Hyderabad, July 24: హారర్ చిత్రాలకు (Horror Movies) కొత్త అర్థం చెప్పిన సినిమా చంద్రముఖి. ఇప్పుడు ఆ మూవీకి కొనసాగింపుగా చంద్రముఖి-2 (Chandramukhi-2) వస్తోంది. రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ జంటగా పి.వాసు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు (Oscar Award) గ్రహీత ఎంఎం కీరవాణి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో హారర్ ఏ స్థాయిలో ఉంటుందో కీరవాణి తాజాగా చేసిన ట్వీట్ ద్వారా అర్థమవుతున్నది. ఆయన చేసిన ట్వీట్ లో ఏమున్నదంటే.. 'లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కి చంద్రముఖి-2 చిత్రం చూశాను. ఈ సినిమాలోని పాత్రలు చావు భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతాయి. కానీ ఆ సినిమాలోని సీన్లకు జీవం పోసేందుకు నేను రెండు నెలల పాటు రేయింబవళ్లు నిద్రలేకుండా గడిపాను. ఆ సీన్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. ఆ సీన్లకు ప్రాణం పోసేందుకు నా వంతు కృషి చేశాను' అని కీరవాణి తన ట్వీట్ లో వివరించారు.
Watched @LycaProductions Chandramukhi 2. The characters in the movie spend sleepless nights from fear of DEATH . for me 2 months of sleepless days and nights for adding LIFE to the mind blowing scenes with my efforts. GuruKiran & my friend Vidyasagar pls wish me the best 🙏🙏
— mmkeeravaani (@mmkeeravaani) July 23, 2023
చావు భయంతో నిద్రలేని రాత్రులు.. నాకు 2 నెలలు పగలే: MM Keeravani ఆసక్తికర పోస్ట్ #MMKeeravani #Chandramukhi2 #Vasu #raghavalawrence #MusicDirector #DishaFilmNews #DishaDailyNews @mmkeeravaani @offl_Lawrence @Kangana_Army https://t.co/xKNyCMfqmF
— Disha Telugu Newspaper (@dishatelugu) July 24, 2023
ఆశీస్సులు అందించాలని..
ఈ సందర్భంగా గురుకిరణ్, తన మిత్రుడు విద్యాసాగర్ ఈ సందర్భంగా తనకు ఆశీస్సులు అందించాలని కూడా కీరవాణి కోరారు. గతంలో రజనీకాంత్ హీరోగా వచ్చిన చంద్రముఖి చిత్రానికి విద్యాసాగర్ సంగీతం అందించగా... కన్నడలో విష్ణువర్ధన్ హీరోగా ఆప్తమిత్ర పేరుతో తెరకెక్కిన ఈ హారర్ చిత్రానికి గురుకిరణ్ సంగీతం సమకూర్చిన విషయం తెలిసిందే.