సినిమా

Mangli Emotional Message: కర్ణాటక బస్సుల మీద మంగ్లీ ఫొటోలు, ఉద్వేగానికి లోనైన సింగర్ మంగ్లీ, ఈ జీవితానికి ఇంకేం కావాలి? సదా మీ ప్రేమను కోరుకునే.. మీ మంగ్లీ అంటూ ట్వీట్

Hazarath Reddy

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో గాయనిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను అందుకుంటున్న వారిలో మంగ్లీ ఒకరు. ఇక ఇటీవల ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు వైరల్ అయ్యాయి.కొన్ని కర్ణాటక బస్సుల మీద మంగ్లీ ఫొటోలు అతికించి కన్నడిగులు అభిమానాన్ని చాటుకుంటున్నారు.

Pooja Hegde Father Birthday: రాత్రి పూట తండ్రికి సర్‌ప్రైజ్‌ ఇచ్చిన పూజా హెగ్డే, 60వ వడిలోకి అడుగుపెట్టిన పూజా తండ్రి మంజునాథ్‌ హెగ్డే, తండ్రి బర్త్‌డే పార్టీలో ఓ రేంజ్‌లో రచ్చ చేసిన ముద్దుగుమ్మ

Hazarath Reddy

పూజా తండ్రి మంజునాథ్‌ 60వ వడిలోకి అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా ఆమె తన తండ్రిని సర్‌ప్రైజ్‌ చేస్తూ ఇంట్లోని ఓ గదిని అంతా బెలూన్లతో అలంకరించింది. పూజా స్వయంగా చేసిన ఈ అలంకరణలను చూసి ఆమె తండ్రి సంతోషం వ్యక్తం చేసి పూజను ఆప్యాయంగా హత్తుకున్నాడు.

Pawan Kalyan Health Update: కోలుకుంటున్నా, త్వరలో మీ ముందుకు వస్తా, కరోనా సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరంగా ఉంది, జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చిన పవన్ కళ్యాణ్, తాను ఆరోగ్యంగా ఉండాలని ప్రార్ధనలు చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపిన జనసేన అధినేత

Hazarath Reddy

జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవలే కరోనా బారినపడి తన ఫాంహౌస్ లోనే చికిత్స పొందుతున్న (Pawan Kalyan Health Update) విషయం విదితమే. ప్రస్తుతం తాను వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ కోలుకుంటున్నానని, వీలైనంత త్వరలో ప్రజల ముందుకు వస్తానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Sonu Sood Covid 19: సోనూసూద్‌కు కరోనా పాజిటివ్, స్వీయ నిర్భంధంలోకి వెళ్లిన సినీ నటుడు, మీకోసం నేనున్నాననే విషయాన్ని గుర్తుంచుకోవాలంటూ ట్వీట్

Hazarath Reddy

కరోనా లాక్‌డౌన్ కాలంలో వేలాది మందికి ఆసరాగా నిలిచి ఆపద్బాంధవుడిగా మారిన సినీ నటుడు సోనూసూద్... చివరకు ఆ మమ్మారి బారిన పడ్డారు. సోనూకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని సోనూ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు.

Advertisement

RIP Vivek: నటుడు వివేక్ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ విచారం, తమిళ సినీ పరిశ్రమకు తీరని లోటని తెలిపిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, వివేక్ మరణం షాక్ కు గురిచేసిందని తెలిపిన డీఎంకే అధినేత స్టాలిన్

Hazarath Reddy

‘‘సమయానుసారంగా ఆయన పండించే హాస్యం, డైలాగ్ చాతుర్యం కొన్ని కోట్ల మందిని అలరించాయి. పర్యావరణం, సమాజంపై ఆయనకున్న ప్రేమ ఇటు సినిమాల్లోనూ అటు వ్యక్తిగత జీవితంలోనూ కనిపించేది. ఆయన కుటుంబసభ్యులు, స్నేహితులు, ఆయన్ను ఆరాధించేవారికి సానుభూతి తెలియజేస్తున్నా. ఓం శాంతి’’ అంటూ మోదీ ట్వీట్ చేశారు.

