Unstoppable PSPK Teaser: నీ ఫ్యాన్స్ అంతా ఎందుకు ఓట్లు వేయలేదు! పవన్ కల్యాణ్‌ కు బాలకృష్ణ షాకింగ్ క్వశ్చన్, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు పూనకాలు లోడింగ్, అన్ స్టాపబుల్ షో టీజర్ విడుదల చేసిన ఆహా
PSPK on AHA (PIC @ Aha Twitter)

Hyderabad, JAN 20: పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆహా అన్ స్టాపబుల్ (unstoppable) టీజర్ రిలీజ్ అయింది. బాలకృష్ణ యాంకర్ గా వ్యవహరిస్తున్న ఈ షోలో పవన్ కల్యాణ్ గత నెలలో పాల్గొన్నాడు. అప్పటి నుంచి ఫ్యాన్ ఈ ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన టీజర్ ను (Teaser) విడుదల చేసింది. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఎపిసోడ్‌ స్ట్రీమింగ్‌ కానుంది. ఇక పవన్‌తో బాలయ్య (Bala krishna) చేసిన సందడి మామూలుగా ఉండదు. బాలయ్య వేసే ప్రశ్నలకు పవన్ చెప్పే సమాధానం అభిమానుల్ని ఆకట్టుకుంటుందని ఈ టీజర్‌లో చూపెట్టారు. సినిమాలు, రాజకీయాలు.. ఇలా అన్ని అంశాలపై బాలయ్య పవన్‌ల మధ్య ముచ్చట సాగనుంది. ఇక చిరు నుండి పవన్ ఎలాంటి మంచి, చెడు నేర్చుకున్నాడని బాలయ్య అడగ్గా.. దానికి పవన్ చాలా సుదీర్ఘమైన సమాధానం చెప్పినట్లుగా తెలుస్తోంది.

మధ్యలో తన వదినకు కాల్ చేసి అదే తన లాస్ట్ సినిమా అని పవన్ చెప్పినట్లుగా తెలపడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే సినిమా నుండి రాజకీయాలపై బాలయ్య ఓ పవర్‌ఫుల్ ప్రశ్నను అడిగాడు. పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్న పవన్‌కు వారందరూ ఓట్లు ఎందుకు వేయడం లేదని బాలయ్య స్ట్రెయిట్ క్వశ్చన్ అడిగాడు.

Pushpa 2: రేపటి నుండి పుష్ప 2 సెట్స్ పైకి వెళ్లనున్నట్లుగా వార్తలు, ఇంకా అధికారికంగా రాని ప్రకటన, కీలక పాత్రలో జగపతిబాబు నటించే అవకాశం 

దీనికి పవన్ ఎలాంటి సమాధానం ఇచ్చాడా అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇక టీజర్ చివర్లో ‘మేమిద్దరం బ్యాడ్ బాయ్స్’ అంటూ బాలయ్య కౌంట్‌డౌన్ చెబుతుండగా, పవన్ నవ్వుకున్నాడు. మొత్తానికి పవన్ ఎపిసోడ్ ఈ సీజన్‌కే బాప్ ఆఫ్ ఆల్ ది ఎపిసోడ్స్‌గా నిలవనుందని మేకర్స్ సైతం ధీమా వ్యక్తం చేస్తున్నారు.