తాజా వార్తలు

Ram Gopal Mishra Murder:మత హింసలో రామ్ గోపాల్ మిశ్రా హత్య, బుల్లెట్‌ తగిలి యువకుడు కుప్పకూలిన వీడియో ఇదిగో..

Hazarath Reddy

బహ్రైచ్‌లో ఇటీవల జరిగిన అల్లర్ల సమయంలో రామ్ గోపాల్ మిశ్రా కాల్చబడిన క్షణాన్ని సంగ్రహించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది, ఇది ప్రాంతం అంతటా ప్రకంపనలు సృష్టించింది. అక్టోబర్ 17 న వెలువడిన వీడియోలో, రాంగోపాల్ మిశ్రాను పట్టపగలు కాల్చడం, ఆ ప్రాంతంలో ఉద్రిక్తతను పెంచడం చూడవచ్చు.

Kuppam TDP Leader Khadar Basha: మరో టీడీపీ నేత రాసలీలలు వీడియో ఇదిగో, పింఛన్ ఇప్పిస్తానంటూ గాజుల ఖాదర్‌ బాషా నన్ను లైంగికంగా అనుభవించాడంటూ వీడియో ద్వారా తెలిపిన యువతి

Hazarath Reddy

ఏపీలో మరో టీడీపీ నేత రాసలీలలకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌ బాషా రాసలీలలు బహిర్గతమయ్యాయి. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, కుప్పం టీడీపీ పరిశీలకుడిగా ఉన్న గాజుల ఖాదర్‌ బాషా అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో యువతిపై లైంగిక దాడికి పాల్పడిన విషయం బయటకు వచ్చింది.

Andhra Pradesh: ప్రత్తిపాడులో చంద్రబాబుకు షాక్, వైసీపీలో చేరిన టీడీపీ కీలక నేత ముదునూరి మురళీకృష్ణంరాజు

Hazarath Reddy

Telangana: రైతు బతుకు ఇంతేనా, ఏడాదిపాటు కష్టపడి పండించిన పంటంతా నేలపాలు, వాగుపై సరైన వంతెన లేకపోవడంతో వరిబస్తాలతో వెళుతున్న ట్రాక్టర్ బోల్తా

Hazarath Reddy

నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలోని వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లడానికి వాగు పై సరైన వంతెన లేకపోవడంతో శమొల్ల సాయినాథ్ అనే యువ రైతు పండించిన సొయా పంట వాగులో ట్రాక్టర్ బోర్ల పడింది. కళ్ళ ముందు పండించిన పంట నీళ్లలో మునగడంతో యువ రైతు దుఃఖంలో మునిగిపోయారు.

Advertisement

Indonesia: షాకింగ్ వీడియో ఇదిగో, ఫోటోలకు ఫోజులిస్తుండగా టూరిస్టును సముద్రంలోకి లాక్కెళ్లిన అలలు, ఆచూకి కోసం రంగంలోకి సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలు

Hazarath Reddy

ఇండోనేషియాలోని మెడాన్‌కు చెందిన 20 ఏళ్ల టూరిస్ట్ రోని జోసువా సిమాన్‌జుంటాక్, అక్టోబర్ 13న కెడుంగ్ తుంపాంగ్ బీచ్‌లో ఫోటో సెషన్‌లో భారీ అల అతనిని సముద్రంలోకి లాగడంతో చనిపోయాడని భయపడ్డారు

Viral Video: షాకింగ్ వీడియో, వేగంగా వస్తున్న రైలు ముందు నిలబడి రీల్ చేసిన యువకులు, ఢీకొట్టడంతో ఎగిరి అవతల పడి..ఇదేం పిచ్చి అంటూ మండిపడుతున్న నెటిజన్లు

Hazarath Reddy

రైల్వే ట్రాక్‌పై నిర్లక్ష్యంగా రీల్స్ చిత్రీకరిస్తుండగా వేగంగా వస్తున్న రైలు ఢీకొన్న యువకుడి షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అయితే ఈ వీడియో విశ్వసనీయత ఇంకా ధృవీకరించబడలేదు. ఈ వైరల్ అవుతున్న వీడియోలో ట్రాక్‌లపై నిలబడి యువకులు డ్యాన్స్ వేస్తున్నారు. ఎదురుగా అమిత వేగంతో రైలు వస్తోంది. రైలు వస్తున్నట్లు తెలిసినప్పటికీ వారు రీల్స్ చిత్రీకరిస్తున్నారు.

Andhra Pradesh: ఏపీలో ఇంకా అభివృద్ధికి దూరంగానే గ్రామాలు, నిండు గర్భిణికి నొప్పులు రావడంతో డోలీలోనే 6 కిలోమీటర్లు మోసుకువెళ్లిన బందువులు

Hazarath Reddy

Next Chief Justice Of India: సుప్రీంకోర్టు త‌దుప‌రి ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా సంజీవ్ ఖ‌న్నా, ప్ర‌తిపాదించిన సీజేఐ డీవై చంద్ర‌చూడ్, ఇంత‌కీ ఎవ‌రీ సంజీవ్ ఖ‌న్నా?

