Kantara Movie Update: కాంతార 2 అప్ డేట్.. జూన్ నుంచి షూటింగ్.. సీక్వెల్ కాదు ప్రీక్వెల్ గా తీస్తున్నామన్న నిర్మాత విజయ్ కిర్గందూర్

కాంతార 2 సీక్వెల్ కాదని.. ప్రీక్వెల్ అని నిర్మాత విజయ్ కిర్గందూర్ కొత్త విషయం చెప్పారు. అలానే రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశారు. సినిమా షూటింగ్ కు వానాకాలం ముఖ్యమని, అందుకే జూన్ లో షూటింగ్ మొదలుపెడుతామని వెల్లడించారు.

Kantara Movie Update: కాంతార 2 అప్ డేట్.. జూన్ నుంచి షూటింగ్.. సీక్వెల్ కాదు ప్రీక్వెల్ గా తీస్తున్నామన్న నిర్మాత విజయ్ కిర్గందూర్
Credits: Twitter

Newdelhi, Jan 22: చిన్న సినిమాగా మొదలై.. పాన్ ఇండియా (Pan India) మూవీగా మారి రికార్డులు సృష్టించింది కాంతార (KAntara). ముందు కన్నడలో హిట్ టాక్ అందుకుని.. తర్వాత పలు భాషల్లో రిలీజై కోట్లు కొల్లగొట్టింది. సినిమా లవర్స్ లో (Movie Lovers) ఇంకా ఆ ఫీవర్ తగ్గనేలేదు.. అప్పుడే కాంతార 2 కోసం పనులు మొదలయ్యాయట. డైరెక్టర్ కమ్ హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty) ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ (Script Work) లో బిజీ అయిపోయారట. ఈ విషయాన్ని ‘హంబాలే ఫిల్మ్స్’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు విజయ్ కిర్గందూర్ వెల్లడించారు. ‘డెడ్ లైన్’ న్యూస్ సంస్థతో మాట్లాడిన ఆయన పలు విషయాలను బయటపెట్టారు. కాంతార 2 సీక్వెల్ కాదని.. ప్రీక్వెల్ అని కొత్త విషయం చెప్పారు. అలానే రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశారు. సినిమా షూటింగ్ కు వానాకాలం ముఖ్యమని, అందుకే జూన్ లో షూటింగ్ మొదలుపెడుతామని వెల్లడించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో దేశవ్యాప్తంగా రిలీజ్ చేస్తామని విజయ్ చెప్పుకొచ్చారు.

టాలీవుడ్ లో మరో విషాదం.. ఎన్టీఆర్ 'అడవి రాముడు' సినిమా నిర్మాత సూర్యనారాయణ కన్నుమూత

ప్రస్తుతం కర్ణాటకలోని కోస్టల్ రీజియన్ లో రిషబ్ శెట్టి పర్యటిస్తున్నారని, రెండు నెలలపాటు అక్కడే తిరుగుతూ అక్కడి సంప్రదాయాలపై మరింత సమాచారం తెలుసుకుంటారని వివరించారు. రెండో భాగానికి బడ్జెట్ పెంచామని, కానీ సినిమా స్టయిల్  అంతా తొలి భాగం మాదిరే ఉంటుందని వెల్లడించారు. నటీనటులను ఇంకా ఎంపిక చేయాల్సి ఉందని విజయ్ తెలిపారు.

ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. ఇక తెలుగులోనూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష.. హిందీ, ఇంగ్లిష్‌తోపాటు 13 స్థానిక భాషల్లోనూ పరీక్ష

(The above story first appeared on LatestLY on Jan 22, 2023 09:05 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).