పూరి జగన్నాథ్ అంటే కూల్ అండ్ కామ్. తన పనేదో తానూ చేసుకునే దర్శకుడు. కుదిరితే బ్యాంకాక్ లేదంటే షూటింగ్ ఇదే పూరి (Director Puri Jagannadh) ప్రపంచం. అలాంటి పూరి జగన్నాథ్ తొలిసారి బయ్యర్లపై మండిపడ్డాడు. తనని అవమానిస్తూ పరువు తీస్తున్నారని పరుష పదజాలం వాడుతూ ఆడియో (Audio Goes Viral) మెసేజిలు పెట్టాడు. ఇండస్ట్రీలో ఇప్పుడు పూరి వాడిన భాష వైరల్ అవుతుంది. అయితే ఇదంతా లైగర్ మూవీ నష్టాల చుట్టూ తిరుగుతున్న వివాదం అని తెలుస్తోంది. హీరో విజయ్ దేవరకొండతో భారీ అంచనాల నడుమ 'లైగర్' మూవీ తీసాడు పూరి.
పాన్ ఇండియా ఫిలింగా లైగర్‌కి భారీ క్రేజ్ రావటంతో బయ్యర్లు పెద్ద మొత్తానికి కొనుగోలు చేశారు. కానీ లైగర్ డిజాస్టర్ అయింది. దాంతో భారీగా నష్టపోయిన బయ్యర్లు తమను ఆదుకోవాలని పూరీ జగన్నాథ్‌ను కోరితే.. కొంత డబ్బు సైతం వెనక్కి ఇస్తానని మాటిచ్చారు. అయితే తనకి డబ్బులు వచ్చేవి ఉన్నాయని.. అప్పటివరకు ఆగాలంటూ కొంత సమయం కోరాడు.
ఇంతలోనే ఎగ్జిబిటర్లు సైతం పూరీ నుంచి డబ్బు ఆశిస్తున్నారు. తాము నష్టపోయిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయటమే కాకుండా, ఈ నెల 27న పూరి ఇంటిముందు ధర్నా చేస్తామని బెదిరించారు.దీంతో పూరికి కాలినట్టుంది. క్షణం ఆలోచించకుండా ఎగ్జిబిటర్లకి ఘాటైన ఆడియో మెసేజెస్ పెట్టాడు. 'ఏంటీ బెదిరిస్తున్నారా? మీరు బ్లాక్ మెయిల్ చేస్తే భయపడను. అసలు మీరు మగాళ్లేనా' అంటూ ఆడియో మెసేజ్‌లో పూరి విరుచుకుపడ్డాడు.
నష్టపోయిన బయ్యర్లకు కొంత అమౌంట్ ఇస్తానని మాట ఇచ్చాను అంతే. నేను ఇంకెవ్వరికి తిరిగి డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇస్తానని చెప్పిన తరవాత కూడా ఇలా ఓవర్ యాక్షన్ చేస్తే ఇవ్వాల్సిన వాళ్లకు కూడా ఇవ్వబుద్ధికాదు'' అని మండిపడ్డారు. తాను పరువు కోసం డబ్బు తిరిగి ఇస్తున్నాను. ఆ పరువు తీయాలని చూస్తే ఒక్క రూపాయి కూడా ఇవ్వను. అసలు ఎగ్జిబిటర్లకి తనకి సంబంధం ఏమిటి? ఇండస్ట్రీలో అందరం గ్యాంబ్లింగ్ చేస్తున్నాం.
కొన్ని ఆడతాయి. కొన్ని పోతాయి. దానితో నాకేం సంబంధం. లాభాలు వస్తే బయ్యర్ల నుండి డబ్బులు వసూలు చేసుకోడానికి నేను నానా సంకలు నాకాల్సి వస్తోంది. పోకిరి నుండి ఇస్మార్ట్ శంకర్ వరకు నాకు బయ్యర్ల నుండి రావాల్సిన డబ్బులు బోలెడు. అవన్నీ బయ్యర్స్ అసోసియేషన్ నాకు వసూలు చేసి పెడతుందా? అసలు వీళ్లు మగాళ్లు కాదు.. ఒక్కడు లేడు ఇక్కడ ' అంటూ పూరి కాస్త పరుషపదజాలాన్ని వాడటం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది.