ఎంటర్టైన్మెంట్

Bro Movie Flexi Chaos: పవన్ కళ్యాణ్ బ్రో సినిమా ఫ్లెక్సీలు చించివేత, గూడురులో K3K సంగం థియేటర్ యాజమాన్యానికి, పవన్ అభిమానులకు మధ్య గొడవ

Hazarath Reddy

గూడూరులో K3K సంగం థియేటర్ దగ్గర గందరగోళం చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్ బ్రో సినిమా ఫ్లెక్సీలు చించివేయడంతో వివాదం చెలరేగింది. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ సందర్భంగా అభిమానులకు యాజమాన్యానికి మధ్య ఈ వివాదం జరిగింది.

Prabhas FB Hacked: ప్రభాస్ ఫేస్‌ బుక్ అకౌంట్ హ్యాక్.. సమస్యను వెంటనే పరిష్కరించిన టెక్నికల్ టీమ్

Rudra

ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫేస్‌బుక్ ఖాతా హ్యాకింగ్‌కు గురైంది. గురువారం సాయంత్రం ఆయన ఖాతాలో ఓ వైరల్ వీడియో కనిపించింది. మనుషులు దురదృష్టవంతులు అనే క్యాప్షన్ తో వున్న ఈ వీడియోను అభిమానులు, ఇతర నెటిజన్లు చూశారు.

Center on Movie Songs Played At Weddings: పెళ్లిళ్లలో సినిమా పాటలు ఉపయోగించడం కాపీరైట్ ఉల్లంఘన కిందకు రాదు, కేంద్రం కీలక ప్రకటన

Hazarath Reddy

పెళ్లిళ్లలో సినిమా పాటలను వినియోగించడం కాపీరైట్ ఉల్లంఘన కిందకు రాదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇలాంటి ఘటనల్లో కాపీరైట్‌ సొసైటీలు రాయల్టీని వసూలు చేయకూడదని స్పష్టం చేసింది.

HC on Bigg Boss Show: బిగ్‌బాస్‌ షోపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు, టీవీల్లో అసభ్యకర రీతిలో వచ్చే రియాల్టీ షోలకు సెన్సార్‌ లేకపోతే ఎలా అని మండిపాటు

Hazarath Reddy

బిగ్‌బాస్‌ షో నిలిపివేసేలా ఆదే­శాలు జారీ చేయాలని కోరుతూ వేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు నేడు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. టీవీల్లో అసభ్య, అభ్యత­రకర రీతిలో రియాల్టీ షోలు, ఇతర కార్యక్రమాల ప్రసారానికి ముందు సెన్సార్‌ చేయక­పోతే ఎలా అని హైకోర్టు ప్రశ్నించింది.

Advertisement

Bhairava Dweepam Re Release: బాలకృష్ణ సూపర్ ఫాంటసీ మూవీ రీ రిలీజ్‌, 4K క్వాలిటీలో మళ్లీ విడుదల కానున్న భైరవద్వీపం మూవీ, రిలీజ్ ఎప్పుడంటే?

VNS

బాలకృష్ణ సూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన ఫాంటసీ డ్రామా ‘భైరవ ద్వీపం’ (Bhairava Dweepam) త్వరలో రీ రిలీజ్ కాబోతుంది.ఇప్పటికే బాలకృష్ణ సినిమాల్లో నరసింహ నాయిడు, చెన్నకేశవ రెడ్డి సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు భైరవ ద్వీపం సినిమా రీ రిలీజ్ కాబోతుంది. సింగీతం శ్రీనివాసరావు (Singitham srinivasrao) దర్శకత్వంలో తెరకెక్కిన భైరవ ద్వీపం 1994లో రిలీజయి భారీ విజయం సాధించింది.

