సినిమా

Director Vetri Duraisamy Died: తొమ్మిది రోజుల త‌ర్వాత న‌దిలో దొరికిన‌ డైర‌క్ట‌ర్ మృత‌దేహం, స‌ట్లేజ్ న‌దిలో సుధీర్ఘ గాలింపు త‌ర్వాత ల‌భ్యం

VNS

చెన్నై న‌గ‌ర మాజీ మేయ‌ర్ స‌దాయి దురైస్వామి కుమారుడు, ఫిల్మ్ డైరెక్ట‌ర్ వెట్రి దురైస్వామి(Vetri Duraisamy) మృత‌దేహం దొరికింది. స‌ట్ల‌జ్ న‌దిలో ఆయ‌న శ‌వాన్ని గుర్తించారు. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలో వెట్రి (Vetri Duraisamy Died) ప్ర‌యాణిస్తున్న కారు ఫిబ్ర‌వ‌రి 4వ తేదీన ప్ర‌మాదానికి గురైంది.

Aditya Narayan Throws Fan Mobile: అభిమానిపై దాడి చేసి, ఫోన్ దూరంగా విసిరేసిన సింగర్ ఉదిత్ నారాయణ్ కొడుకు ఆదిత్య నారాయణ్, మండిపడుతున్న నెటిజన్లు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారు షేర్ చేసిన వీడియోలో,ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ్ కొడుకు ఆదిత్య నారాయణ్ అభిమాని మీద విరుచుకుపడ్డాడు. అభిమానిని చేతిలో ఉన్న మైక్ తో కొట్టాడు, అతని నుండి ఫోన్ లాక్కొని జనంలోకి దూరంగా విసిరాడు.

OG Movie Producer Funny Chat: పవన్ కల్యాణ్ ఫ్యాన్‌ కు క్రేజీ రిప్లై ఇచ్చిన OG మూవీ ప్రొడ్యూసర్, ఓయ్ రీ రిలీజ్‌కు పవన్ సినిమా అప్‌డేట్ తో లింక్‌ పెడుతూ ట్వీట్

VNS

ట్వీట్ కి పవన్ అభిమాని రియాక్ట్ అవుతూ.. ”ఓయ్ ఓయ్ అంటూ OG ఇంకో పోస్టర్ ఇయ్యరో” అంటూ ట్వీట్ చేశారు. అభిమాని చేసిన ట్వీట్ కి డివివి బదులిస్తూ.. ”ఓయ్ ఓయ్ మొన్న వదిలిన పోస్టరే ఎంప్టీ గుండె నిండా నిలిచేరో. ఓయ్ ఓయ్ తరువాత ఎప్పుడన్నా చూద్దాములేరో” అంటూ ట్వీట్ చేశారు.

Sitara Ghattamaneni: మ‌హేష్ బాబు కుటుంబాన్ని టార్గెట్ చేసిన సైబ‌ర్ క్రిమిన‌ల్స్, సితార పేరుతో భారీ ఫ్రాడ్

VNS

త్వరలోనే సైబర్ నేరగాళ్ళను గుర్తించి పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. అంతవరకు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. కాగా, అభిమానులు అప్రమత్తంగా ఉండాలని మహేశ్ బాబు టీమ్ కోరింది. సితార పేరుతో వచ్చే అనుమానాస్పద నోటిఫికేషన్స్ కు, రిక్వెస్టులకు స్పందించవద్దని అభిమానులకు సూచించింది టీమ్ మహేశ్.

Advertisement

This Week Movies- OTT Releases: రవితేజ ఈగల్ సినిమా ఎలా ఉంది, గుంటూర్ కారం ఓటీటీలో ప్రేక్షకులకు రుచిని పంచుతుందా? ఈవారం థియేటర్లలో రిలీజైన సినిమాలు, ఓటీటీలో సందడి చేస్తున్న చిత్రాల విశేషాలను ఇక్కడ తెలుసుకోండి!

Vikas M

Amitabh Bachchan Visits Ayodhya: అయోధ్య రామమందిరంలో అమితాబ్ బచ్చన్ పూజలు, కుటుంబంతో కలిసి రామ్ లల్లాను దర్శించుకున్న బాలీవుడ్ బిగ్ బి

Hazarath Reddy

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తన కుమారుడు అభిషేక్ బచ్చన్‌తో కలిసి రామ్ ఆలయాన్ని సందర్శించుకున్నారు. అయోధ్య రామాలయంలో పూజలు చేశారు.కాగా జనవరి 22న, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రామమందిర ప్రతిష్ఠాపన సందర్భంగా అమితాబ్ బచ్చన్ మరియు పలువురు ఇతర సినీ తారలు పాల్గొన్న సంగతి విదితమే.తాజాగా అమితాబ్ తన కుటుంబంతో కలిసి రామ మందిరంలో ప్రార్థనలు చేశారు.

Vyooham Release Date: ఫిబ్రవరి 23న విడుదల అవుతున్న వ్యూహం, అందాల సుందరాంగితో సెలబ్రేషన్స్‌ చేసుకున్న వీడియోని పోస్ట్ చేసిన వర్మ

Hazarath Reddy

టాలీవుడ్‌ వివాదాస్పద డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన 'వ్యూహం' సినిమా విడుదలకు లైన్‌ క్లియర్‌ అయింది. ఫిబ్రవరి 23న వ్యూహం చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. సినిమాను విడుదల చేసుకోవచ్చని సెన్సార్‌ బోర్డు క్లియెరెన్స్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో సినిమా విడుదలపై డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మ తన ఎక్స్‌ పేజీలో ఒక పోస్ట్‌ చేశారు

Lal Salaam: రజినీ కాంత్ ప్రత్యేక పాత్ర పోషించిన 'లాల్ సలాం' సినిమా నేడు విడుదల.. థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ సందడి ఇదిగో (వీడియో)

Rudra

సూపర్ స్టార్ రజినీ కాంత్ ప్రత్యేక పాత్ర పోషించిన 'లాల్ సలాం' నేడు విడుదల కానుంది. ఈ క్రమంలో తమిళనాడులోని అన్ని థియేటర్లలో పండుగ వాతావరణం నెలకొన్నది. వీడియో ఇదిగో..

Advertisement

Yatra 2 Movie Review: యాత్ర 2 లో ఈ డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయట, యాత్ర 2 మూవీ రివ్యూ ఇదిగో, మళ్లీ డైరెక్టర్ బ్లాక్ బాస్టర్ కొట్టాడా..

Hazarath Reddy

వైఎఎస్ఆర్ పాత్రను మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కనిపించగా...జగన్ పాత్రలో తమిళ హీరో జీవా నటించారు. భారీ అంచనాల మధ్య నేడు (ఫిబ్రవరి 8) ప్రేక్షకుల ముందుకు వచ్చింది యాత్ర 2. మరి మూవీ (Yatra 2 Movie Review) ఎలా ఉందో చూద్దాం.

James Cameron Praises Rajamouli: రాజమౌళిపై హాలీవుడ్ దిగ్గజం జేమ్స్‌ కామెరూన్ మళ్లీ ప్రశంసలు, భారతీయ సినిమా ప్రపంచ వేదికపై నిలిచిందంటే..

Hazarath Reddy

ఓ మీడియా ప్రతినిధి ‍అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ఆర్ఆర్ఆర్ మూవీ అద్భుతంగా తెరకెక్కించారని.. ఇండియన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా తన ముద్ర వేయడం చాలా బాగుందన్నారు.నిజంగా చాలా నిజాయతీగా అనిపించి ఈ విషయాన్ని చెప్పాను. దీనికి సంబంధించిన వీడియోను ఆర్ఆర్ఆర్ టీం తన ట్విటర్‌ ద్వారా పంచుకుంది

Raajadhani Files Trailer: అమరావతి భూముల రైతుల ఆవేదన నేపథ్యంగా రాజధాని ఫైల్స్ మూవీ ట్రైలర్ వచ్చేసింది, చూసి ఎలా ఉందో చెప్పేయండి మరి..

Hazarath Reddy

ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌గా తాజాగా మూవీ మేక‌ర్స్ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. శ్రీమతి బిందు సమర్పణలో వ‌స్తున్న ఈ సినిమాలో వినోద్‌కుమార్‌, వాణీ విశ్వనాథ్‌, పవన్‌, మధు, అజయ్‌రత్నం, అంకిత ఠాకూర్‌, అమృత చౌదరి తదితరులు నటిస్తుండ‌గా.. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

Grammys 2024: గ్రామీ అవార్డులలో సత్తా చాటిన భారతీయులు, పాష్టోకు గానూ మూడు అవార్డులను గెలుచుకుని చరిత్ర సృష్టించిన ఉస్తాద్ జాకీర్ హుస్సేన్

Hazarath Reddy

సోమవారం USలో ప్రదానం చేసిన 66వ గ్రామీ అవార్డులలో ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ మూడు అవార్డులను కైవసం చేసుకున్నారు. తబలా ప్లేయర్ మరియు సంగీత స్వరకర్త " పాష్టో" కోసం 'బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్' విభాగంలో గౌరవనీయమైన అవార్డును కైవసం చేసుకున్నారు.గ్రామీ అవార్డుల 66వ ఎడిషన్ సోమవారం లాస్ ఏంజిల్స్‌లో జరిగింది.

Advertisement

Grammys 2024: గ్రామీ అవార్డుల్లో కొత్త రికార్డు సృష్టించిన పాప్ సింగర్ టేల‌ర్ స్విఫ్ట్, బెస్ట్ ఆల్బ‌మ్ క్యాట‌గిరీలో వరుసగా 4 సార్లు అవార్డు అందుకున్న తొలి సింగ‌ర్‌గా కొత్త చరిత్ర

Hazarath Reddy

పాప్ సింగ‌ర్ టేల‌ర్ స్విఫ్ట్(Taylor Swift) గ్రామీ మ్యూజిక్ అవార్డుల్లో మరోసారి సత్తా చాటింది. బెస్ట్ ఆల్బ‌మ్ ఆఫ్ ద ఇయ‌ర్ అవార్డును ఆమె నాలుగోసారి కైవ‌సం చేసుకున్న‌ది.మిడ్‌నైట్స్ అన్న ఆల్బ‌మ్‌కు ఆ అవార్డు ద‌క్కింది. బెస్ట్ ఆల్బ‌మ్ క్యాట‌గిరీలో నాలుగుసార్లు అవార్డు గెలిచిన తొలి సింగ‌ర్‌గా ఆమె నిలిచింది.

Grammys 2024: బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ విభాగంలో గ్రామీ అవార్డును అందుకున్న భారత సింగర్ శంకర్ మహదేవన్, దిస్ మూమెంట్ చిత్రానికి అవార్డు

Hazarath Reddy

ఈ ఏడాది గ్రామీ అవార్డుల్లో బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ విభాగంలో గాయకుడు శంకర్ మహదేవన్, తబలా ప్లేయర్ జాకీర్ హుస్సేన్, గిటారిస్ట్ జాన్ మెక్‌లాఫ్లిన్, వీ సెల్వగణేష్, వయోలిన్ విద్వాంసుడు గణేష్ రాజగోపాలన్ బృందం 'శక్తి' గ్రామీ అవార్డును గెలుచుకుంది

Grammys 2024: స్టేజీ మీద మూడు గ్రామీ అవార్డులు అందుకున్న వెంటనే చేతులకు బేడీలు, ప్రముఖ ర్యాప్ సింగర్ కిల్ల‌ర్ మైక్ ను అరెస్ట్ చేసిన పోలీసులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో నేడు జరిగిన గ్రామీ అవార్డుల ప్ర‌దానోత్సవంలో ర్యాప‌ర్ కిల్ల‌ర్ మైక్(Rapper Mike) మూడు అవార్డులు గెలుచుకున్నాడు.అయితే స్టేజ్‌పై అవార్డులు అందుకున్న త‌ర్వాత అత‌న్ని అక్క‌డ ఉన్న సెక్యూరిటీ పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు.

Sridevi Death Case: అలనాటి హీరోయిన్ శ్రీదేవీ మృతి కేసు మళ్లీ తెరపైకి, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన మహిళపై ఛార్జిషీట్‌ దాఖలు చేసిన సీబీఐ

Hazarath Reddy

అలనాటి అందాల తార శ్రీదేవి (Sridevi) మృతిపై నకిలీ పత్రాలు సృష్టించిన ఓ యూట్యూబర్‌పై సీబీఐ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. శ్రీదేవి మరణంపై తాను సొంతంగా విచారణ జరిపానని, యూఏఈ-భారత్‌ ప్రభుత్వాలు నిజాలను దాచినట్టు తేలిందంటూ నకిలీ పత్రాలు సృష్టించిన భువనేశ్వర్‌కు చెందిన దీప్తి పిన్నిటిపై సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది. ఫిర్యాదులో దీప్తి న్యాయవాది భరత్‌ సురేశ్‌ను కూడా చేర్చారు.

Advertisement

Anupama Parameswaran Tied Rakhi: అంద‌రి ముందూ స్టేజి మీద‌నే రాఖీ క‌ట్టిన అనుపమ ప‌ర‌మేశ్వ‌ర‌న్, ఈగల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆసక్తిక‌ర ఘ‌ట‌న‌..(వీడియో ఇదుగోండి!)

VNS

ఈగల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో అనుపమని స్టేజిపైకి మాట్లాడటానికి పిలిచినప్పుడు ఆ వైరల్ వీడియోని స్టేజిపై ప్లే చేశారు. దీంతో అనుపమ.. సారీ రవిగారు. నాలుగు సినిమాలు చేశాను కార్తీక్ తో. ఆయనతో మంచి బాండ్ ఉంది. అలాగే అలవాటు అయిపోయింది. మార్చుకోలేను అని చెప్పింది.

Megastar Chiranjeevi Hosted Dinner: మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో గ్రాండ్ పార్టీ, హాజ‌రైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఇత‌ర మంత్రులు, పార్టీకి సంబంధించిన ఫోటోలు ఇవిగో!

VNS

సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్చం అందజేసి అభినందించారు. చిరు కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలుకరించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. చిరంజీవికి పద్మ విభూషణ్ రావడం మనందరికీ గర్వకారణం అన్నారు

RGV Supported Poonam Pandey: పూన‌మ్ పాండేకు స‌పోర్ట్ చేసిన రామ్ గోపాల్ వ‌ర్మ‌, త‌న‌వ‌ల్ల‌నే దేశ‌మంతా చ‌ర్చ జ‌రుగుతోందంటూ మ‌ద్ద‌తు

VNS

ఏ ఒక్కరూ పూనమ్‌ ఉద్దేశ్యాన్ని ప్రశ్నించలేరు. ఇప్పుడు దేశమంతటా సర్వైకల్ క్యాన్సర్‌పై చర్చ జరుగుతోంది. ఇదంతా జరిగింది పూనమ్ వల్లే. మీరు ఎన్నో ఏళ్లు హ్యాపీగా జీవించాలని కోరుకుంటున్నా అంటూ పూనమ్‌పై రామ్ గోపాల్ వర్మ ప్ర‌శంస‌లు కురిపించారు.

Yatra2 Trailer Video: ఇచ్చిన మాట కోసం యుద్ధానికైనా సిద్ధం అంటూ యాత్ర 2 సినిమా ట్రైలర్ విడుదల..వీడియో ఇక్కడ క్లిక్ చూడండి..

sajaya

రెండవ భాగం ట్రైలర్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ప్రాబల్యం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎదగడంపై కథను దృష్టి పెట్టారు. తన తండ్రి మరణంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రను ప్రారంభించేందుకు ప్రేరేపించిన అంశాలతో పాటు ఆయన తన యాత్రను కొనసాగించకుండా అడ్డుకునేందుకు ఆయన వెనుక జరిగిన కుట్రలను వివరిస్తూ ట్రైలర్ ప్రారంభమవుతుంది.

Advertisement
Advertisement