ఎంటర్టైన్మెంట్
Spandana Dies: పునీత్ రాజ్ కుమార్ ఫ్యామిలీలో మరొకరికి గుండె పోటు, హార్ట్ ఎటాక్‌తో నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన మృతి, సంతాపం తెలిపిన కర్ణాటక సీఎం
Hazarath Reddyమళయాల ప్రముఖ నటుడు,సింగర్‌ విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన గుండెపోటుతో మృతి చెందారు. బ్యాంకాక్‌కు విహారయాత్రకు వెళ్లిన స్పందన అక్కడ అకస్మాత్తుగా హార్ట్ ఎటాక్ బారీన పడటంతో తిరిగిరాని లోకాలకు వెళ్లారు.
Actress Sindhu Dies: ఆస్పత్రిలో చికిత్సకు డబ్బుల్లేక తెలుగు నటి మృతి, రొమ్ము క్యాన్సర్ బారీన పడి ప్రాణాలు వదిలేసిన షాపింగ్‌మాల్ సినిమా నటి సింధు
Hazarath Reddy2010లో విడుదలైన 'షాపింగ్‌మాల్' సినిమాలో నటించిన తెలుగుమ్మాయి సింధు రొమ్ము క్యాన్సర్ బారిన పడి మృతి చెందింది. ఆస్పత్రి ఖర్చులకు డబ్బులేక ప్రాణాలు వదిలేసింది. 2020లో రొమ్ము క్యాన్సర్ బారిన పడిన సింధు మధ్య తరగతి జీవితం కావడం..క్యాన్సర్ మహమ్మారి చికత్సకు డబ్బులు లేకపోవడంతో తిరిగి రాని లోకాలు వెళ్లింది.
Chiranjeevi Speech About Nepotism: నెపోటిజంపై చిరంజీవి కీలక వ్యాఖ్యలు, టాలెంట్‌ ఉంటే ఎవర్నీ ఆపలేం, మొన్న పవన్ కల్యాణ్ చెప్పిందే..ఇప్పుడు నేనూ చెప్తున్నా అంటూ మెగా కామెంట్స్‌
VNSఇటీవల బ్రో (Bro) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఈ పరిశ్రమ ఏ కుటుంబానికి చెందింది కాదని, ఎటువంటి అండ లేకుండా చిరంజీవి పరిశ్రమకి వచ్చి పెద్ద స్టార్ అయ్యాడని, ఆ తరువాత మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వారు కూడా ఎంతో కష్టపడే అభిమానుల మనసు గెలుచుకొని ఇండస్ట్రీలో నిలబడ్డారని పేర్కొన్నాడు.
Hyper Aadi Strong Counter: చిరు ఫ్యామిలీని విమర్శిస్తే కుర్చీ మడతపెట్టి.... ఇచ్చేస్తా! భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హాట్‌ కామెంట్స్ చేసిన హైపర్‌ ఆది, మాటలు వింటూ కన్నీళ్లు పెట్టుకున్న చిరంజీవి
VNSచిరుత ఎంట్రీ ఇస్తే వారసత్వం రంగు పూసి విమర్శించారు. ఇండస్ట్రీ హిట్టులు వస్తే దర్శకుడు కారణం, డిజాస్టర్ అయితే రామ్ చరణ్ కారణం అని చెప్పుకొచ్చారు. వారందరికీ రంగస్థలంతో చరణ్ గట్టి సమాధానం ఇచ్చాడు. చరణ్ ని విమర్శించే వారికీ నేను ఒకటే చెబుతున్నా.. సచిన్ కొడుకు సచిన్ అవ్వలేదు, అమితాబ్ బచ్చన్ కొడుకు అమితాబ్ అవ్వలేదు.
Ileana: మాతృమూర్తి అయిన ఇలియానా.. కుమారుడి పేరు కోవా ఫీనిక్స్ డోలన్ అని వెల్లడి.. సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న శుభాకాంక్షల సందేశాలు
Rudraప్రముఖ నటి ఇలియానా తల్లి అయ్యారు. ఆగస్టు 1న మగ బిడ్డకు జన్మనిచ్చినట్టు ఆమె ఇన్‌ స్టాలో తెలియజేశారు. కుమారుడికి కోవా ఫీనిక్స్ డోలన్ అని నామకరణం చేసిన నటి, ఆ చిన్నారి చిత్రాన్ని కూడా షేర్ చేస్తూ అభిమానులతో తన ఆనందాన్ని పంచుకున్నారు.
Tarun Marriage: మెగా ఫ్యామిలీకి అల్లుడు కాబోతున్నాడు అంటూ సోషల్ పెళ్లి ప్రచారంపై హీరో తరుణ్ క్లారిటీ
kanhaతరుణ్ వివాహం ఫిక్సయింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ విషయం మీద ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రచారం గురించి ఆయన మాట్లాడుతూ... ఈ ప్రచారం నిజం కాదు అని తేల్చి చెప్పారు.
