టెలివిజన్

RRR Awards: ఆర్ఆర్ఆర్ చిత్రానికి మరో రెండు విదేశీ అవార్డులు.. హూస్టన్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ పురస్కారాల్లో ఉత్తమ విదేశీ చిత్రంగా అవార్డ్ కైవసం

Rudra

దిగ్గజ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ గెలిచి ప్రతిష్ఠాత్మక ఆస్కార్ రేసులో ఉన్న ఈ చిత్రం తాజాగా, మరో రెండు విదేశీ అవార్డులనూ కొల్లగొట్టింది. హూస్టన్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ అవార్డుల్లో ఆర్ఆర్ఆర్ ఉత్తమ విదేశీ చిత్రంగా నిలిచింది.

Taraka Ratna No More: హైదరాబాద్ చేరుకున్న తారకరత్న పార్దీవదేహం.. ప్రముఖుల సంతాపం.. భౌతిక కాయాన్ని చూడటానికి క్యూకట్టిన అభిమానులు, రేపు అంత్యక్రియలు.. వీడియోతో

Rudra

తెలుగు సినీ నటుడు నందమూరి తారకరత్న గత నెల 27న తీవ్ర గుండెపోటుకు గురై, గత 23 రోజులుగా చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. తారకరత్న భౌతిక కాయం బెంగళూరు నుంచి ఈ ఉదయం రంగారెడ్డి జిల్లా మోకిల గ్రామంలో ఆయన నివాసానికి చేరుకున్నది.

James Cameron: రామ్ చరణ్ పై దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్ ప్రశంసలు... పుత్రోత్సాహంతో చిరంజీవి ట్వీట్

Rudra

ఆర్ఆర్ఆర్ నుంచి నాటు నాటు పాట ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ బరిలో ఉంది. ఈ క్రమంలో హాలీవుడ్ దర్శక దిగ్గజం జేమ్స్ కామెరాన్ ఆర్ఆర్ఆర్ పై మరోసారి తన అభిప్రాయాలను పంచుకున్నారు. సినిమాలో రామ్ క్యారెక్టర్ ఎంతో సవాల్ తో కూడుకున్నదని పేర్కొన్నారు.

Geetha Singh: కమెడియన్ గీతాసింగ్ ఇంట విషాదం.. రోడ్డు ప్రమాదంలో గీతాసింగ్ దత్తత కుమారుడి మృతి

Rudra

ఎవడిగోల వాడిది, కితకితలు వంటి సినిమాల ద్వారా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సినీ నటి, కమెడియన్ గీతా సింగ్ ఇంట విషాదం నెలకొంది. కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె దత్తత కుమారుడు మృతి చెందాడు.

Advertisement

Bruce willis: చికిత్స లేని వ్యాధి బారినపడ్డ ‘డై హార్డ్’ స్టార్ బ్రూస్ విల్లిస్

Rudra

‘డై హార్డ్’ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకొన్న హాలీవుడ్ దిగ్గజ నటుడు బ్రూస్ విల్లిస్.. చికిత్స లేని ఫ్రాంటోటెంపోరల్ డిమెన్షియా వ్యాధి బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు గురువారం మీడియాకు వెల్లడించారు.

Swara Bhaskar: సమాజ్ వాదీ పార్టీ యువనేతను లవ్ మ్యారేజి చేసుకున్న బాలీవుడ్ నటి స్వరా భాస్కర్.. వీడియోతో

Rudra

తను వెడ్స్ మను, తను వెడ్స్ మను రిటర్న్స్, వీరే ది వెడ్డింగ్ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన నటి స్వరా భాస్కర్ తాజాగా ప్రేమ వివాహం చేసుకున్నారు. స్వరా భాస్కర్ ప్రేమించి పెళ్లాడింది ఓ రాజకీయనేతను కావడం విశేషం.

Shaakuntalam: 'శాకుంతలం' కొత్త రిలీజ్ డేట్.. ఏప్రిల్ 14. ప్రకటించిన చిత్రబృందం

Rudra

సమంత అభిమానులంతా ఇప్పుడు 'శాకుంతలం' సినిమా కోసం వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాను ఈ నెల 17వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. అయితే కొన్ని కారణాల వలన వాయిదా వేసినట్టుగా ఇటీవల ప్రకటన చేశారు. ఇక ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేశారు.

Unstoppable-2: బాలయ్యతో పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్..?? 'అన్ స్టాపబుల్ 2' వేదికగా చర్చ.. ఏంటా విషయం??

Rudra

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హోస్ట్ గా ఆహా (Aha) ఓటీటీలో (OTT) ప్రసారమవుతున్న టాక్ షో అన్ స్టాపబుల్ (Unstoppable). ఇప్పుడీ షో రెండో సీజన్ నడుస్తోంది.

Advertisement

Yasaswi Kondepudi: వివాదంలో చిక్కుకున్న సింగర్ యశస్వి కొండెపుడి, ఎన్జీవో సంస్థ పేరుతో మోసానికి పాల్పడ్డారని నవసేవ పౌండేషన్‌ నిర్వహకురాలు ఫరా కౌసర్‌ ఆరోపణలు

Hazarath Reddy

సరిగమప విన్నర్ యశస్వి కొండెపుడి వివాదంలో చిక్కుకున్నారు. తనది కాని సంస్థను తనదని చెప్పుకుని మోసానికి పాల్పడ్డాంటూ నవసేవ పౌండేషన్‌ నిర్వహకురాలు ఫరా కౌసర్‌ ఆరోపణలు చేశారు. తాను చేయని సామాజిక సేవ గురించి తప్పుడు ప్రచారం చేసుకున్నాడని మండిపడ్డారు.

Unstoppable-2: పవన్ కల్యాణ్ తో బాలయ్య అన్ స్టాపబుల్... సెకండ్ పార్ట్ ప్రోమో ఇదిగో!

Rudra

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న టాక్ షో అన్ స్టాపబుల్. ఇప్పుడీ షో రెండో సీజన్ నడుస్తోంది. ఇటీవల జనసేనాని పవన్ కల్యాణ్ తో రూపొందించిన ఇంటర్వ్యూ తొలి ఎపిసోడ్ ఆహా ఓటీటీ రికార్డులను తిరగరాసింది. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ రెండో పార్ట్ కూడా వచ్చేస్తోంది.

Ricky Kej: కంపోజర్ రిక్కీ కేజ్ కు మూడోసారి గ్రామీ అవార్డ్

Rudra

ప్రముఖ కంపోజర్ రిక్కీ కేజ్ కు మూడోసారి గ్రామీ అవార్డ్ దక్కింది. తన లేటెస్ట్ ఆల్బమ్ డివైన్ టైడ్స్ కు ఈ మేరకు అవార్డు లభించింది. తాజా పురస్కారంతో ఆయన ఖాతాలో గ్రామీ అవార్డ్ రావడం ఇది మూడో సారి. గతంలో 2015, 2022లో ఆయనకు గ్రామీ అవార్డ్ దక్కింది.

Allu Arjun: అల్లు అర్జున్ కు ఊహించని కానుక.. పుష్ప లారీ బొమ్మ కానుకగా ఇచ్చిన తనయుడు అయాన్

Rudra

పుష్పలో అల్లు అర్జున్ ఓ లారీ నడుపుతూ ఎర్రచందనం దుంగలు స్మగ్లింగ్ చేస్తుంటాడు. ఇప్పుడు అలాంటిదే ఓ చిన్న లారీ బొమ్మను అల్లు అయాన్ తన తండ్రికి బహూకరించడం విశేషం.

Advertisement

Vani Jairam: బెడ్ రూములో కిందపడడంతోనే తలకు గాయం.. వాణీ జయరాం మృతిపై అనుమానాల్లేవు.. పోలీసుల వెల్లడి

Rudra

ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరాం(78) మృతిపై నెలకొన్న అనుమానాలను చెన్నై పోలీసులు పటాపంచలు చేశారు. బెడ్రూంలో కిందపడడంతో తలకు బలమైన దెబ్బతగిలి మృతి చెందినట్టు ఫోరెన్సిక్ నివేదికలో తేలినట్టు పోలీసులు తెలిపారు.

