తాజా వార్తలు

SI Suicide Case: ఎస్సీ - ఎస్టీ కేసు....ఆత్మహత్య డ్రామా...వెరసీ ఎస్‌ఐ ఆత్మహత్య..వాజేడు ఎస్‌ఐ హరీష్ ఘటనలో పోలీసుల నిర్థారణ

Arun Charagonda

వాజేడు SI ఆత్మహత్య ఘటనలో వెలుగులోకి మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సూర్యాపేటలో ఇద్దరు యువకులను, ఓ కుటుంబాన్ని వేధింపులకు గురి చేసింది యువతి. పరిచయం పెంచుకుని ఆపై పెళ్లి చేసుకోవాలని వేధింపులకు గురిచేసింది.

Viral Video: షాకింగ్ వీడియో...జాయింట్ వీల్‌ నుంచి జారిన యువతి,చివరకు ఏం జరిగిందంటే!

Arun Charagonda

జాయింట్ వీల్‌లో కూర్చున్న ఓ యువతి.పైకి వెళ్లిన తర్వాత ప్రమాదవశాత్తు అందులో నుంచి జారి బయటికి వచ్చేసింది. కిందపడిబోతుండగా మధ్యలో ఇనుప కడ్డీలను పట్టుకుని వేలాడింది. అంతా కేకలు వేయడంతో జాయింట్ వీల్ నిర్వాహకులు అలెర్ట్ అయ్యారు. వెంటనే జాయింట్ వీల్‌ వేగాన్ని తగ్గించి, మెల్లగా యువతి కిందకు వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

Leave Syria-India Travel Advisory: సిరియాలో దాడులు.. వెంటనే దేశాన్ని విడిచిపెట్టి రావాలంటూ ట్రావెల్‌ అడ్వైజరీ జారీచేసిన విదేశాంగ శాఖ

Rudra

అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియాలో పరిస్థితులు మరింతగా దిగజారుతున్నాయి. అధ్యక్షుడు బషర్‌-అల్‌-అసద్‌ గద్దె దిగాలంటూ తిరుగుబాటుదారులు భీకర దాడులకు దిగారు.

CM Revanth Reddy: విద్యార్థులకు వేడి భోజనం, ప్రతీరోజు ప్రిన్సిపాల్- మెస్ ఇంఛార్జీ రుచి చూశాకే విద్యార్థులకు భోజనం పెట్టాలని ప్రభుత్వం కీలక ఆదేశాలు

Arun Charagonda

గురుకులాల్లో, పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. వంట వండిన వెంటనే ప్రిన్సిపల్, మెస్ ఇన్ఛార్జి రుచి చూడాలి.. విద్యార్థులకు భోజనం వేడివేడిగా వడ్డించాలన్నారు. సిబ్బంది మాస్కు, టోపీ, ఆప్రాన్ ధరించాలి.. రెండు పూటలకు పప్పు ఒకేసారి వండకూడదు అన్నారు. విద్యార్థులకు భోజనం వేడివేడిగా వడ్డించాలి.. బియ్యంలో పురుగులు, బూజు కనిపిస్తే వాడకూడదంటూ ప్రత్యేక నిబంధనలు జారీ చేశారు.

Advertisement

Ponnam Meets KCR: నేడు కేసీఆర్ ను కలవనున్న మంత్రి పొన్నం ప్రభాకర్.. ఎందుకంటే??

Rudra

తెలంగాణలో నేడు రాజకీయంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకోబోతుంది. మాజీ సీఎం కేసీఆర్‌ ను మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు మధ్యాహ్నం ఎర్రవెల్లిలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో కలవనున్నారు.

Viral Video: ఆడుకుంటూ పిల్లర్ల మధ్య తలపెట్టిన చిన్నారి.. ఇరుక్కుపోయిన తల.. ఆ తర్వాత ఏమైంది? (వీడియో)

Rudra

తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం పులిజాల గ్రామంలో తృటిలో ఓ చిన్నారికి పెద్ద ప్రమాదం తప్పింది. గ్రామానికి చెందిన ప్రభుత్వ స్కూలులో ఓ విద్యార్థిని తోటి విద్యార్థులతో ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ పిల్లర్ల మధ్య తల పెట్టింది.

