srinivas Rao) వ్యాఖ్యలు తీవ్రంగా బాధించాయని తెలిపారు.

Kota Srinivas Rao: అనసూయ డ్రస్ మార్చాలి, అప్పుడే బాగుంటుంది, సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు కోటా శ్రీనివాస రావు, ఆమె మీద గౌరవం ఉంది కాబట్టే అంటున్నానని వెల్లడి

Hazarath Reddy

ప్రముఖ యాంకర్‌, నటి అనసూయ భరద్వాజ్‌ డ్రస్ కోడ్ పై ప్రముఖ నటుడు కోటా శ్రీనివాస రావు (Kota Srinivas Rao) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనసూయ మంచి డ్యాన్సరే కాక మంచి నటి అని, అయితే ఆమె వేసుకునే బట్టలు మాత్రం తనకు నచ్చవని కామెంట్‌ చేశారు

MAA Conflict: మా కొత్త అసోసియేషన్ ఏర్పాటుపై ప్రకాష్ రాజ్ క్లారిటీ, ‘మా’ ప్యానెల్‌ నుంచి గెలిచిన 11 మంది రాజీనామా, ఎన్నికల వేళ రౌడీయిజం జరిగిందని ప్రకాష్‌రాజ్ ప్యానల్ వెల్లడి

Hazarath Reddy

మాలో వివాదం (MAA Conflict) మరింతగా ముదిరింది. ఈ నేపథ్యంలోనే ప్రకాశ్‌రాజ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ప్యానల్‌ నుంచి గెలిచిన సభ్యులందరం మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు.

Advertisement

Nagendra Babu: ప్రకాష్ రాజ్‌తోనే ఎల్లప్పుడూ ఉంటా, బలగం, ధన ప్రభావంతో మా ఎన్నికలు నీచ స్థాయికి చేరాయి, రాజీనామా లేఖలో నాగబాబు, అతిథిగానే ఉంటానని తెలిపిన ప్రకాష్ రాజ్

Hazarath Reddy

ఈ ఎన్నికలు నాలాంటి వారికి కనువిప్పు కలిగించాయి. బలగం, ధన ప్రభావంతో అసోసియేషన్ సభ్యులు దారుణంగా దిగజారిపోయాయి. ఇలాంటి హిపోక్రైట్స్, స్టీరియోటైప్ సభ్యుల కారణంగానే నేను అసోసియేషన్ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నాం. అయితే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే వ్యక్తి ప్రకాశ్‌ రాజ్‌. అలాంటి వ్యక్తి వెంటే నేను ఎల్లప్పుడూ నిలబడి ఉంటాను.

Mahesh Koneru Passed Away: గుండెపోటుతో తెలుగు సినీ నిర్మాత మహేశ్ కోనేరు మృతి, సంతాపం వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు, ఆత్మీయుడిని కోల్పోయానంటూ ఎన్టీఆర్ ట్వీట్

Hazarath Reddy

తెలుగు సినీ నిర్మాత మహేశ్ కోనేరు హఠాన్మరణం చెందారు. ఇవాళ ఉదయం గుండెపోటుతో ఆయన కన్నుమూశారు. '123 తెలుగు' అనే న్యూస్ సైట్ లో రివ్యూయర్, జర్నలిస్టుగా ఆయన తన కెరీర్ ను ప్రారంభించారు. ఆ తర్వాత ‘కంచె’ సినిమాతో ప్రచారకర్త, మార్కెటింగ్ వ్యూహకర్తగా మారారు.

MAA Elections 2021: నా తల్లిదండ్రులు తెలుగు వారు కాదు. అది నా తప్పా..నేను తెలుగు వాడిని కాకపోవడం నా దురదృష్టం, మా సభ్యత్వానికి రాజీనామా చేసిన ప్రకాష్ రాజ్, సినిమాల్లోకి జాతీయవాదం తీసుకువచ్చారని ఆవేదన

Hazarath Reddy

నా తల్లిదండ్రులు తెలుగు వారు కాదు. అది నా తప్పా. నేను తెలుగు వాడిని కాకపోవడం నా దురదృష్టం. అందుకే ‘మా’ (Movie Artists Association)సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.. ఇది ఆకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదు. ఓటమిని జీర్ణించుకున్నాకే రాజీనామా చేస్తున్నా’ అని పేర్కొన్నారు. అనంతరం తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

MAA Elections 2021 Results: మా ఎన్నికల్లో మంచు విష్ణు గెలుపు, ఓటమి పాలైన ప్రకాష్ రాజ్, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పోరులో ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ నుంచి శ్రీకాంత్‌ ఘన విజయం

Hazarath Reddy

హోరా హోరీగా సాగిన మా ఎన్నికల్లో మంచు విష్ణు (Vishnu Manchu) గెలుపొందారు. ప్రకాష్‌రాజ్‌ ఓటమి చెందారు. మొదటి నుంచి ఆధిక్యంలో కొనసాగుతున్న ఆయన ప్రకాశ్‌రాజ్‌పై (Prakash Raj) విజయం సాధించారు.

Advertisement

SS Rajamouli Birthday: ఎస్ ఎస్ రాజమౌళి పుట్టిన రోజు, సినీ ప్రముఖుల నుంచి వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు

Hazarath Reddy

దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli Birthday) 48వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Pragya Jaiswal Covid: ప్రముఖ తెలుగు హీరోయిన్‌కు మళ్లీ కరోనా, వ్యాక్సిన్ వేసుకున్నా రెండో సారి కోవిడ్ వచ్చిందంటూ ట్వీట్ చేసిన అఖండ మూవీ హీరోయిన్ ప్ర‌గ్యా జైస్వాల్‌

Hazarath Reddy

ప్రముఖ తెలుగు హీరోయిన్‌ ప్ర‌గ్యా జైస్వాల్‌ (pragya jaiswal) మరోసారి కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్‌ మీడియాలో ప్రకటించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తను పోస్ట్‌ షేర్‌ చేస్తూ.. ‘ఆదివారం నేను కరోనా పాజిటివ్ గా నిర్ధారణ (actress pragya jaiswal tested covid 19) అయ్యాను.

MAA Elections 2021: కౌగిలింతలు, కొరుకులాటలు మధ్య మా ఎన్నికలు, ఓటు హక్కును వినియోగించిన పలువురు ప్రముఖులు, సాయంత్రం వెలువడనున్న మా ఎన్నికల ఫలితాలు

Hazarath Reddy

శివబాలాజీని నటి హేమ కొరికిందని నరేశ్‌ ఆ గాయాన్ని మీడియాకు చూపించారు. శివబాలాజీ చేయి కొరకడంపై నటి హేమ క్లారిటీ ఇచ్చింది. తాను వెళ్తున్న క్రమంలో శివబాలాజీ చేయి అడ్డుగా పెట్టాడని, తప్పుకోమంటే తప్పుకోలేదని, అందుకే చేయి కొరకాల్సి వచ్చిందని హేమ చెప్పుకొచ్చారు.

Samantha Shares Cryptic Post: మగాళ్లను ఎందుకు ప్రశ్నించరు, నాపై ఎందుకు అంతలా దాడి చేస్తున్నారు, ద‌య‌చేసి నన్ను ఒంట‌రిగా వ‌దిలేయండి, చైతన్యతో విడిపోయిన తరువాత సుదీర్ఘ‌మైన పోస్ట్ పెట్టిన సమంత

Hazarath Reddy

ఇప్పుడు టాలీవుడ్ సినిమా ఇండ‌స్ట్రీలో నాగ చైత‌న్య‌- స‌మంత డైవ‌ర్స్ విష‌యం గురించే ఎక్కువ‌గా చ‌ర్చ న‌డుస్తుంది. సమంతను టార్గెట్ చేస్తూ కొందరు, చైతన్యను టార్గెట్ చేస్తూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగా స‌మంత త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స‌మాజం మ‌గాళ్లని ఎందుకు ప్ర‌శ్నించ‌దు (Questions Society For Judging Women) అనే కామెంట్ పెట్టి హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

MAA Elections 2021: సినిమా బిడ్డలమంటున్న ప్రకాష్ రాజ్, మాకోసం మనమందరం అంటున్న మంచు విష్ణు, రేపే మా ఎన్నికలు, భారీ బందోబస్తుతో ఏర్పాట్లు పూర్తి చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు

Hazarath Reddy

భారీ పోలీసు బందోబస్తు మద్య రేపు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు (MAA Elections 2021) జరగనున్నాయి. మా ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఎన్నికలు చర్చనీయాంశమయ్యాయి.

Annaatthe: అది బాలు చివరి పాట అవుతుందని కలలో కూడా ఊహించలేదు, రజినీకాంత్ ఎమోషనల్ ట్వీట్, అన్నాత్తే సినిమా నుంచి అన్నాత్తే… అన్నాత్తే టైటిల్ సాంగ్ విడుదల చేసిన చిత్ర బృందం

Hazarath Reddy

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం అన్నాత్తే సినిమా చేస్తున్న సంగతి విధితమే. ఈ సినిమా ను తమిళ్ స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తుoడగా… సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇక ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార, కుష్బూ, మీనా మరియు యంగ్ హీరో కీర్తి సురేష్ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Aryan Khan Drugs Case: 4 ఏళ్ళ నుంచి డ్రగ్స్ మత్తులో ఉన్నా, యూకే, దుబాయ్‌, ఇతర దేశాల్లో ఉన్నప్పుడు కూడా డ్రగ్స్‌ తీసుకున్నా, ఎన్‌సీబీ అధికారుల విచారణలో ఆర్యన్ ఖాన్

Hazarath Reddy

ముంబై తీరంలో ఒక క్రూయిజ్ షిప్‌లో రేవ్‌ పార్టీ జరుగుతుందని సమాచారం అందుకున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ దాడి చేసిన సంగతి తెలిసిందే. డ్రగ్స్‌ కేసులో (Aryan Khan Drugs Case) షారుక్ ఖాన్ కుమారుడు ఆర్య‌న్ ఖాన్‌తోపాటు మొత్తం 8మందిని ఎన్‌సీబీ అధికారులు అరెస్ట్ చేసి విచారించారు. అయితే కస్టడీలో ఆర్యన్‌ ఖాన్‌ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

Ram Pothineni: హీరో రామ్‌ పోతినేనికి గాయాలు, సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించిన రామ్‌, షూటింగ్‌కు బ్రేక్

Hazarath Reddy

హీరో రామ్‌ పోతినేని జిమ్‌లో వర్కవుట్స్‌ చేస్తుండగా ఆయన మెడకు గాయమైంది. ఈ విషయాన్ని స్వయంగా రామ్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. తనకు అయిన గాయాన్ని చూపిస్తూ ఫోటోను షేర్‌ చేశాడు. దీంతో 'రామ్‌ త్వరగా కోలుకోవాలి..గెట్‌ వెల్‌ సూన్‌' అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Advertisement