K. Vishwanath: కళాతపస్వి కె విశ్వనాథ్ మృతి పట్ల ఆవేదన వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, కేసీఆర్, జగన్, చంద్రబాబు

Rudra

ప్రముఖ దర్శకుడు, తెలుగు సినీ పరిశ్రమ దిగ్గజం కె విశ్వనాథ్ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన మృతితో టాలీవుడ్ మరోసారి శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణం పట్ల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

Ileana: ఇలియానాకు ఫుడ్ పాయిజన్ అయిందని తెలిపిన ఆమె తల్లి

Rudra

గోవా బ్యూటీ ఇలియానా అనారోగ్యంపై ఆమె తల్లి స్పందించారు. ఇలియానాకు ఫుడ్ పాయిజన్ అయిందని తెలిపారు. దీంతో, ఆమె డీహైడ్రేషన్ కు గురయిందని... ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగ్గా ఉందని వెల్లడించారు. మరోవైపు ఇల్లీ త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం ఇలియానా చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.

Mega Family Photo: మాతృమూర్తి పుట్టినరోజు సందర్భంగా మెగా ఫొటో పంచుకున్న నాగబాబు

Rudra

మెగా బ్రదర్ నాగబాబు తమ మాతృమూర్తి అంజనాదేవి పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ లో స్పందించారు. మా జీవన రేఖ, జీవితం అనే కానుకతో తమను దీవించిన తల్లి జన్మదినాన్ని జరుపుకుంటున్నామని నాగబాబు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర ఫొటో పంచుకున్నారు.

Advertisement

Taraka Ratna: బెంగళూరుకు తారకరత్న తరలింపు.. నిలకడగానే ఆరోగ్యం

Rudra

టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చి గుండెపోటుకు గురైన సినీ నటుడు తారకరత్నను గత అర్ధరాత్రి ప్రత్యేక అంబులెన్సులో బెంగళూరుకు తరలించారు.

Actor Naresh: నా హత్యకు రమ్య రఘుపతి కుట్ర.. సినీ నటుడు నరేష్ సంచలన ఆరోపణలు

Rudra

ప్రముఖ సినీ నటుడు నరేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మూడో భార్య రమ్య రఘుపతి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ కోర్టును ఆశ్రయించారు. సుపారీ గ్యాంగ్‌తో కలిసి తనను అంతమొందించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

Unstoppable With Pawan Kalyan: పవన్ నీ మూడు పెళ్లిళ్ల గోలేంటి? అన్ స్టాపబుల్ షో లో ఆసక్తికర సమాధానాలు చెప్పిన పవన్ కల్యాణ్

VNS

పవన్‌ను పలు సీరియస్ ప్రశ్నలు అడిగాడు బాలయ్య. మూడు పెళ్లిళ్ల గొడవ (marriages) ఏమిటని బాలయ్య అడగ్గా.. పవన్ సమాధానం కోసం అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఇంతటి మానసిక సంఘర్షణకు గురైన పవన్ కల్యాణ్ పవర్ స్టార్ ఎలా అయ్యాడని బాలయ్య అడగడంతో ఈ ఎపిసోడ్‌పై మరింత ఆసక్తి క్రియేట్ అయ్యింది.

Jabardasth Racha Ravi: రోడ్డు ప్రమాదంలో రచ్చరవికి తీవ్ర గాయాలంటూ వార్తలు, ఇదంతా ఫేక్ అంటూ ఖండించిన జబర్దస్త్ ఆర్టిస్ట్, తాను క్షేమంగా ఉన్నానని వెల్లడి

Hazarath Reddy

పుణే నుంచి తిరిగి వస్తుండగా.. రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ ఆర్టిస్ట్ రచ్చరవికి గాయాలయ్యాయని సోషల్ మీడియాలో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. సూర్యాపేట - మునగాల వద్ద అదుపుతప్పిన కారు డివైడర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు కథనాలొచ్చాయి.

Advertisement
Advertisement