Chiranjeevi: చిరంజీవిపై నమోదైన కేసును కోట్టేసిన ఏపీ హైకోర్టు, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నేతగా కోడ్ ఉల్లంఘించారని గుంటూరులో కేసు నమోదు

Hazarath Reddy

గుంటూరులో నిర్ణీత సమయంలో సభ ముగించకపోవడంతో ట్రాఫిక్‌ సమస్యలు వచ్చాయని, ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారంటూ అప్పట్లో కాంగ్రెస్‌ నేతగా ప్రచారంలో పాల్గొన్న చిరంజీవిపై కేసు నమోదు చేశారు

Jayant Sawarkar Dies: చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం, ప్రముఖ బాలీవుడ్ నటుడు జయంత్ సావర్కర్ కన్నుమూత

Hazarath Reddy

ప్రముఖ బాలీవుడ్ నటుడు జయంత్ సావర్కర్ కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన థానేలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు కౌస్తుభ్ సావర్కర్ తెలిపారు. ప్రస్తుతం ఆయన వయసు 87 ఏళ్లు .

Chandramukhi-2: చంద్రముఖి-2పై ఆసక్తి పెంచేసిన ఎంఎం కీరవాణి.. పాత్రలు చావు భయంతో నిద్రలేని రాత్రులు గడిపితే... ఆ సీన్లకు జీవం పోసేందుకు తాను నిద్రలేని రాత్రులు గడిపానన్న ఆస్కార్ విజేత

Rudra

హారర్ చిత్రాలకు కొత్త అర్థం చెప్పిన సినిమా చంద్రముఖి. ఇప్పుడు ఆ మూవీకి కొనసాగింపుగా చంద్రముఖి-2 వస్తోంది. రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ జంటగా పి.వాసు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి దర్శకత్వం వహిస్తున్నారు.

Advertisement

Biggboss 7 Telugu: మరింత కిక్కెక్కించనున్న బిగ్‌ బాస్‌ సీజన్ 7, సరికొత్త సవాళ్లు అంటూ హింట్ ఇచ్చిన కింగ్ నాగార్జున, బిగ్ బాస్ తెలుగు కొత్త సీజన్ ప్రారంభానికి ముందు సరికొత్త ప్రోగ్రాం

VNS

దానికి అర్థం ఏమిట‌ని’ కింగ్‌ను సుమ అడుగుతుంది. ‘న్యూ గేమ్, న్యూ ఛాలెంజెస్‌, న్యూ రూల్స్ ‘అంటూ కింగ్‌ స‌మాధానం చెప్పారు. నాగ్ చెప్పిన దాన్ని బ‌ట్టి చూస్తుంటే ఈ సారి బిగ్‌బాస్ సీజ‌న్ స‌రికొత్తగా ఉండ‌నుంద‌ని తెలుస్తోంది. షో ఎలా ఉంటుంద‌నేది చూడాల్సిందే.

Bro Movie Trailer: పవన్ ఫ్యాన్స్‌కు ఇక పండుగే, కామెడీ-యాక్షన్-కమర్షియల్ హంగులు అన్నీ కలబోతగా బ్రో ట్రైలర్

VNS

సరిగ్గా పది రోజులకు ఈ పాటికి బ్రో సినిమాతో (BRO) థియేటర్‌లు దద్దరిల్లిపోతుంటాయి. టాక్‌ ఎలా ఉన్నా పవన్‌ క్రేజ్‌తో తొలిరోజు హంగామా ఎలాగూ ఉంటుంది. ఒకవేళ పాజిటీవ్‌ టాక్‌ గనుక వచ్చిందంటే కోట్లు కొల్లగొట్టడం ఖాయం. ఇప్పటికే రిలీజైన టీజర్‌, పాటలు మెగా అభిమానుల్లో మాములు అంచనాలు క్రియేట్‌ చేయలేవు.

