Natu Natu Song: 'నాటునాటు' పాటకు కాలు కదిపిన రామ్ చరణ్ అత్తగారు.. వీడియో వైరల్

'నాటునాటు' పాటకు రామ్ చరణ్ భార్య ఉపాసన తల్లి శోభన కామినేని కూడా కాలు కదిపారు. దీనికి సంబంధించిన వీడియోను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Natu Natu Song: 'నాటునాటు' పాటకు కాలు కదిపిన రామ్ చరణ్ అత్తగారు.. వీడియో వైరల్
Credits: Twitter

Hyderabad, Jan 22: జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR) , రామ్ చరణ్ (Ram Charan), రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో వచ్చిన 'ఆర్ఆర్ఆర్' (RRR) సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆస్కార్ రేసులో సైతం నిలిచింది. మరోవైపు ఈ చిత్రంలోని 'నాటునాటు' (Natu Natu) పాట గోల్డెన్ గ్లోబ్ వంటి అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంటోంది. తాజాగా ఈ పాటకు రామ్ చరణ్ భార్య ఉపాసన తల్లి శోభన కామినేని కూడా కాలు కదిపారు. మరో మహిళతో కలిసి ఆమె స్టెప్పులు వేశారు. ప్రస్తుతం శోభన దావోస్ లో ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎంతో గర్విస్తున్న అత్తయ్య అంటూ పోస్ట్ చేశారు.

(The above story first appeared on LatestLY on Jan 22, 2023 09:27 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).