Satyam Dies of COVID 19: టాలీవుడ్‌‌లో మరో విషాదం, కరోనాతో కన్నుమూసిన టాలీవుడ్‌ సీనియర్ కోడైరెక్టర్ సత్యం, సంతాపం తెలిపిన పలువురు సినీ ప్రముఖులు

Hazarath Reddy

ఇటీవ‌ల క‌రోనా బారిన ప‌డిన టాలీవుడ్‌ సీనియర్ కోడైరెక్టర్ సత్యం ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటూ ఈ రోజు ఉదయం ప్రాణాలు (Satyam Dies of COVID 19) కోల్పోయారు. వైద్యులు ఆయ‌న‌ను కాపాడేందుకు చేసిన‌ ప్ర‌య‌త్నాలన్నీ విఫ‌ల‌మ‌య్యాయి. ఆయ‌న మృతి చెందిన‌ట్లు వైద్యులు ప్ర‌క‌టించారు.

Actor Vivekh Passes Away: వ్యాక్సిన్ వేయించుకున్న 2 రోజులకే గుండెపోటు, ప్రముఖ నటుడు వివేక్‌ కన్నుమూత, సంతాపం తెలిపిన రజినీకాంత్, కమల్ హాసన్, విజయ్ సహా పలువురు సినీ ప్రముఖులు

Hazarath Reddy

ప్రముఖ హాస్యనటుడు వివేక్‌ కన్నుమూశారు. గుండెపోటుతో చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుది శ్వాస (Actor Vivekh Passes Away) విడిచారు. దాదాపు 500లకు పైగా చిత్రాల్లో వివేక్ నటించారు.

పవన్ కళ్యాణ్‌కు కరోనా పాజిటివ్, ప్రత్యేక వైద్య బృందంతో చికిత్స, త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో అభిమానుల ముందుకు వస్తారని జనసేన ప్రకటన

Vikas Manda

Advertisement

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కరోనా పాజిటివ్.. ఆందోళనలో అభిమానులు, ప్రత్యేక వైద్య బృందంతో పవన్‌కు చికిత్స, త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో అభిమానుల ముందుకు వస్తారని జనసేన ప్రకటన

Team Latestly

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయనకు ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. సుమన్ అధ్వర్యంలో చికిత్స జరుగుతోంది. యాంటీ వైరల్ డ్రగ్స్ తో పవన్ కు చికిత్స అందిస్తున్నారు....

Aaraattu Teaser: నేను వాడిని చంపేస్తాను, మోహన్ లాల్ లుంగీ కట్టి ఫైట్ చేస్తుంటే..తెలుగు డైలాగ్‌తో ఆరాట్టు చిత్రం టీజర్ విడుదల, దుమ్మురేపుతున్న 53 సెకన్ల నిడివి ఉన్న టీజర్

Hazarath Reddy

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్న తాజా చిత్రం 'ఆరాట్టు'.ఈ చిత్రం నుంచి మేకర్స్ టీజర్ ను (Aaraattu Teaser) విడుదల చేశారు. కేవలం 53 సెకన్ల నిడివి ఉన్న వోల్టేజ్ మాస్ కంటెంట్‌ టీజర్ తో హీరోను పరిచయం చేశారు.

RRR Ugadi Poster: ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి మరో కొత్త పోస్టర్, కొమరం భీమ్‌, అల్లూరిని జ‌నాలు ఎత్తుకుని పైకి ఎగ‌రేస్తూ సంబ‌రాలు జ‌రుపుకుంటున్న‌ట్లు పోస్టర్, అక్టోబర్ 13వ తేదీన సినిమా విడుదల

Hazarath Reddy

వారిద్ద‌రిని జ‌నాలు ఎత్తుకుని పైకి ఎగ‌రేస్తూ సంబ‌రాలు జ‌రుపుకుంటున్న‌ట్లు ఈ పోస్ట‌ర్ లో చూపించారు. జ‌నాలు త‌మ‌ను పైకి ఎగ‌రేస్తుండ‌గా ఇద్ద‌రు హీరోలు చిరునవ్వులు చిందిస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు ఈ పోస్ట‌ర్‌తో ఆర్ఆర్ఆర్ టీమ్ ఉగాది శుభాకాంక్ష‌లు తెలిపింది. ఈ సినిమా యూనిట్ ఇప్పటికే విడుదల చేసిన పోస్ట‌ర్లు, టీజ‌ర్లు ప్రేక్ష‌కుల‌ను అల‌రించాయి.

