TV

Guntur Kaaram Ticket Price Hike: తెలంగాణలో గుంటూరు కారం సినిమా టికెట్ రేట్స్ పెరిగాయి బాసూ, సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధర ఎంతంటే..

Hazarath Reddy

సూపర్‌స్టార్ మహేశ్ బాబు 'గుంటూరు కారం' సినిమా జనవరి 12న గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం నుంచి టికెట్ల రేట్ల పెంపుతో పాటు బెన్‌ఫిట్ షోలకు అనుమతి లభించింది. ఈ ప్రకటన ప్రకారం.. సింగిల్ స్క్రీన్లలో రూ.65, మల్టీఫ్లెక్స్ థియేటర్లలో రూ.100 పెంపునకు అనుమతి దక్కింది.

Rashid Khan Dies: సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం, ప్రొస్టేట్‌ క్యాన్సర్‌తో ప్రముఖ సంగీత దర్శకుడు రషీద్ ఖాన్ మృతి

Hazarath Reddy

సినీ ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సంగీత దర్శకుడు రషీద్ ఖాన్(55) అనారోగ్యంతో కన్నుమూశారు. గతనెల కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయన ఈ రోజు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు

Jabardasth Avinash Viral Post: జబర్దస్త్ అవినాష్ కుటుంబంలో విషాదం, బిడ్డను కోల్పోయానంటూ అవినాష్ ఎమోషనల్ పోస్ట్

VNS

తన భార్య అనూజతో కలిసి దిగిన ఫొటోను ఇన్ స్టాలో షేర్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఇప్పుడు తనకు జ‌రిగిన విషాదాన్నితెలుపుతూ.. తమ బిడ్డని కోల్పోయిన విషయాన్ని పంచుకున్నాడు. త‌న భార్య అనూజకు అబార్షన్ అయిందని.. తమ బిడ్డను కోల్పొయినట్లు ఇన్ స్టా వేదిక‌గా ఎమోషనల్ పోస్ట్ (Avinash Viral Post) పెట్టాడు.

Kaathal – The Core: స్వలింగ సంపర్కుడి పాత్రలో యాత్ర హీరో మమ్ముట్టి, సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన 'కాదల్‌: ది కోర్‌, ఎందులో స్ట్రీమింగ్ అంటే..

Hazarath Reddy

మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి, ప్రముఖ హీరోయిన్ జ్యోతిక నటించిన ప్రయోగాత్మక సినిమా 'కాదల్‌: ది కోర్‌ మూవీ సైలెంట్ గా ఓటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. అయితే ప్రైమ్‌ వీడియోలో అందుబాటులోకి తెచ్చారు కానీ దీన్ని ఫ్రీగా చూసే వీల్లేదు.

Advertisement

HanuMan Pre-Release Event: హనుమాన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్‌గా చిరంజీవి, సోషల్ మీడియాలో గుప్పుమంటున్న వార్తలు

Hazarath Reddy

ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరుకానున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కూడా ఈ ఈవెంట్ లో పాల్గొంటారనే టాక్ నడుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాగా ఈ సినిమా హీరో తేజ సజ్జ మెగాస్టార్ చిరంజీవి ‘ఇంద్ర’ సినిమాలో చిన్నప్పటి పాత్రను పోషించాడు

Guntur Karam Update: సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ టైం, అమెరికా థియేటర్‌ నుంచి గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్, ఈ నెల 6న ఈవెంట్లో ట్రైలర్ విడుదల చేయనున్న మేకర్స్

Hazarath Reddy

మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న చిత్రం ‘గుంటూరు కారం’. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ జనవరి 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డేట్ ఖరారు చేశారు. ఈ నెల 6వ తేదీన హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది

Pallavi Prashanth Bailed: ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ కు బెయిల్ మంజూరు, ఆదివారం పోలీసుల విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని ఆదేశం

VNS

బిగ్‌బాస్‌-7 విజేత పల్లవి ప్రశాంత్‌కు (Pallavi Prashanth) నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల ధ్వంసం కేసులో పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయిన విష‌యం తెలిసిందే. ఈ కేసులో ప్రశాంత్‌కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.