Hero Naresh: కోర్టులో నటుడు నరేష్‌కి ఊరట, రెండో భార్య రమ్యరఘుపతి తన ఇంట్లోకి రాకుండా నిషేధం విధిస్తూ కోర్టు ఆదేశం.
kanhaసినీ నటుడు నరేష్ తన రెండో భార్య రమ్య రఘుపతిని నరేష్ నివసించే నానక్‌రామ్‌గూడ ఇంట్లోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ వేసిన ఇంజక్షన్ దావాను కోర్టు స్వీకరించింది
Jayasudha Joins BJP: బీజేపీలో చేరిన ప్రముఖ నటి జయసుధ, పేదలకు సేవ చేయాలనే ఉద్ధేశ్యంతోనే బీజేపీని ఎంచుకున్నట్లు వెల్లడి, వీడియో ఇదిగో
Hazarath Reddyప్రముఖ తెలుగు నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తదితరుల సమక్షంలో ఢిల్లీలో ఆమె కాషాయం తీర్థం పుచ్చుకున్నారు. తరుణ్ చుగ్ కండువాను కప్పి పార్టీలోకి స్వాగతించారు.
Nitin Chandrakant Desai Dies by Suicide: సినీ పరిశ్రమలో మరో సూసైడ్, లగాన్ ఆర్ట్ డైరక్టర్ నితిన్ చంద్రకాంత్ దేశాయ్ ఆత్మహత్య, 5 సార్లు జాతీయ అవార్డులు
Hazarath Reddyప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ చంద్రకాంత్ దేశాయ్ తన జీవితాన్ని అర్థాంతరంగా ముగించారు. తెలివైన ఆర్ట్ డైరెక్టర్, ప్రొడక్షన్ డిజైనర్.. కర్జాత్‌లోని తన స్టూడియోలో తన జీవితాన్ని ముగించుకున్నారని సోర్సెస్ ఈటీమ్స్‌కి తెలియజేసింది. అతను ND స్టూడియోస్ యజమాని. స్టూడియోలో ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. ఆయన అకాల మరణం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Nitin Desai Dies By Suicide: జోథా అక్బర్ ఆర్ట్ డైరక్టర్‌ నితిన్ దేశాయ్ ఆత్మహత్య, సొంత స్డూడియోలో ఉరేసుకున్న ఫేమస్‌ ఆర్ట్ డైరక్టర్, ఐదుసార్లు జాతీయ అవార్డులు అందుకున్న నితిన్ దేశాయ్
VNSప్రముఖ సినీ ఆర్ట్ డైరక్టర్ నితిన్ దేశాయ్ ఆత్మహత్య (Nitin Desai Dies By Suicide) చేసుకున్నారు. ముంబై సమీపంలోని కర్‌జట్‌లో ఉన్న ఎన్‌డీ స్టూడియోస్‌ లో ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. స్టూడియోలోని ఓ రూంలో నితిన్ దేశాయ్ ఉరేసుకున్నారు. 20 ఏళ్లుగా బాలీవుడ్‌లో ఫేమస్ ఆర్ట్ డైరక్టర్‌గా (Nitin Desai Dies By Suicide) ఉన్న నితిన్ దేశాయ్ ఆత్మహత్య బాలీవుడ్‌ను షాక్ కు గురిచేసింది.
Ambati Rambabu on Pawan Kalyan: పవన్ కొత్త సినిమాల పేర్లు లిస్టు ఇదిగో, ఇంకా అనేక పేర్లు పరిశీలనలో ఉన్నాయని సెటైర్లు పేల్చిన మంత్రి అంబటి రాంబాబు
Hazarath Reddyపవన్ కల్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం 'బ్రో'పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఘాటుగా స్పందించారు. ఈ సినిమాలో తనను అవమానించేలా శ్యాంబాబు క్యారెక్టర్ పెట్టారని ఆరోపించారు. పవన్ వ్యక్తిగత తీరుపై తాము కూడా ఓ సినిమా చేసే ఉద్దేశంతో కథను సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ సినిమాకు అనేక పేర్లు పరిశీలనలో ఉన్నాయన్నారు.
BRO Movie: మరి ఇంత పిచ్చా, బ్రో సినిమా పోస్టర్ ముందు బ్లేడుతో చేయి కోసుకున్న పవన్ అభిమాని, మా హీరో కోసం రక్తం, ప్రాణం ఇస్తానంటూ హల్ చల్
Hazarath Reddyబ్రో సినిమా ఆడుతున్న ఓ థియేటర్ ముందు అభిమాని బ్లేడుతో పలుమార్లు చేతిని కోసుకున్నాడు. పవన్ కళ్యాణ్ కోసం రక్తం, ప్రాణం ఇస్తానంటూ హల్ చల్ చేశాడు.