VNS

సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌గా సంజీవ్‌ ఖన్నా (Justice Sanjiv Khanna) పేరును కొలీజియం సిఫార్సు చేసింది. ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై. చంద్రచూడ్‌ (CJI DY Chandrachud) కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకి లేఖ రాశారు. లేఖలో సంజీవ్‌ ఖన్నా పేరును తదుపరి సుప్రీం కోర్టు సీజేఐగా (Next Chief Justice Of India) ప్రతిపాదించారు.

Advertisement

IT Raids At Real Estate Firms: ప్ర‌ముఖ‌ రియ‌ల్ ఎస్టేట్ కంపెనీల‌పై ఇన్ క‌మ్ ట్యాక్స్ దాడులు, పేరుమోసిన బిల్డ‌ర్ల ఇళ్ల‌లో విస్తృత సోదాలు

VNS

హైదరాబాద్‌లో ఐటీ (IT Raids) అధికారులు మరోసారి సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో ఏకకాలంలో 30 చోట్ల దాడులు చేశారు. కొల్లూరు, రాయదుర్గం, ఐటీ కారిడార్‌లోని విజయవాడకు చెందిన రియల్‌ఎస్టేట్‌ వ్యాపారు (Real Estate)ల ఇండ్లలో తనిఖీలు చేస్తున్నారు.

High Tension in Ashok Nagar: హైద‌రాబాద్ అర్ధ‌రాత్రి హై టెన్ష‌న్, ఒక్క‌సారిగా రోడ్ల‌పైకి వ‌చ్చిన నిరుద్యోగులు, అశోక్ న‌గ‌ర్ లో భారీగా పోలీసుల మోహ‌రింపు

VNS

అశోక్‌నగర్‌ మరోసారి రణరంగంలా మారింది. ఈనెల 21 నుంచి జరిగే గ్రూప్‌-1 మెయిన్‌ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం సాయంత్రం వందలాది మంది అభ్యర్థులు (Group 1 Candidates) రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ‘వీ వాంట్‌ జస్టిస్‌’ అంటూ గర్జించారు.

Mouth-to-Mouth CPR to Snake: పాము నోట్లో నోరు పెట్టి శ్వాస అందించిన యువ‌కుడు, చ‌నిపోతున్న స‌ర్పాన్ని తిరిగి బ్రతికించాడు (వీడియో ఇదుగోండి)

VNS

తుది శ్వాస విడుస్తున్న పాముకు సీపీఆర్ చేసి (CPR to Snake) ప్రాణాలు పోశాడు ఓ యువ‌కుడు. గుజ‌రాత్ వ‌డోద‌రాలో (Vadodara) ఈ ఘ‌ట‌న జ‌రిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్ లో వైర‌ల్ గా మారింది.

Cyclone In AP: తీరం దాటిన వాయుగుండం, ఏపీలో భారీ వ‌ర్షాలు, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో భారీ వ‌ర్షాలు, తిరుమ‌ల శ్రీ‌వారి మెట్టుమార్గం మూసివేత‌

VNS

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం (Vayugundam) గురువారం తెల్లవారు జామున తీరం దాటింది. నెల్లూరు (Nellore) జిల్లా తడ సమీపంలో వాయుగుండం తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. గడిచిన ఆరు గంటలుగా 22 కిలో మీటర్ల వేగంతో వాయుగుండం తీరాన్ని తాకింది. ప్రస్తుతం అల్పపీడనంగా వాయుగుండం బలహీనపడుతుంది.

Advertisement

Chennai Rains: రజనీకాంత్‌ ఇల్లు వరద నీటిలో ఎలా మునిగిపోయిందో వీడియో ఇదిగో, చెన్నై నగరాన్ని ముంచెత్తిన భారీ వరదలు

Vikas M

చెన్నైలో కురిసిన భారీ వర్షాలకు పోయెస్‌ గార్డెన్‌లోని రజనీకాంత్‌ విలాసవంతమైన విల్లా నీటిలో ముగినింది.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ఆయన ఇంట్లోకి నీరు చేరింది. ప్రస్తుతం వరదలకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

SBI Slashes Lending Interest Rate: లోన్ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పిన ఎస్‌బీఐ, ఒక నెల టెన్యూర్‌ కలిగిన ఎంసీఎల్‌ఆర్‌ను 8.20 శాతానికి తగ్గింపు

Vikas M

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం SBI తమ మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ బేస్డ్‌ లెండింగ్‌ రేట్ల (ఎంసీఎల్‌ఆర్‌)లో ఒకదాన్ని సవరించింది. ఒక నెల టెన్యూర్‌ కలిగిన ఎంసీఎల్‌ఆర్‌ను 8.20 శాతానికి తగ్గించింది. ఇంతకుముందు ఇది 8.45 శాతంగా ఉండేది. మంగళవారం నుంచే కొత్త రేటు అమల్లోకి వస్తుంది. ఫలితంగా ఆయా రుణాలను తీసుకున్న ఎస్బీఐ కస్టమర్లకు లాభించనున్నది.