Dil Raju Covid: టాలీవుడ్‌లో కరోనా సెకండ్ వేవ్ అలజడి, నిర్మాత దిల్ రాజు, దర్శకుడు గుణశేఖర్, వి.ఎన్ .ఆదిత్యలకు కోవిడ్ పాజిటివ్, ఇప్పటికే నివేతా థామస్‌కు కరోనా పాజిటివ్‌, స్వీయ నిర్భంధంలోకి దిల్ రాజు

Hazarath Reddy

తెలుగు చిత్ర సీమను కరోనా వెంటాడుతోంది. ఇప్పటికే టాలీవుడ్ లో చాలామంది కరోనా భారీన పడగా తాజాగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్‌రాజుకు కరోనా పాజిటివ్‌గా (dil-raju-tested-covid-positive) నిర్దారణ అయ్యింది. దీంతో ఈ అగ్ర నిర్మాత హోం ఐసోలేషన్‌లోకి వెళ్లారు.

Advertisement

Pawan Kalyan Home Quarantine: కరోనా టెన్సన్..హోం క్వారంటైన్‌లోకి ప‌వ‌న్ క‌ల్యాణ్, జనసేన అధినేత వ్యక్తిగ‌త సిబ్బందిలో కొంద‌రికి క‌రోనా పాజిటివ్, తిరుప‌తి ప‌ర్య‌ట‌న‌లపై నెలకొన్న సందిగ్ధ‌త

Hazarath Reddy

జన‌సేన అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ హైద‌రాబాద్‌లోని త‌న నివాసంలో హోం క్వారంటైన్‌లోకి (Pawan Kalyan Home Quarantine) వెళ్లారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్యక్తిగ‌త సిబ్బందిలో కొంద‌రికి క‌రోనా పాజిటివ్ రావ‌డంతో ఆయ‌న ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌స్తుతం వ‌ర్చువ‌ల్ ప‌ద్ధతిలోనే జ‌న‌సేన‌ పార్టీ కార్య‌క‌లాపాలను ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

Satish Kaul Dies of COVID 19: ప్రముఖ నటుడు కరోనాతో కన్నుమూత, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన మహాభారతం సీరియల్‌ ఫేమ్‌ సతీష్ కౌల్, పలు హిందీ చిత్రాల్లో నటించిన పంజాబ్ నటుడు

Hazarath Reddy

మహాభారతం సీరియల్‌ ఫేమ్‌, ప్రముఖ నటుడు సతీష్ కౌల్(66) కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస (Satish Kaul Dies of COVID 19) విడిచారు. వారం రోజుల క్రితం సతీష్‌ కౌల్‌కు కరోనా సోకింది. దాంతో ఆయన పంజాబ్‌ లుథియానా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో శుక్ర‌వారం రాత్రి ఆయన ఆరోగ్య ప‌రిస్థితి విషమించ‌డంతో తుది శ్వాస (Satish Kaul Dies of COVID-19 Complications) విడిచారు.

Cheque Bounce Case: శరత్‌కుమార్‌, రాధికలకు ఏడాది జైలు శిక్ష, రూ. 5 కోట్ల జరిమానా, 2018 నాటి చెక్‌ బౌన్స్‌ కేసులో తాజాగా తీర్పు ఇచ్చిన ప్రత్యేక కోర్టు, నాలుగేళ్ల పాటు సాగిన విచారణ

Hazarath Reddy

తమిళ నటుడు, రాజకీయ నాయకుడు శరత్‌కుమార్‌, అతడి భార్య, నటి, నిర్మాత రాధికలకు (Actors Sarathkumar and Radhika) ప్రత్యేక కోర్టులో చుక్కెదురైంది. 2018 నాటి చెక్‌ బౌన్స్‌ కేసులో (Cheque Bounce Case) ఇరువురికీ న్యాయస్థానం ఏడాది కాలం పాటు జైలు శిక్ష (get one-year jail term) విధిస్తూ తీర్పునిచ్చింది.ఈ కేసుకు సంబంధించి రూ .5 కోట్ల జరిమానా కూడా కోర్టు విధించింది.