Arbaaz Khan Weds Sshura Khan: మేక‌ప్ ఆర్టిస్ట్ ను పెళ్లిచేసుకోబోతున్న సల్మాన్ ఖాన్ సోద‌రుడు, త‌న‌కంటే 22 ఏళ్ల చిన్న‌దైన యువ‌తితో అర్బాజ్ ప్రేమాయ‌ణం

VNS

ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) తమ్ముడు అర్బాజ్ ఖాన్ మేకప్ ఆర్టిస్టు షురా ఖాన్ పెళ్లిపీటలెక్కుతున్నారు. డిసెంబర్ 24 న ముంబయిలో వీరి వివాహం జరగబోతోంది. అర్బాజ్ ఖాన్‌కి ఇది రెండో పెళ్లి. 1998 లో నటి మలైకా అరోరాను (Malika Arora) పెళ్లాడిన అర్బాజ్ 19 సంవత్సరాల వైవాహిక జీవితానికి బ్రేకప్ చెప్పి 2017 లో విడాకులు తీసుకున్నారు

Advertisement

Pallavi Prashant: వీడియో ఇదిగో, పల్లవి ప్రశాంత్‌ను చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు, విధ్వంసం కేసులో అరెస్ట్ అయిన బిగ్ బాస్ 7 విన్నర్

Hazarath Reddy

పల్లవి ప్రశాంత్‌ను చంచల్ గూడ జైలుకు పోలీసులు తరలించారు. అన్నపూర్ణ స్టూడియో వద్ద విధ్వంసం కేసులో బిగ్ బాస్ - 7 విజేత పల్లవి ప్రశాంత్‌ మరియు అతని తమ్ముడు రాజును అరెస్ట్ చేయగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఇద్దరినీ చంచల్ గూడ జైలుకు తరలించారు.

Bigg Boss 7 Winner Pallavi Prashanth Arrested: బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్..బస్సులు, వాహనాల విధ్వంసం కేసులో అరెస్టు చేసిన పోలీసులు

sajaya

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయ్యారు. పల్లవి ప్రశాంత్‌ను గజ్వేల్‌లోని కొల్లూరు గ్రామంలోని అతని ఇంట్లో అరెస్టు చేశారు. అతనిపై 9 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

Case Booked Against Pallavi Prashanth: ఫోన్ స్విచ్ఛాఫ్, పరారీలో బిగ్‌బాస్‌ సీజన్‌–7 విన్నర్ పల్లవి ప్రశాంత్‌, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్‌ పోలీసులు

Hazarath Reddy

పబ్లిక్‌ న్యూసెన్స్‌కు కారణమైన బిగ్‌బాస్‌ సీజన్‌–7 విజేత గొడుగు పల్లవి ప్రశాంత్‌ కోసం జూబ్లీహిల్స్‌ పోలీసులు గాలింపు చేపట్టారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉండగా ఫోన్‌ కూడా స్విచ్చాఫ్‌లో ఉండటంతో అతడి అనుచరులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు

Bigg Boss Telugu 7: ఫ్యాన్స్ అత్యుత్సాహం, బిగ్ బాస్ కంటెస్టెంట్ల కార్లు ధ్వంసం, స్టూడియో నుంచి బయటికొచ్చే కార్లపై దాడికి తెగబడిన అభిమానులు

Hazarath Reddy

నిన్న రాత్రి బిగ్ బాస్ ఫైనల్ ముగిసిన అనంతరం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ వెలుపల జనం అత్యుత్సాహం చూపించారు.స్టూడియో నుంచి బయటికొచ్చే కార్లపై దాడికి తెగబడ్డారు. తొలుత రన్నరప్ అమర్ దీప్ కారు అద్దాలను ధ్వంసం చేశారు. కాసేపటికి బయటికొచ్చిన ఈ సీజన్ కంటెస్టెంట్ అశ్విని శ్రీ పాత సీజన్ కంటెస్టెంట్ గీతు రాయల్ వాహనాలపైనా దాడి చేశారు.

Advertisement

Bigg Boss Telugu 7 Winner Pallavi Prashanth: బిగ్ బాస్ ట్రోఫీ ఎత్తిన పల్లవి ప్రశాంత్...రన్నరప్ గా నిలిచిన అమర్ దీప్..3వ స్థానంలో శివాజీ..

sajaya

బిగ్ బాస్ తెలుగు 7 ఉల్టా-పుల్టా సీజన్ ఈవెంట్‌లో, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ టైటిల్ ట్రోఫీని ఎగరేసుకొనిపోయాడు. అమర్‌దీప్‌ రన్నరప్‌గా నిలిచాడు. ఈరోజు అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన ఈ ఈవెంట్లో అయితే ఊహించని ట్విస్ట్‌గా ప్రశాంత్‌ను విజేతగా ప్రకటించారు.

Pallavi Prashanth As Bigg Boss 7 Telugu winner: బిగ్ బాస్ విన్నర్‌గా నిలిచిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్, రన్నరప్ గా అమర్ దీప్..

ahana

100 రోజులకు పైగా ప్రేక్షకులను అలరించిన బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ ఫినాలేకి చేరుకుంది మరియు ఎట్టకేలకు విజేతను వెల్లడించారు. అధికారిక ధృవీకరణ ఇంకా బయటకు రానప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ప్రశాంత్ విజేత అని పేరును ధృవీకరించాయి. సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డగా ఫేమస్ అయ్యాడు.