Kalki 2898 AD: ప్రభాస్ కల్కి సీక్రెట్ బయటపెట్టిన కమల్‌ హాసన్, విలన్‌గా ఎందుకు ఒప్పుకున్నారనే దానిపై ఫుల్ క్లారిటీ ఇచ‍్చేసిన స్టార్ హీరో

Hazarath Reddy

కమల్ హాసన్ కూడా కీలకపాత్ర పోషిస్తున్నట్లు బయటపెట్టారు. ఇందులో ఆయన విలన్ లేదా మరేదైనా పాత్ర చేస్తున్నారా అని అందరూ అనుకున్నారు. కామికాన్ ఈవెంట్‌కి హాజరైన కమల్.. సినిమాలో తన రోల్‌పై ఫుల్ క్లారిటీ ఇచ‍్చేశారు. ఓ సినిమాలో హీరో పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో.. విలన్ రోల్ కూడా అంతే ఇంపార్టెంట్.

Kalki 2898 AD: ప్రభాస్ కల్కి స్టోరీ లైన్, విడుదల తేదీ ఇదే, ఈ ప్రపంచంలో చీకటి వచ్చినప్పుడల్లా ఒక శక్తి పుడుతుంది, ఆ శక్తే కల్కి అవతారం

Hazarath Reddy

పాన్ ఇండియా స్టార్' ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న 'ప్రాజెక్ట్ కె' చిత్రం జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ సందడి చేస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమా 'ప్రాజెక్ట్ కె' అనే పేరు మాత్రమే ఉండేది. ఇప్పుడు ఈ చిత్రానికి 'కల్కి' అనే టైటిల్‌ని ఖరారు చేశారు.

Advertisement

Pushpa-2 Dialogue Leak: అభిమానులకు అల్లు అర్జున్ ఊహించని సర్‌ ప్రైజ్.. పుష్ప-2 డైలాగ్ తో సందడి.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్.. ‘బేబీ’ ఈవెంట్‌లో ఘటన

Rudra

‘తగ్గేదే లే’ అంటూ పుష్ప మూవీతో ఎంతగానో అలరించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప-2లో విభిన్న గెటప్ లో రెట్టింపు జోష్ గా కనిపిస్తున్నారు. ఈ సీక్వెల్ లో అర్జున్ ఏ పంచ్ డైలాగ్ చెప్పబోతున్నారో అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది.

Project K Title Kalki 2898 AD: ప్రాజెక్ట్ కే టైటిల్ విడుదల, కల్కి 2898 ఏడీ అంటూ రివీల్ చేసిన చిత్ర యూనిట్..సూపర్ హీరోగా ప్రభాస్, స్టార్ వార్స్ తరహాలో యాక్షన్ చిత్రం..

kanha

ప్యాన్ ఇండియా ప్రేక్షకులు ఎదురు చూస్తున్న ‘ప్రాజెక్ట్‌ కె’ టైటిల్‌, గ్లింప్స్‌ రిలీజ్ చేశారు. రెబెల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి టైటిల్‌ను ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD)గా చిత్రబృందం ఖరారు చేసింది.

Klin Kaara Konidela Welcome Video: చిరంజీవి మనవరాలు క్లీంకార వన్ మంత్ బ‌ర్త్ యానివ‌ర్స‌రీ వీడియో ఇదిగో, ఉపాసన ఎన్నో త్యాగాలు చేసిందంటూ సాగిన వీడియో

Hazarath Reddy

ఈ రోజు(జూలై 20) రామ్ చరణ్ సతీమణి ఉపాసన పుట్టినరోజు. ఈ క్రమంలోనే అందరూ ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. తన సతీమణి ఉపాసనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ రామ్‌చరణ్‌ తాజాగా ఓ స్పెషల్‌ వీడియో షేర్‌ చేశారు. ఈ పదకొండేళ్ల తమ వైవాహిక బంధంలో ఉపాసన ఎన్నో త్యాగాలు చేసిందని ఆయన అన్నారు.