Varma Birthday: ఈ రోజు నేను చచ్చిన రోజు, పుట్టిన రోజు కాదు, ఏడుస్తున్న ఎమోజీలతో ట్వీట్ చేసిన వర్మ, ఫన్నీగా కామెంట్స్ పెడుతున్న అభిమానులు 

Hazarath Reddy

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పుట్టిన రోజు ఈ రోజు (ఏప్రిల్‌, 7). ఈ సందర్భంగా సినీవర్గానికి చెందిన పలువురితో పాటు, ఆయన అభిమానులు రామూకి అభినందనలు తెలుపుతున్నారు. అయితే ఎపుడూ వివాదాస్పద, వ్యంగ్య, కొంటె కమెంట్లతో వార్తల్లో నిలిచే ఆర్జీవీ మరోసారి తనదైన స్టయిల్‌లో తన పుట్టిన రోజు గురించి చెప్పుకొచ్చాడు. ఈ రోజు నా బర్త్‌డే కాదు..వాస్తవానికి నా డెత్‌ డే.. ఎందుకంటే నా ఆయుష్షులో ఇక సంవత్సరం తగ్గిపోయింది అంటూ బుధవారం ట్వీట్‌ చేశారు.

Advertisement

Director Bharathiraja: ఓటు హక్కును వినియోగించుకున్న దర్శకుడు భారతీ రాజా, హీరో సూర్య, కార్తీ, కమల్ హాసన్, కొనసాగుతున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

Hazarath Reddy

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దర్వఖుడు భారతీ రాజా, నటుడు సూర్య, కార్తీ, కమల్ హాసన్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Hero Ajith: ఓటు హక్కును వినియోగించుకున్న హీరో అజిత్, షాలినితో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చిన తమిళ నటుడు, సెల్ఫీ తీస్తున్న అభిమాని నుంచి ఫోన్ లాక్కుని తరువాత క్షమాపణ చెప్పిన అజిత్

Hazarath Reddy

తమిళనాడులో నేడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా, సీనియర్ హీరో అజిత్ చెన్నైలో తన ఓటు వేశారు. తన అర్ధాంగి షాలినితో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. సాధారణ ఓటర్ల మాదిరే ఆయన క్యూలో నిల్చుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఈ సందర్భంగా అభిమానులు అజిత్ ను తమ కెమెరాల్లో బంధించేందుకు పోటీలు పడ్డారు.

Rajinikanth: ఓటు హక్కును వినియోగించుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్, ఈ ఎన్నికల్లో ఎవరికీ మద్దతు ప్రకటించని తలైవా, ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచన

Hazarath Reddy

త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ త‌న ఓటు హ‌క్కును ఉద‌యమే వినియోగించుకున్నారు. థౌజండ్ లైట్స్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని స్టెల్లా మేరిస్ పోలింగ్ బూత్‌లో ర‌జ‌నీకాంత్ ఓటేశారు. ఈ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని నిర్ణయించుకున్న ర‌జ‌నీకాంత్.. త‌న ఆరోగ్య ప‌రిస్థితుల దృష్ట్యా ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న విష‌యం తెలిసిందే.

Thalapathy Vijay: సైకిల్ మీద వచ్చి ఓటు వేసిన నటుడు విజయ్, అభిమానులతో సెల్ఫీలకు పోజులు, సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

Hazarath Reddy

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌ సైకిల్‌పై వచ్చి ఓటు వేశారు. పోలింగ్‌ కేంద్రంలో అభిమానులతో సెల్ఫీలకు పోజులిచ్చారు. ప్రస్తుతం ఆయన సైకిల్‌పై వచ్చిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. హీరో విజయ్‌ వేగంగా సైకిల్‌ తొక్కుతూ పోలింగ్‌ కేంద్రానికి వస్తుండగా రోడ్డుపై అభిమానులు అయన వెంట బైక్‌లతో అనుసరించారు.

Advertisement
Advertisement