Dil Raju As TFDC Chairman: టీఎఫ్‌ డీసీ ఛైర్మ‌న్‌ గా నిర్మాత‌ దిల్ రాజు.. తెలంగాణ ప్రభుత్వం నియామకం

Rudra

ప్ర‌ముఖ సినీ నిర్మాత దిల్ రాజును తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క ప‌ద‌విలో నియమించింది. తెలంగాణ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌ మెంట్ కార్పొరేష‌న్ (టీఎఫ్‌ డీసీ) ఛైర్మ‌న్‌ గా రాజును నియ‌మిస్తున్నట్టు రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారి ఉత్త‌ర్వులు జారీ చేశారు.

AP Weather Update: బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం.. ఏపీకి మరోసారి భారీ వర్షాల ముప్పు.. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు

Rudra

ఫెంగల్ తుఫాను ముప్పు తప్పిపోయినట్టు భావిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ కు మరోసారి భారీ వర్షాల ముప్పు పొంచి ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నేడు దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు.

Advertisement

Accident in Yadadri: చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురి దుర్మ‌ర‌ణం.. యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా భూదాన్ పోచంప‌ల్లి జ‌లాల్‌ పూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (వీడియో)

Rudra

తెలంగాణ‌లోని యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. భూదాన్ పోచంప‌ల్లి జ‌లాల్‌ పూర్ వద్ద ఓ కారు అదుపుత‌ప్పి చెరువులోకి దూసుకెళ్లింది.

Shadnagar MLA Controversial Comments: వెల‌మ‌ల భ‌ర‌తం ప‌డ‌తం, ఉరికిచ్చి కొడ‌తం! షాద్ న‌గ‌ర్ ఎమ్మెల్యే వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

VNS

షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ (Veerlapalli Shankar) వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. వెలమలపై (Velama) భౌతిక దాడులు చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. ఖబడ్దార్‌ వెలమల్లారా అంటూ హెచ్చరించారు. కుట్రలు చేసే వెలమల వీపులు విమానాలు మోగుతాయంటూ వార్నింగ్‌ ఇచ్చారు.

Sandhya Theatre Stampede: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట, మృతురాలి కుటుంబానికి రూ. 25 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించిన అల్లు అర్జున్, త్వరలో కుటుంబాన్ని కలుస్తానని వెల్లడి

Hazarath Reddy

Gango Renuka Thalli Audio Song: పుష్ప‌-2 గంగ‌మ్మ జాత‌ర సాంగ్ వ‌చ్చేసింది, థియేట‌ర్ లో ఈ పాట‌కు గూస్ బంప్స్ ఖాయం

VNS

తాజాగా ‘గంగో రేణుక తల్లి’ (Gango Renuka Thalli) జాత‌ర ఆడియో సాంగ్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ జాతర ఎపిసోడ్‌లో అల్లు అర్జున్‌ మాస్ తాండవం చేశాడు. దాదాపు 30 నిమిషాల‌కు పైగా ఉన్న ఈ సీన్ బ‌న్నీ కెరీర్‌కు హైలెట్‌గా నిలిచింది. ఆస్కార్ అవార్డు విజేత చంద్ర‌బోస్ ఈ పాట‌కు లిరిక్స్ అందించ‌గా.. మ‌హాలింగం పాడాడు. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించాడు.

Advertisement

Sobhita Dhulipala & Naga Chaitanya: 66 ఏళ్ళ వయసులో కూడా 6 ప్యాక్, నాగార్జున బాడీ చూసి షాకవుతున్న నెటిజన్లు, మల్లన్న సేవలో నాగచైతన్య శోభిత దంపతులు

Hazarath Reddy

శ్రీశైలం మల్లన్నసేవలో అక్కినేని నాగచైతన్య-శోభిత ధూలిపాల దంపతులు మెరిసారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్నసేవలో తెలుగు సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబం ప్రత్యక్షమైంది. తెలుగు సినీ నటుడు అక్కినేని నాగార్జున తో పాటు తనయుడు నాగచైతన్య శోభిత దంపతులు శ్రీశైలం మల్లన్నసేవలో పాల్గొన్నారు.

Pickup Vans For TGSRTC Passengers: ప్ర‌యాణికుల‌కు ఆర్టీసీ గుడ్ న్యూస్, దూర ప్రాంత ప్ర‌యాణికుల కోసం పికప్ వ్యాన్లు, తొలుత ఈ రూట్ లో ప్రారంభం

VNS

దూర ప్రాంత ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) శుభవార్త చెప్పింది. హైదరాబాద్‌లో ఆర్టీసీ పికప్‌ వ్యాన్‌ల (Pick Up vans) సేవలు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. తొలి విడతలో ఈసీఐఎల్‌- ఎల్బీనగర్‌ మధ్య ఉన్న ప్రాంతాల నుంచి ఈ పికప్‌ వ్యాన్‌ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. దూరప్రాంత ప్రయాణికుల కోసం ఆర్టీసీ ఈ పికప్‌ వ్యాన్‌లను తీసుకొచ్చింది.

