మెగా హీరోలు పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం ‘బ్రో’. తమిళంలో భారీ విజయం సాధించిన వినోదయ సీతం చిత్రానికి తెలుగు రీమేక్ ఇది. నటుడు కమ్ డైరెక్టర్ సముద్రఖని ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించారు. ఇందులో ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ హీరోయిన్లుగా నటించగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు.
ఈ సోషియో ఫాంటసి సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ సినిమా ఇవాళ అడియన్స్ ముందుకు వచ్చింది. అయితే ఇప్పటికే ప్రీమియర్ షోస్ చూసిన ప్రేక్షకుల తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. బ్రో’ కథేంటి? ఎలా ఉంది? దేవుడిగా పవన్ ఏమేరకు మెప్పించాడు? తదితర విషయాలను సోషల్ మీడియా వేదికగా చర్చిస్తున్నారు.
ఇప్పటికే ఓవర్సీస్ లో, తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల ప్రీమియర్ షోలు వేశారు. సినిమా చూసిన అభిమానులు తమ రివ్యూలని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. అయితే ట్విటర్‌లో ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా యావరేజ్‌గా ఉందని అంటున్నారు. ఓవరాల్‌గా కథ బాగున్నప్పటికీ కొన్ని అనవసరపు సన్నివేశాలు జోడించడం వల్ల సినిమా యావరేజ్‌గా అనిపిస్తుంది. గత సినిమాలతో పోలిస్తే తమన్ సంగీతం కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. పవన్ ఫ్యాన్స్‌కి మాత్రం ఈ సినిమా నచ్చుతుంది అని ఓ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Here's Tweets
#Bro 1st half: PK intro the best 🔥🔥
Old songs frm #PK movie r placed perfectly 👌👌it’s a feast 👌#PK swag , looks killer 👍🏻👍🏻 Feast fr fans.. #SDT is the defect in movie,
Decent 1st half 👍🏻 @MusicThaman Bgm excellent.. Iragadheesadu… https://t.co/8UdwqXRKWn
— Rayalaseema Chinnodu (@14karthikeya) July 28, 2023
Ipude #bro first half complete chesaa... Super vundhi comedy timings aythe perfect ga work ayendhi naa varuku 3.5/5 rating...#BroTheAvatar #pavankalyan #bro pic.twitter.com/usdERd6Ki5
— vdk fan boy ram (@ramkris76597686) July 28, 2023
#bro is a powerstar film but lot of lag and many unnecessary scenes makes a below par movie thaman music stands out may be a below average fare for others and vintage papk for fans#BroTheAvatar
— Gowtham (@gowthamreddy25) July 28, 2023
#BRO First half review highlights:-
1) Vintage Pawan mannerisms 🤙💥
2) Total fun filled👌
3) Bromance between mama alludu👍👍
4) Taman music K**Ramp 💥🔥🔥#BroTheAvatar#BroReview#PawanaKalyan #SaiDharamTej #ketikasharma#PriyaPrakashVarrier
— CinephileX (@CinephileX) July 27, 2023
#BRO Strictly for PK fans ….high whistle blowing moments with PK vintage mash up songs …Rest all goes flat …again Trivikram failed to deliver an remake with unwanted emotions and unexceptional
Lag in screenplay …BGM 👍🔥 2.75/5 #BroTheAvatar #BROFromJuly28th #BROreview pic.twitter.com/q7H1aZVsVX
— Saideep07 (@saideep_satya77) July 27, 2023
బ్రో’సినిమా బాగుంది. ఫస్టాఫ్ కామెడీ అదిరిపోయింది. మామఅల్లుళ్ల మధ్య బ్రోమాన్స్ బాగా వర్కౌట్ అయింది. ఇక సెకండాఫ్‌లో ఆడియెన్స్ ఎమోషల్ అయ్యే సీన్లు ఉన్నాయి.అదే సమయంలో కొన్ని సాగదీత సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. పవన్ కల్యాణ్ మేజరిజం, కామెడీతో ఫస్టాఫ్ ఎంటర్‌టైనింగ్‌గా ఉందట. అయితే సాధారణ ప్రేక్షకులకు మాత్రం అంతగా నచ్చకపోవచ్చు అంటున్నారు. ఫ్యాన్స్‌ని దృష్టిలో పెట్టుకొనే కొన్ని సన్నివేశాలను యాడ్ చేశారట. అవి సాధారణ ప్రేక్షకులను ఇబ్బందిగా అనిపిస్తాయని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.