Kamal Haasan in Project K: ప్రభాస్‌కు విలన్‌గా కమల్ హాసన్, ప్రాజెక్ట్ K టీమ్ క్రేజీ అప్‌డేట్, నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయే క్షణమంటూ ప్రభాస్ ట్వీట్
లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal haasan)కూడా ఇందులో వన్ ఆఫ్ ది కీ రోల్ చేస్తున్నాడు. దశాబ్దాలుగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఉలగనాయగన్‌తో కలిసి నటించడం పట్ల చాలా చాలా ఎక్జయిటింగ్‌కు లోనవుతున్నాడు ప్రభాస్.
Hyderabad, June 25: గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తోన్న క్రేజీ ప్రాజెక్టుల్లో ఒకటి ప్రాజెక్ట్ K (Project k). మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే (Deepika) , దిశా పటానీ, ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్ (Amithab) కీలక పాత్ర పోషిస్తున్నారు. లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal hasan)కూడా ఇందులో వన్ ఆఫ్ ది కీ రోల్ చేస్తున్నాడు. దశాబ్దాలుగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఉలగనాయగన్‌తో కలిసి నటించడం పట్ల చాలా చాలా ఎక్జయిటింగ్‌కు లోనవుతున్నాడు ప్రభాస్. కమల్‌హాసన్‌కు సంబంధించిన ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేస్తూ.. తన సంతోషాన్ని అందరితో పంచుకున్నాడు ప్రభాస్. నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయే క్షణం. Project K లో లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ (Kamal Hasan) సర్‌తో కలిసి పనిచేసినందుకు మాటల్లో చెప్పలేనంత గౌరవంగా భావిస్తున్నా. కల నిజమైన వేళ.. టైటాన్ ఆఫ్ సినిమాతో కలిసి నేర్చుకునే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని తన ఎక్జయిట్‌మెంట్‌ను అందరితో పంచుకున్నాడు ప్రభాస్. ఇప్పుడీ పోస్ట్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.
A moment that will be etched in my heart forever. Honored beyond words to collaborate with the legendary @iKamalHaasan sir in #ProjectK. The opportunity to learn and grow alongside such a titan of cinema is a dream come true moment - #Prabhas via Instagram.… pic.twitter.com/mKkJkWIe6F
— Prabhas (@PrabhasRaju) June 25, 2023
ఈ చిత్రంలో ప్రభాస్‌తో సమానంగా కమల్‌హాసన్ రెమ్యునరేషన్ ఉండబోతున్నట్టు ఇప్పటికే ఓ అప్‌డేట్ తెరపైకి వచ్చింది.ప్రాజెక్ట్ Kలో కీలకంగా సాగే రైడర్స్ (యూనిఫార్మ్‌డ్ విలన్ ఆర్మీ) కాస్ట్యూమ్స్ మేకింగ్, అసెంబ్లింగ్ వీడియోను మేకర్స్ ఇప్పటికే విడుదల చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది.
Welcoming the greatest actor Ulaganayagan @ikamalhaasan. Our journey becomes Universal now. #ProjectK https://t.co/DIbI5R7YA2#Prabhas @SrBachchan @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @AshwiniDuttCh @VyjayanthiFilms pic.twitter.com/pokTfuErl0
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) June 25, 2023
ఇప్పటికే విడుదల చేసిన దీపికా పదుకొనే లుక్ సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో హింట్ ఇచ్చేసింది. ఈ చిత్రాన్ని 2024 జనవరి 12న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించింది నాగ్‌అశ్విన్ టీం. ప్రభాస్ దీంతోపాటు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో నటిస్తున్న సలార్ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. మరోవైపు మారుతి హార్రర్ కామెడీ ప్రాజెక్ట్ కూడా సెట్స్ పై ఉంది.
(The above story first appeared on LatestLY on Jun 25, 2023 05:23 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

