డైరెక్టర్ పూరి జగన్నాథ్, లైగర్ డిస్ట్రిబ్యూటర్స్ పై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో (Jubille HIlls Police Station) ఫిర్యాదు చేయడం ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది. డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను, ఫైనాన్సియర్ శోభన్ లపై పూరి (Puri Jagannadh Complaint) ఫిర్యాదు చేశాడు.
వరంగల్ శ్రీను, శోభన్ లు.. తన పై, తన కుటుంబంపై హింస కు పాల్పడేలా ఇతరులను ప్రేరేపిస్తున్నారని, వారి నుంచి తమ కుటుంబానికి ఆపద ఉందని ఫిర్యాదు తెలిపాడు. వారి నుంచి నాకు నా కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని పోలీస్ లను పూరి జగన్నాథ్ కోరాడు. వరంగల్ శ్రీను (Warangal Srinu), ఫైనాన్సియర్ శోభన్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని పూరి జగన్నాధ్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కిన లైగర్ సినిమా ఫ్లాప్ పూరి జగన్నాథ్‌కు కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. భారీ స్థాయిలో నష్టాలు రావడంతో డిస్ట్రిబ్యూటర్స్ తమకు కొంత డబ్బు వెనక్కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీని కోసం పూరి ఒక నెల రోజులు గడువు కోరినప్పటికీ కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం దర్శకుడి ఆఫీస్ ముందు ధర్నా చేసేందుకు సిద్ధమయ్యారు.
Here's Puri Jagannadh Complaint
#Liger :
Producer-Director #PuriJagannath Complains to Poloce Authorities that his Distributors are trying to instigate violence! pic.twitter.com/POxsnGsbdk
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) October 26, 2022
ఈ విషయం తెలిసిన పూరి జగన్నాథ్ తన పరువు తీయాలని చూస్తే మాత్రం ఒక్క పైసా కూడా ఇవ్వనని వార్నింగ్ ఇచ్చాడు. ఈమేరకు ఓ ఆడియోకాల్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా పూరి జగన్నాధ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివాదం మరింత ముదురుతోంది.