Hyderabad, SEP 24: రెబల్ స్టార్ కృష్ణంరాజు (Krishnam Raju) తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇటీవల మరణించిన (Krishnam Raju Death) విషయం తెలిసిందే. అయన అకాల మరణానికి చింతిస్తూ పలు రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా సోషల్ మీడియాలో కృష్ణంరాజు (Krishnam Raju) గారిపై ప్రేమని తెలుపుతూ సోషల్ మీడియా పోస్ట్ లు (Social Media Post) చేశారు. ఈ క్రమంలోనే ప్రభాస్ కూడా కృష్ణంరాజు గారి మరణం తరువాత తొలిసారి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు. ఆ వీడియో పోస్ట్ ఎంతో ఎమోషనల్ గా ఉంది. ప్రభాస్‌ అభిమానులు (Prabhas fans) చేసిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది.

అందులో ఒకవైపు కృష్ణంరాజు నటించిన చిత్రాలలోని పాత్రలు, మరోవైపు ప్రభాస్‌ (Parbhas) నటించిన చిత్రాలలోని సన్నివేశాలను ఒకదానితో ఒకటి కలిసేలా మిక్స్‌ చేసిన విధానం బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ అభిమానులను కట్టిపడేస్తోంది. ‘ఎడిటింగ్‌ చాలా బాగుంది’, ‘సేమ్‌ మేనరిజం’ అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. అది కాస్త ప్రభాస్ వరకు చేరడంతో.. ఆ వీడియోని ప్రభాస్ లవ్ సింబల్ పెట్టి, రీ పోస్ట్ చేశాడు.

Chiranjeevi: చిరంజీవిగా 44 ఏళ్లు... మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్.. ప్రాణం ఖరీదు సినిమాతో చిరంజీవిగా ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్.. ఆ సినిమా రిలీజ్ అయి 44 ఏళ్లు.. ప్రేక్షకాభిమానుల రుణాన్ని ఈ జన్మలో తీర్చుకోలేనన్న చిరంజీవి 

కృష్ణంరాజు మరణం సమయంలో.. కన్నీరు పెట్టుకుంటున్న ప్రభాస్ నీ చూడలేకపోయిన ఫ్యాన్స్, డార్లింగ్ ఆ సంఘటన నుంచి బయటపడాలని కోరుకున్నారు. కృష్ణంరాజు గారి మరణం కారణంగా షూటింగ్స్ కి కొత్త బ్రేక్ తీసుకున్న ప్రభాస్, నిన్నటి నుంచి మళ్ళీ షూటింగ్స్ లో పాల్గొనడంతో ఫ్యాన్స్ కూడా ఆనంద పడుతున్నారు.