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి ధమాకా, డీఏను 3 శాతం పెంచిన మోదీ సర్కారు, ప్రస్తుత పెంపుతో 50 శాతం నుండి 53 శాతానికి డియర్‌నెస్ అలవెన్స్

Vikas M

దీపావళి (Diwali) సందర్భంగా ఉద్యోగులకు కేంద్రం (central government) గుడ్‌ న్యూస్‌ చెప్పింది. కోటి మందికి పైగా ఉద్యోగులు మరియు పింఛనుదారులకు ధరల పెరుగుదల నుండి పరిహారం చెల్లించడానికి కేంద్ర ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్ (డిఎ) మరియు డియర్‌నెస్ రిలీఫ్ (డిఆర్) ను 3 శాతం పెంచింది. ఇది మొత్తం 50 శాతం నుండి 53 శాతానికి తీసుకువెళుతుంది,

Heart Attacks: ఈ చిప్ సాయంతో చేసే రక్తపరీక్షతో కొన్ని నిమిషాల్లోనే గుండెపోటు ముప్పును పసిగట్టవచ్చు, నానో టెక్నాలజీ సాయంతో సరికొత్త రక్తపరీక్షను కనుగొన్న పరిశోధకులు

Vikas M

కేవలం ఒక చిన్న చిప్ సాయంతో నిర్వహించే ఈ రక్తపరీక్షతో గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని కొన్ని నిమిషాల్లోనే పసిగట్టవచ్చట. 5 నుంచి 7 నిమిషాల వ్యవధిలోనే ఈ బ్లడ్ టెస్టు పూర్తవుతుంది. ఇతర టెస్టులకు గంటల కొద్దీ సమయం పడుతుండగా, ఈ టెస్టుతో నిమిషాల్లోనే ఫలితం వచ్చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

Advertisement

ICC Champions Trophy: భారత్ లేకుండా చాంపియన్స్ ట్రోఫీ నిర్వహించడం కరెక్ట్ కాదు, ఈసీబీ చైర్మన్ రిచర్డ్ థాంప్సన్ సంచలన వ్యాఖ్యలు

Vikas M

రెండు దేశాల మధ్య ఉద్రిక్త సంబంధాల కారణంగా 2008 నుండి భారతదేశం పాకిస్తాన్‌లో ఆడలేదు. ఇరు జట్లు ఏదైనా ఐసీసీ టోర్నమెంట్ లో, ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే టోర్నమెంట్లలో మాత్రమే పరస్పరం తలపడుతున్నాయి.

Gas Tanker Blast in Nigeria: నైజీరియాలో ఘోర అగ్ని ప్రమాదం, ఆయిల్‌ ట్యాంకర్‌ పేలి 140 మంది మంటల్లో సజీవ దహనం, హైవేపై ట్యాంకర్‌ వెళ్తున్న సమయంలో బోల్తా

Hazarath Reddy

నైజీరియాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. ఆయిల్‌ ట్యాంకర్‌ పేలిన ఘటనలో 140 మంది దుర్మరణం పాలయ్యారు. జిగావా రాష్ట్రంలో స్థానిక కాలమానం ప్రకారం అర్ధరాత్రి ఈ దుర్ఘటన చోటు చేసుకుందని పోలీస్‌ ప్రతినిధి లావన్‌ ఆడమ్‌ పేర్కొన్నారు.

New Liquor Rates in AP: ఇంకా అందుబాటులోకి రాని రూ.99కే క్వార్టర్ బాటిల్, ఏపీలో కొత్త లిక్కర్ ధరల పూర్తి సమాచారం ఇదిగో..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి నూతన మద్యం పాలసీ అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే! ఈ మేరకు సోమవారం లాటరీల్లో కేటాయించిన షాపుల్లో మద్యం అమ్మకాలు మొదలయ్యాయి.

Medak Road Accident: మెదక్‌ జిల్లా రోడ్డు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి, బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి

Hazarath Reddy

మెదక్‌ జిల్లా శివంపేట పీఎస్‌ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉసిరికపల్లి-వెల్దుర్తి రహదారిలో కారు అతివేగంగా రోడ్డు ప‌క్క‌నే ఉన్న చెట్టును ఢీకొట్టి వాగులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Advertisement
Advertisement