Youtuber Arrest: బర్త్ డే వేడుకల కోసం పిలిచి లైంగిక దాడికి పాల్పడ్డ య్యూటూబర్, పక్కింటి కుర్రాడుగా ఫేమస్ అయిన చంద్రశేఖర్ అరెస్ట్

VNS

నార్సింగి పోలీసులు ప్ర‌ముఖ యూట్యూబ‌ర్ చంద్ర‌శేఖ‌ర్ సాయికిర‌ణ్‌ను (Chandrasekhar Sai Kiran) అరెస్ట్ చేశారు. ఓ యువ‌తి ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు అత‌డిని అదుపులోకి తీసుకున్నారు. పుట్టిన రోజు వేడుక‌ల‌కు త‌న‌ను ఆహ్వానించి లైంగిక దాడికి (rape) పాల్ప‌డిన‌ట్లు యువ‌తి ఫిర్యాదులో పేర్కొంది. 2021 ఏప్రిల్ 25న ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు తెలిపింది.

Pakkinti Kurradu Chandoo Sai Arrest: బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు పిలిచి యువతిపై అత్యాచారం, పక్కింటి కుర్రాడు క్రియేటర్ చందుసాయిని అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

ప్రముఖ యూట్యూబర్‌ చందుగాడు , పక్కింటి కుర్రాడు యూట్యూబ్‌ ఛానల్స్‌ క్రియేటర్ నటుడు చందుసాయిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు అతడిని శుక్రవారం అరెస్ట్‌ చేశారు.

Advertisement

Dinesh Phadnis Dies: సినీ పరిశ్రమలో మరో విషాదం, అనారోగ్యంతో సీఐడీ నటుడు దినేష్ ఫడ్నిస్ కన్నుమూత

Hazarath Reddy

ప్రముఖ షోలో ఫ్రెడరిక్స్ పాత్రను పోషించిన సీఐడీ నటుడు దినేష్ ఫడ్నిస్ డిసెంబర్ 4న రాత్రి కన్నుమూశారు. ఈ-టైమ్స్ నివేదిక ప్రకారం అతను అర్ధరాత్రి సమయంలో తుది శ్వాస విడిచారు. డిసెంబరు 2 నుండి దినేష్ ఫడ్నిస్ వెంటిలేటర్ సపోర్ట్‌పై ఉన్నారని, గుండెపోటుతో ఆసుపత్రి పాలయ్యారని అనేక మీడియా నివేదికలు సూచించగా, అతని సహనటుడు దయానంద్ శెట్టి ఫడ్నిస్‌కు గుండెపోటు రాలేదని స్పష్టం చేశారు.

Bhagavanth Kesari on OTT: ఓటీటీలోకి వచ్చేసిన భగవంత్‌ కేసరి.. ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్‌ అవుతుందంటే?

Rudra

సీనియర్‌ హీరో బాలకృష్ణ వరుస విజయాలతో ఊపుమీదున్నారు. ఆయన అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో నటించిన యాక్షన్‌ చిత్రం ‘భగవంత్‌ కేసరి’ దసరా కానుకగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద భారీ హిట్‌ ను అందుకున్నది.

Sudigali Sudheer on Marriage: పెళ్లి మీద ఇంట్రస్ట్ లేదంటూ సుడిగాలి సుధీర్ షాకింగ్ కామెంట్స్, రష్మితో పెళ్లి గురించి జబర్దస్త్ నటుడి సమాధానం ఇదిగో..

Hazarath Reddy

రష్మీతో కెమిస్ట్రీ వగైరా అంతా ఆన్ స్క్రీన్ కోసం చేసిందే. ఇక పెళ్లి అంటారా అది నా చేతుల్లో లేదు. ప్రస్తుతానికైతే సినిమాలపైనే ఫోకస్. పెళ్లి గురించి అసలు ఆలోచనే లేదు. చెప్పాలంటే పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను

Vinod Thomas: ప్రముఖ మలయాళ నటుడి అనుమానాస్పద మృతి.. పార్క్‌ చేసి ఉన్న కారులో విగతజీవిగా కనిపించిన నటుడు వినోద్ థామస్

Rudra

మలయాళ నటుడు వినోద్ థామస్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. కొట్టాయం జిల్లా పాంపడి ప్రాంతంలోని ఓ హోటల్‌ సిబ్బంది తమ హోటల్ పరిసరాల్లో కారులో ఓ వ్యక్తి చాలాసేపు చలనం లేకుండా ఉండిపోవడం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement
Advertisement