Credits: Twitter

Hyderabad, Jan 2: టాలీవుడ్ (Tollywood) సూపర్ స్టార్ (Super Star) మహేశ్ బాబు (Mahesh Babu) సినీ హీరోగా మాత్రమే కాకుండా మనసున్న వ్యక్తిగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సొంతూరు బుర్రిపాలెంతోపాటు తెలంగాణలోని (Telangana) సిద్ధాపూర్ గ్రామాన్ని కూడా మహేశ్ బాబు దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు.

జనవరి 2వ తేదీ నుంచి కొత్త ఏడాది మొత్తం నుంచి ఈ వాస్తు జాగ్రత్తలు పాటిస్తే, లక్ష్మీ దేవి మీ ఇంట్లోనే కొలువై ఉంటుంది..

ముఖ్యంగా, మహేశ్ బాబు ఫౌండేషన్ (Mahesh Foundation) ద్వారా ఆంధ్రా హాస్పిటల్స్ సహకారంతో వందలాది చిన్నారులకు హృద్రోగ సంబంధిత ఆపరేషన్లు చేయించి వారి కుటుంబాల్లో సంతోషం నింపుతున్నారు. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు తన సేవా కార్యక్రమాల కోసం కొత్త వెబ్ సైట్ ప్రారంభించారు. మహేశ్ బాబు ఫౌండేషన్ డాట్ ఆర్గ్ పేరుతో ఈ వెబ్ సైట్ ను తీసుకువచ్చారు.

చంద్రబాబు సభలో మరోసారి తొక్కిసలాట, ముగ్గురు మహిళలు మృతి, పలువురికి గాయాలు, గుంటూరు సభలో విషాదం 

పిల్లల కోసం నూతన సంవత్సరాది రోజున ఈ వెబ్ సైట్ ప్రారంభిస్తున్నట్టు మహేశ్ బాబు ఫౌండేషన్ ట్విట్టర్ లో వెల్లడించింది. ఈ ట్వీట్ తో పాటు జోడించిన వీడియోలో మహేశ్ బాబు ముద్దుల తనయ సితార తన సందేశాన్ని వెలువరించింది. ఈ నెల తన పాకెట్ మనీని మహేశ్ బాబు ఫౌండేషన్ కు విరాళంగా ఇస్తున్నానని, మీరు కూడా మీ వంతు సాయం చేయండి అంటూ విజ్ఞప్తి చేసింది. మనందరం కలిసి పిల్లల కోసం మరింత మెరుగైన ప్రపంచాన్ని సృష్టిద్దాం అని పేర్కొంది.

పవన్ కళ్యాణ్‌కు షాక్ ఇచ్చిన కేసీఆర్, ఏపీ బీఆర్ఎస్ ప్రెసిడెంట్‌గా జనసేన అగ్రనేత, ఏపీ రాజకీయాల్లో కేసీఆర్ మార్క్ రాజకీయం ఇదే..