Vijay (Twitter)

Hyderabad, October 16: టాలీవుడ్ (Tollywood) యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) జమ్మూ కశ్మీర్ లో సరిహద్దు ప్రాంతానికి వెళ్లారు. బారాముల్లా జిల్లాలో నియంత్రణ రేఖకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న యూరీ సెక్టార్ (Uri Sector)ను సందర్శించారు. అక్కడ విధి నిర్వహణలో ఉన్న భారత సైనికులను కలిసి, వారితో సరదాగా ముచ్చటించారు. సైనిక జాకెట్ ధరించి, తుపాకీ చేతబట్టారు.

‘గోరింటాకు’, ‘త్రిశూలం’, ‘అభిమన్యుడు’, ‘సీతారామ కల్యాణం’, ‘శ్రీనివాస కల్యాణం’, ‘జానకి రాముడు’, ‘నారీనారీ నడుమ మురారి’ వంటి మ్యూజికల్ హిట్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ సినీ నిర్మాత కాట్రగడ్డ మురారి కన్నుమూత.. చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచిన మురారి

అంతేకాదు, ఆర్మీ ఫైరింగ్ రేంజ్ ని సందర్శించి, తుపాకీ కాల్చడంపై అక్కడి జవాన్లను అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి టార్గెట్ బోర్డుపై తుపాకీ ఎక్కుపెట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలను విజయ్ దేవరకొండ ట్విట్టర్ లో పంచుకున్నారు. భారత సరిహద్దుల్లో శత్రు భీకర పోరాట యోధులను కలుసుకున్నానని వెల్లడించారు.