Allu Arjun on Sandhya Theatre Stampede: సంధ్య ధియేటర్ తొక్కిసలాట ఘటనపై వీడియో విడుదల చేసిన అల్లు అర్జున్, ఏమన్నారంటే..

Hazarath Reddy

సంధ్య థియేటర్‌లో జరిగిన విషాద సంఘటనతో తీవ్ర హృదయ విదారకంగా ఉంది. ఈ అనూహ్యమైన కష్ట సమయంలో ఘటనలో దుఃఖిస్తున్న మృతురాలి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ బాధలో వారు ఒంటరిగా లేరని , ఆ కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలుస్తామని నేను వారికి భరోసా ఇవ్వాలనుకుంటున్నాను.

Naga Chaitanya: నాగార్జున మొదటి మాజీ భార్య ఈమే, తల్లితో ఉన్న ఫోటోను విడుదల చేసిన అక్కినేని నాగచైతన్య, రెండు రోజుల క్రితం శోభిత దూళిపాళ్లతో చై వివాహం

Hazarath Reddy

అక్కినేని నాగచైతన్య-శోభిత రెండు రోజుల క్రితం వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే దగ్గుబాటి ఫ్యామిలీ చైతూను పెళ్లికొడుకును చేసిన ఫొటోలను తాజాగా విడుదల చేసింది. చైతూ తన తల్లి లక్ష్మీతో కలిసి దిగిన ఫొటోలు కూడా ఉన్నాయి.

Advertisement

Actress Pragya Videos Leak: నటి ప్రగ్యా ప్రైవేట్ వీడియోలు లీక్?, ఆన్‌లైన్‌లో పెట్టిన దుండగులు...నిందితులపై చర్యలకు ఫ్యాన్స్ డిమాండ్!

Arun Charagonda

నటి ప్రగ్యా నగ్రా ప్రైవేట్ వీడియోలు లీక్ అయినట్లు తెలుస్తోంది. ప్రగ్యా వీడియోలను ఆన్ లైన్ లో దుండగులు పెట్టినట్లు తెలుస్తోండగా వారిపై చర్యలు తీసుకోవాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. దీనిపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. ఎక్స్ లో #pragyanagra హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

Cabinet Approves New KVs: తెలుగు రాష్ట్రాల‌కు గుడ్ న్యూస్, కొత్త కేంద్రీయ విద్యాల‌య‌, న‌వోద‌య విద్యాల‌యాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం

VNS

దేశంలో కొత్తగా 85 కేంద్రీయ విద్యాలయాలు (Kendriya Vidyalaya), 28 నవోదయ విద్యాలయాల (Navodaya Vidyalaya) ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో ఏపీలో 8 కేంద్రీయ విద్యాలయాలు, తెలంగాణలో 8 నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

Suresh Gopi: శంకరాభరణం సినిమాలో బ్రోచే వారెవరురా పాటపాడిన కేంద్ర మంత్రి సురేష్‌ గోపీ, వీడియో ఇదిగో..

Hazarath Reddy

శంకరాభరణం’ సినిమాలోని “బ్రోచే వారెవరురా.." పాట పాడారు కేంద్ర మంత్రి సురేష్ గోపి. శంకరాభరణంతో నేను కర్నాటక మ్యూజిక్‌కు అభిమానిని అని పేర్కొన్నారు.. సాగరసంగమం, శంకరాభరణం… కర్ణాటక మ్యూజిక్ కు రూపాలుగా అభివర్ణించారు.

KCR Meeting With Party MLAs & MLCs: రంగంలోకి కేసీఆర్, అసెంబ్లీలో ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్ర‌ణాళిక‌లు, ఈ నెల 8న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌తో కీల‌క భేటీ

VNS

ఈ నెల 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు (Telangana Assembly) ప్రారంభం కానున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు బీఆర్ఎస్ అధ్య‌క్షుడు కేసీఆర్ (KCR). ఈ మేర‌కు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌తో స‌మావేశం కానున్నారు.

Advertisement
Advertisement