Prabhas Project K First Look: అది ప్రభాస్ బాడీయేనా, లేక తల అతికించారా, ప్రాజెక్ట్ K ఫస్ట్ లుక్‌పై నెటిజన్ల నుంచి ఘోరమైన ట్రోల్స్

Hazarath Reddy

రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త చిత్రం ప్రాజెక్ట్ K ఫస్ట్ లుక్ విడుదలైంది. ఐరన్ మ‍్యాన్ పోజులో ఉన్న ఈ లుక్‌లో ప్రభాస్ తల వేరే ఎవరి శరీరానికో అతికించినట్లు ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Jeevitha and Rajasekhar: చిరంజీవి బ్లడ్ బ్యాంకు‌పై వివాదాస్పద వ్యాఖ్యలు, జీవిత, రాజశేఖర్ దంపతులకు ఏడాది జైలుశిక్ష.. బెయిల్

Hazarath Reddy

పరువునష్టం కేసులో జీవిత, రాజశేఖర్ దంపతులకు నాంపల్లిలోని 17వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఏడాది జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించింది. 2011లో చిరంజీవి బ్లడ్ బ్యాంకు పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, దాతల నుంచి ఉచితంగా సేకరించిన రక్తాన్ని మార్కెట్లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు.

Writer Sri Ramana Passes Away: టాలీవుడ్‌ లో మరో విషాదం, అనారోగ్యంతో ప్రముఖ దర్శకుడు కన్నుమూత, నివాళులు అర్పిస్తున్న ప్రముఖులు

VNS

ఇటీవల సినీ పరిశ్రమలో పలువురు ప్రముఖులు మరణించి విషాదం నింపారు. తాజాగా టాలీవుడ్ లో మరో ప్రముఖ రచయిత కన్నుమూశారు. బాపు, రమణ, తనికెళ్ళ భరణి.. లాంటి పలువురు రచయితలు, దర్శకుల వద్ద పనిచేసిన సీనియర్ రచయిత శ్రీరమణ మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీ రమణ నేడు జులై 19 తెల్లవారుజామున 5 గంటలకు మరణించారు.

Biggboss 7 Telugu Promo: కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్! అంటున్న నాగార్జున, వినూత్నంగా బిగ్‌ బాస్‌ సీజన్ 7 ప్రోమో రిలీజ్‌, కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే

VNS

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్ 7 త్వరలో వస్తుంది అంటూ ఇటీవలే ఓ మోషన్ వీడియోని రిలీజ్ చేశారు. ‘స్టార్ మా’లో బిగ్‌బాస్ టెలికాస్ట్ కానుంది. డిస్నీప్లస్ హాట్‌స్టార్ లో కూడా స్ట్రీమింగ్ అవ్వనుంది. బిగ్‌బాస్ సీజన్ 7 ప్రకటించడంతో ఈ షో అభిమానులు ఆసక్తిగా ఎప్పుడు మొదలవుతుందా, ఈ సారి షోలో ఎవరెవరు సెలబ్రిటీలు వస్తారో, ఎవరు ఇక్కడికి వచ్చి సెలబ్రిటీలు అవుతారో అని వెయిట్ చేస్తున్నారు.

Colors Swathi: విడాకుల దిశగా కలర్స్ స్వాతి..? ఇన్‌స్టా నుంచి భర్త ఫొటోలు తొలగించిన నటి.. విడాకులకు మునుపు సమంత, నిహారిక కూడా తమ భాగస్వాముల ఫొటోలు తొలగింపు.. అభిమానుల్లో ఆందోళన

Rudra

‘కలర్స్’ ప్రోగ్రాంలో తన క్యూట్ మాటలతో హోమ్లీ గర్ల్ లుక్స్‌ తో ప్రేక్షకుల మదిలో చోటు సంపాదించుకున్న స్వాతి అనంతరం ఆ ప్రోగ్రాంనే ఇంటిపేరుగా మార్చుకొని ‘కలర్స్’ స్వాతిగా మారడం తెలిసిందే.

Advertisement
Advertisement