Karthika Deepam Pre Release: సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టిన వంటలక్క, తెలుగు సీరియల్స్ చరిత్రలో తొలిసారి ఆ క్రెడిట్ దక్కించుకుంటున్న కార్తీకదీపం సీరియల్

హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో మార్చి 21న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. ఈ ఈవెంట్ లో నిరుపమ్ పరిటాల, ప్రేమ విశ్వనాథ్ పాల్గొనున్నారు. ఈ ఈవెంట్ లోనే మొదటి షో ప్రీమియర్ కూడా వేయబోతున్నట్లు సమాచారం. సీక్వెల్, ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రీమియర్ అంటూ కొత్తగా వస్తున్న ఈ కార్తీక దీపం.. ఆడియన్స్ ని ఇంకెంత కొత్తగా అలరించబోతుందో చూడాలి.

Karthika Deepam Pre Release: సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టిన వంటలక్క, తెలుగు సీరియల్స్ చరిత్రలో తొలిసారి ఆ క్రెడిట్ దక్కించుకుంటున్న కార్తీకదీపం సీరియల్
Karthika Deepam Serial Season 2 (PIC@ Star Maa)

Hyderabad, March 21: ‘కార్తీక దీపం’ సీరియల్ (Karthika Deepam) గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిరుపమ్ పరిటాల, ప్రేమ విశ్వనాథ్, శోభాశెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సీరియల్.. ఆరేళ్ళు పాటు 1569 ఎపిసోడ్స్ తో ఆడియన్స్ ని ఎమోషనల్ గా అలరిస్తూ నెంబర్ వన్ సీరియల్ గా టైటిల్ ని అందుకుంది. ఈ సీరియల్ లో నిరుపమ్, ప్రేమ, సోబా నటించిన.. డాక్టర్ బాబు, వంటలక్క, మౌనిత పాత్రలు ఆడియన్స్ కి బాగా రీచ్ అయ్యాయి. తెలుగు టీవీ చరిత్రలో టాప్ టిఆర్పిలను సొంతం చేసుకున్న ఈ సీరియల్ ఎండ్ కార్డు వేసేయడంతో చాలామంది ఆడియన్స్ బాధ పడ్డారు. ఇక నుంచి టీవిలో కార్తీకదీపం సీరియల్ (Telugu Serial Karthika Deepam) రాదా అంటూ ఫీల్ అయ్యారు.

Devara – Part 1: కొత్త షెడ్యూల్‌ కోసం గోవాకు బయలు దేరిన దేవర టీం, సోషల్ మీడియాలో వీడియో వైరల్ 

ముగిసిపోయిన సీరియల్ కి ప్రేక్షకుల నుంచి ఇలాంటి స్పందన వస్తే.. మేకర్స్ అదే సీరియల్ ని రీ టెలికాస్ట్ చేసి ఆడియన్స్ ని ఖుషి చేస్తుంటారు. కానీ కార్తీకదీపం సీరియల్ మేకర్స్ ట్రెండ్ కి తగ్గట్లు.. రీ టెలికాస్ట్ కాకుండా సీక్వెల్ ని తీసుకు వస్తున్నారు.  ‘కార్తీకదీపం – ఇది నవ వసంతం’ అంటూ సీక్వెల్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు. అయితే మేకర్స్ కేవలం సీక్వెల్ విషయంలోనే కాదు, సీరియల్ ని రిలీజ్ చేసే విషయంలో కూడా ట్రెండ్ కి తగ్గట్లు ఆలోచిస్తున్నారు. సినిమాలకు ఫాలో అయ్యే ప్రీ రిలీజ్ (Pre Release Event) ఈవెంట్ ట్రెండ్ ని సీరియల్స్ కి కూడా తీసుకు వస్తున్నారు. మొట్టమొదటిసారిగా ఒక సీరియల్ కి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కండక్ట్ చేస్తున్నారు.

హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో మార్చి 21న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. ఈ ఈవెంట్ లో నిరుపమ్ పరిటాల, ప్రేమ విశ్వనాథ్ పాల్గొనున్నారు. ఈ ఈవెంట్ లోనే మొదటి షో ప్రీమియర్ కూడా వేయబోతున్నట్లు సమాచారం. సీక్వెల్, ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రీమియర్ అంటూ కొత్తగా వస్తున్న ఈ కార్తీక దీపం.. ఆడియన్స్ ని ఇంకెంత కొత్తగా అలరించబోతుందో చూడాలి.

(The above story first appeared on LatestLY on Mar 21, 2024 11:05 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).