మెగాస్టార్ అభిమానులకు గుడ్ న్యూస్. మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిరు సినిమా 156 వ చిత్రం సెట్స్ పైకి వెళ్లడానికి సిద్దమౌతుంది. బింబిసార తో ప్రేక్షకులను మెప్పించిన యువ దర్శకుడు వశిష్ట ఈ సినిమాకి తెరకెక్కించనున్న సంగతి విదితమే. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.ఇదొక భిన్నమైన అడ్వెంచర్ ఫాంటసీ సినిమాగా ముస్తాబు కానుంది.
నివేదికల ప్రకారం, షూటింగ్ నవంబర్ మూడవ వారం నుండి ఏప్రిల్ చివరి వారం వరకు షెడ్యూల్ చేయబడింది. తొలి విడత షెడ్యూల్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని మారేడుమిల్లి అడవుల్లో చిత్రీకరించనున్నారు. నిర్దిష్ట ప్రదేశంలో షూట్ షెడ్యూల్‌లో అనేక కీలక సన్నివేశాలు ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన స్టార్ కాస్ట్‌ను మేకర్స్ ఇంకా ప్రకటించలేదు.
ముందుగా చిరంజీవి పాల్గొనని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట మేకర్స్. అతి త్వరలోనే ఈ సెట్స్‌లో చిరంజీవి పాల్గొంటారని సమాచారం. ఫాంటసీ అడ్వెంచరస్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘విశ్వంభర’ టైటిల్ అనుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది.
ఓటీటీలోకి వచ్చేసిన భగవంత్ కేసరి.. ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఈ సినిమాకి విశ్వంభర అనే పేరు పరిశీలనలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఇందులో చిరంజీవి పాత్ర పేరు భీమవరం దొరబాబు అని సమాచారం. భీమవరం కాంబినేషన్ లో ఈ సినిమా ప్రారంభం కానుంది. ఈ సినిమాలో చిరు లుక్, గెటప్ లు చాలా ప్రత్యేకంగా ఉంటాయని.. ఆ పాత్రలో మంచి వినోదం ఉంటుందని తెలుస్తోంది.
Here's Mega 156 Update
The forces rise for the MEGA MASS BEYOND UNIVERSE ✨#Mega156 begins 🔮🔥
Happy Dussehra 🏹
MEGASTAR @KChiruTweets @DirVassishta @mmkeeravaani @NaiduChota @saimadhav_burra @UV_Creations pic.twitter.com/utFS8MXO3r
— UV Creations (@UV_Creations) October 23, 2023
దొరబాబు పాత్ర నవ్వుల్ని పంచుతూనే మరో కొత్త ఊహ ప్రపంచానికి తీసుకెళ్తుందని.. విజువల్ ఎఫెక్ట్స్ కి ప్రాధాన్యం ఉన్న ఈ సినిమాలో చిన్నారుల్ని అలరించే ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. ఈ నెలఖారులోనే సినిమా రెగ్యూలర్ గా షూటింగ్ జరగనుంది.
సోషియా ఫాంటసీ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్నికి లీడింగ్ బ్యానర్ మూవీ క్రియేషన్స్ తెరకెక్కిస్తోంది. లెజెండర్ మ్యూజిక్ డైరెక్టర్ ,ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
చిరంజీవి చివరిసారిగా నటించిన చిత్రం భోలా శంకర్‌కి మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 2015 తమిళ చిత్రం వేదాళం యొక్క రీమేక్ మరియు తమన్నా భాటియా, కీర్తి సురేష్ మరియు సుశాంత్ ఇతర ప్రముఖ పాత్రలలో నటించారు.
మెగా156 కాకుండా, నటుడు తన కిట్టిలో మరో రెండు సినిమాలు కూడా ఉన్నాయి. వాటికి తాత్కాలికంగా వరుసగా Mega157 మరియు Mega158 అని పేరు పెట్టారు. మెగా157కి సుస్మిత కొణిదెల హెల్మ్ చేయనుండగా, బోయపాటి శ్రీను మెగా158కి దర్శకత్వం వహించనున్నాడు.