Pawan Kalyan (Photo/Twitter/Varma)

ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వార్తల్లో ప్రముఖంగా నిలుస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రచార వాహనం వారాహి పూజలు కొండగట్టులో (Varahi in Kondagattu) జరిపించి అక్కడే మీడియాతో కూడా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో రాంగోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ (RGV Satires on Pawan) వరుస ఫోటోలు షేర్ చేస్తూ కామెంట్స్ చేస్తూ వచ్చారు. పవన్ కళ్యాణ్ స్వామి వివేకానంద అని అలాంటి అతను హిట్లర్ వ్యాన్ మీద నుంచి మాట్లాడుతున్నాడు అంటూ పవన్ కళ్యాణ్ గురించి రామ్ గోపాల్ వర్మ కొన్ని ఫోటోలు షేర్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన కుడికాలిని హిట్లర్ నాకుతాడని ఎడమ కాలిని స్వామి వివేకానంద నాకుతాడని అలాంటి పవర్ కేవలం పవన్ కళ్యాణ్ కి మాత్రమే ఉందని అన్నారు. అలాగే ఆయన పెద్ద పంది వారాహికి మాత్రమే ఉందంటూ కామెంట్లు చేశారు. తర్వాత పవన్ కళ్యాణ్ ను వివేకానందతో పోలుస్తూ బలవంతుడైన వివేకానందుడు అంటూ కూడా షేర్ చేశారు.

జనసేన పొత్తులపై క్లారిటీ, ఏపీలో బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళతాం, కొత్త పొత్తులు కలిస్తే వారితో కలిసి వెళ్తాం, స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్

ఆ రోజుల్లో రామారావు గారు "చైతన్య రథం" మీద తిరిగితే, మీరు”పంది బస్సు” మీద (NTR returns in Chaitanyaratham.. you in the ‘pig bus) తిరుగుతున్నారు అంటున్న తప్పుడు నా కొడుకులందర్నీ జనసేనలతో బస్సు టైర్ కింద తొక్కించేయండి సార్! ఒకవేళ అలా చేయడం లీగల్ గా కుదరదనుకుంటే కనీసం కేసులన్నా పెట్టించండి పవన్ గారూ, ఇది మీ ఫ్యాన్ గా నా విన్నపం అంటూ వర్మ ట్వీట్ చేశారు.

Here's Varma Tweets

"గుడిలో ఉంటే అది “వారాహి" రోడ్డు మీద ఉంటే అది “పంది".. పీ(పవన్ కళ్యాణ్), తన పందికి “వారాహి" అని పేరు పెట్టుకోవడం ఆ దేవతని దారుణంగా అవమానించినట్టే" అని కొన్ని కుక్కలు మొరుగుతున్నాయి, వెంటనే వాళ్ళ నోర్లు మూయించక పోతే మన పవిత్ర "వారాహి"ని ఒక "పంది బస్సు" గా ముద్ర వేస్తారు. జై పీకే జై జనసేన అంటూ వర్మ మరో ట్వీట్ చేశారు. ఆ వెంటనే డియర్ జనసైనికులారా దయచేసి #PandhiBassuVaarahi హ్యాష్‌ట్యాగ్ ని ట్రెండ్ అవ్వకుండా చూసుకోండని కూడా వర్మ ట్వీట్ చేశారు.