Prithvi on Ambati Rambabu: వీడియో ఇదిగో, అంబటి రాంబాబు ఎవరో నాకు తెలియదు, నటుడు పృథ్వీ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyబ్రో సినిమాలో మంత్రి అంబటి రాంబాబు పాత్ర వేయడం పై వస్తున్న కామెంట్ల పై స్పందించిన నటుడు పృథ్వీ. నాకు మంత్రి అంబటి ఎవరో తెలియదు. అంబటి రాంబాబు ఆస్కార్ లెవల్ నటుడేమీ కాదు ఇమిటేట్ చేయడానికి. ఓ పనికిమాలిన వెధవ, ఓ బాధ్యత లేని వెదవ, బారుల్లో తాగుతూ, అమ్మాయిలతో డ్యాన్స్ చేసే పాత్ర అని చేయాలని డైరెక్టర్ నాకు చెప్పారు.
Bhola Shankar Movie: భోళా శంకర్ సినిమా ప్రమోషన్స్‌ కోసం 120 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేసిన చిరంజీవి అభిమానులు, టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ చరిత్రలోనే అతిపెద్ద కటౌట్
Hazarath Reddyసూర్యాపేట - మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ కాంబినేషన్లో తెరకెక్కనున్న భోళా శంకర్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సూర్యాపేట జాతీయ రహదారి పక్కన రాజుగారి తోట రెస్టారెంట్ సమీపంలో ఏర్పాటు చేసిన భారీ కటౌట్ ఏర్పాటు చేసినట్లు అఖిల భారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ బైరు వెంకన్న గౌడ్ తెలిపారు
Dil Raju: ఫిలిం ఛాంబర్‌ ఎన్నికల్లో దిల్‌ రాజు ప్యానల్‌ గెలుపు, ప్రొడ్యూసర్‌ సెక్టార్‌లోని మొత్తం 12 స్థానాల్లో ఏడింటిలో దిల్‌రాజు ప్యానల్‌ గెలుపు..
kanhaఫిలిం ఛాంబర్‌ ఎన్నికల్లో దిల్‌ రాజు ప్యానల్‌ గెలుపు సాధించింది. ప్రొడ్యూసర్‌ సెక్టార్‌లోని మొత్తం 12 స్థానాల్లో ఏడింటిలో దిల్‌రాజు ప్యానల్‌ గెలుపొందింది.
Ambati Rambabu: 'బ్రో'లో అంబటిని ట్రోల్ చేసేలా సీన్.. పవన్ పై అంబటి కౌంటర్ ట్వీట్.. ఏంటా విషయం??
Rudraజనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి ఏపీ మంత్రి అంబటి రాంబాబు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. 'గెలిచినోడి డాన్స్ సంక్రాంతి.. ఓడినోడి డాన్స్ కాళరాత్రి' అని అంబటి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు పవన్ కల్యాణ్ ను ట్యాగ్ చేశారు.
NSR Prasad Passes Away: టాలీవుడ్ లో మరో విషాదం.. దర్శకుడు ఎన్ఎస్ఆర్ ప్రసాద్ కన్నుమూత.. గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ప్రసాద్
Rudraటాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు, రచయిత ఎన్ఎస్ఆర్ ప్రసాద్ (49) ఆకస్మిక మరణం చెందారు. గత కొంత కాలంగా క్యాన్సర్ తో పోరాడుతూ ఆయన కన్నుమూశారు. ఆర్యన్ రాజేశ్ హీరోగా దివంగత డి.రామానాయుడు నిర్మించిన 'నిరీక్షణ' చిత్రంతో ఆయన దర్శకుడిగా మారారు.
Brahmanandam Meets CM KCR: సీఎం కేసీఆర్ ను కలిసిన బ్రహ్మానందం దంపతులు
kanhaహైదరాబాదులో జరుగనున్న తన కుమారుని వివాహానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానిస్తూ.. శనివారం నాడు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కుటుంబ సమేతంగా కలిసి.. వివాహ ఆహ్వాన పత్రిక అందజేసిన సినీ నటుడు బ్రహ్మానందం. ఈ సందర్భంగా బ్రహ్మానందం దంపతులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
BRO Movie Chaos: థియేటర్లో స్క్రీన్ చింపేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అత్యుత్సాహం, అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyపార్వతీపురం మన్యం జిల్లా సౌందర్య థియేటర్లో పవన్ కళ్యాణ్ "బ్రో" సినిమాకు అభిమానులు అత్యుత్సాహంతో స్క్రీన్ పై పాలాభిషేకం చేసి తోపులాటలో స్క్రీన్ చింపారు. స్క్రీన్ చింపిన అభిమానులను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Pawan Kalyan BRO Movie Review: బ్రో సినిమా రివ్యూ ఇదిగో, ట్విట్టర్ వేదికగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
Hazarath Reddyమెగా హీరోలు పవన్‌ కల్యాణ్‌, సాయి ధరమ్‌ తేజ్‌ కలిసి నటించిన చిత్రం ‘బ్రో’. తమిళంలో భారీ విజయం సాధించిన వినోదయ సీతం చిత్రానికి తెలుగు రీమేక్‌ ఇది. నటుడు కమ్ డైరెక్టర్ సముద్రఖని ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించారు.