Bipasha Basu: పెళ్లైన ఆరేళ్ల తర్వాత బిడ్డకు జన్మనిచ్చిన బిపాస బసు, బాలీవుడ్ కపుల్‌కు వెల్లువెత్తుతున్న అభినందనలు

బాలీవుడ్ నటి బిపాస బసు (Bipasha Basu) తల్లైంది. పండంటి ఆడపిల్లకు ఆమె జన్మనిచ్చింది. తాము తల్లిదండ్రులం అయ్యామంటూ బిపాస బసు ఆమె భర్త కరణ్ సింగ్ గ్రోవర్ (Karan Singh Grover) ప్రకటించారు. బిపాస ప్రెగ్నెన్సీ గురించి ఆగస్టులో ఈ దంపతులు ప్రకటించారు

Bipasha Basu: పెళ్లైన ఆరేళ్ల తర్వాత బిడ్డకు జన్మనిచ్చిన బిపాస బసు, బాలీవుడ్ కపుల్‌కు వెల్లువెత్తుతున్న అభినందనలు
Bipasha Basu and Karan Singh Grover Maternity Shoot (Photo Credits: Instagram)

Mumbai, NOV 12: బాలీవుడ్ నటి బిపాస బసు (Bipasha Basu) తల్లైంది. పండంటి ఆడపిల్లకు ఆమె జన్మనిచ్చింది. తాము తల్లిదండ్రులం అయ్యామంటూ బిపాస బసు ఆమె భర్త కరణ్ సింగ్ గ్రోవర్ (Karan Singh Grover) ప్రకటించారు. బిపాస ప్రెగ్నెన్సీ గురించి ఆగస్టులో ఈ దంపతులు ప్రకటించారు. అనంతరం ఆమె సీమంతం వేడుకను ఘనంగా నిర్వహించారు. తాను గర్భవతి అయినప్పటి నుంచి బిపాస ప్రతి ఒక్క అప్‌ డేట్‌ ను ఇన్‌ స్టాగ్రాంలో పోస్ట్ చేస్తున్నారు. తాను ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకుంటున్న జాగ్రత్తలను తెలియజేశారు. తాను ప్రెగ్నెంట్‌ గా ఉన్న టైమ్‌లో ఎలాంటి అనుభూతిని ఆస్వాదిస్తున్నాను అనేది ఇన్ స్టా స్టోరీస్ ద్వారా చెప్తూ వచ్చారు. ఇక బిపాస భర్త కరణ్ సింగ్ గ్రోవర్ కూడా బిపాస గురించి, తమ ఫ్యామిలీ లైఫ్ గురించి తరచూ పోస్టులు చేస్తున్నారు.

బిపాస (Bipasa basu), కరణ్ సింగ్ గ్రోవర్‌ లకు ఆరేళ్ల క్రితం పెళ్లయింది. మ్యారేజ్ తర్వాత సినిమాలను తగ్గించిన బిపాస...ఆరేళ్ల తర్వాత ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. అయితే ఆమె ఆరేళ్ల తర్వాత బిడ్డకు జన్మనివ్వడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా బిపాస దంపతులకు ట్విట్టర్ వేదికగా కంగ్రాట్స్ చెప్తున్నారు.

(The above story first appeared on LatestLY on Nov 12, 2022 03:57 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).