Chiranjeevi (Credits: Twitter)

Hyderabad, October 21: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) 154వ చిత్రం టైటిల్ (Title) విడుదలకు ముహూర్తం ఫిక్సయింది. బాబీ (Bobby) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం టైటిల్ టీజర్ (Teaser) దీపావళి (Deepavali) సందర్భంగా అక్టోబరు 24న ఉదయం 11.07 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ దీపావళికి మనం 'మాస్ మూలవిరాట్' కు స్వాగతం పలుకుదాం అంటూ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఓ ప్రకటనలో తెలిపింది. "బాస్ వస్తున్నాడు... పూనకాలు లోడింగ్" అంటూ మెగా ఫ్యాన్స్ ను హుషారెత్తించేలా ట్వీట్ చేసింది.

క్రికెట్ అభిమానులకు పిడుగులాంటి వార్త.. ఎల్లుండి మెల్బోర్న్ వేదికగా జరుగనున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కు వాన గండం.. వర్షసూచన వెలువరించిన ఆస్ట్రేలియా వాతావరణ శాఖ

కాగా ఈ మాస్ ఎంటర్టయినర్ చిత్రానికి 'వాల్తేరు వీరయ్య' అనే పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపు ఇదే ఖరారవుతుందని భావిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన శ్రుతిహాసన్ కథానాయిక కాగా, మాస్ మహారాజా రవితేజ ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు.