తాజా వార్తలు

Helicopter Crashes In Pune: పూణెలో కుప్పకూలిన ప్రైవేట్ హెలికాప్టర్, నలుగురికి తీవ్ర గాయాలు..వీడియో

Arun Charagonda

మహారాష్ట్రలోని పూణె జిల్లా పౌడ్‌ వద్ద ఓ ప్రైవేట్ హెలికాప్టర్‌ కుప్పకూలింది. అందులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యయి. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

PDP Poll Manifesto: కశ్మీర్ స‌మ‌స్య కంటే నాకు ఏదీ ఎక్కువ కాదు, ఏ కూటమిలోనూ చేరే ప్ర‌స‌క్తే లేదని తేల్చి చెప్పిన మెహ‌బూబా ముఫ్తీ, జ‌మ్మూక‌శ్మీర్ ఎన్నిక‌ల మేనిఫెస్టో విడుద‌ల చేసిన పీడీపీ

VNS

జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (PDP) అధినేత్రి మెహబూబా ముఫ్తీ (PDP Chief Mehbooba Mufti) అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను (JK Poll Manifesto) శనివారం విడుదల చేశారు. ప్రజల ఆకాంక్షల పేరుతో పలు అంశాలను ప్రస్తావించారు. కూటమిగా ఏర్పడిన నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీలు తమ పార్టీ ఎజెండాలను అనుసరిస్తే తాము పోటీకి దూరంగా ఉంటామని మెహబూబా ముఫ్తీ అన్నారు.

Bhatti Reacted Demolition Of Hydra: ఏకంగా చెరువులోనే నిర్మాణాలు చేప‌డితే కూల్చివేయ‌రా? హైడ్రా కూల్చివేత‌ల‌ను స‌మ‌ర్ధించిన డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌

VNS

హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతల (N Convention) వ్యవహారంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy Cm Bhatti Vikramarka) శనివారం స్పందించారు. హైదరాబాద్‌ అంటే లేక్స్‌, రాక్స్‌కు నెలవని.. వీటిని కాపాడుకోవాలంటూ పర్యావరణవేత్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారని గుర్తు చేశారు. చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేయడం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు

Telangana Weather Update: తెలంగాణ‌కు మ‌రోసారి భారీ వ‌ర్ష సూచ‌న‌, ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం, రెండు రోజులు అల‌ర్ట్ జారీ

VNS

తెలంగాణలో రాగల రెండురోజుల పాటు భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (IMD) హెచ్చరించింది. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే (Rain Alert) అవకాశం ఉందని పేర్కొంది.

Advertisement

Ranganath On N Convention Demolition: ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైడ్రా కమిషనర్ రంగనాథ్‌, చట్టప్రకారమే కూల్చివేతలని కామెంట్,కేటీఆర్ ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలన్న బీజేపీ ఎంపీ

Arun Charagonda

అక్రమ కట్టడాల కూల్చివేత తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. చెరువులు, కుంటలను ఆక్రమించిన వారిపై కొరడా ఝుళిపిస్తోంది హైడ్రా. ఇందులో భాగంగా ఇవాళ సినీనటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేసింది. ఉదయం భారీ బందొబస్తు నడుమ కూల్చివేత ప్రక్రియ కొనసాగించగా నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై స్టే విధించింది న్యాయస్థానం.

Karnataka Shocker: ఇన్ స్టాగ్రామ్ లో ప‌రిచ‌య‌మైన యువ‌తిపై గ్యాంగ్ రేప్, ఒక్క‌సారి క‌లుద్దామ‌ని పిలిచి బీర్ లో డ్ర‌గ్ క‌లిపి ఇచ్చిన యువ‌కుడు, అట‌వీ ప్రాంతంలో సామూహిక అత్యాచారం

VNS

సోషల్‌ మీడియాలో పరిచయమైన వ్యక్తి ఒక మహిళను కిడ్నాప్‌ చేశాడు. డ్రగ్స్‌ (Drugs) ఇచ్చి కారులో అత్యాచారానికి పాల్పడ్డాడు. (woman kidnapped and Raped) ఆ మహిళను ఆమె ఇంటి వద్ద దింపేందుకు ప్రయత్నించగా కొందరు వ్యక్తులు గమనించారు.

AP Capital Amaravathi Update: అమ‌రావ‌తి నిర్మాణ ప‌నుల‌పై మంత్రి నారాయ‌ణ కీల‌క వ్యాఖ్య‌లు, ఎంత ఖ‌ర్చ‌వుతుంది? ఎప్ప‌టి నుంచి ప‌నులు ప్రారంభిస్తారంటే?

VNS

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని అమరావతి (Amaravathi Construction) నిర్మాణంపై ఏపీ మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్‌ 1వ తేదీ నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణానికి రూ.60వేల కోట్లు ఖర్చవుతుందని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా కంకిపాడులో జరిగిన క్రెడాయ్‌ సౌత్‌ కాన్‌ 2024 కార్యక్రమానికి మంత్రి నారాయణ హాజరయ్యారు.

Andhra Pradesh Shocker: ప్రకాశం జిల్లా దర్శిలో విషాదం..ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థుల గల్లంతు, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు

Arun Charagonda

ప్రకాశం జిల్లా దర్శి లో విషాదం నెలకొంది. దర్శి సమీపంలోని సాగర్ కాలువలో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతు అయ్యారు. గల్లంతు అయిన విద్యార్థులు పోతిరెడ్డి లోకేష్, బత్తుల మణికంఠ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి గా గుర్తించగా కొత్తపాలెం గ్రామానికి చెందిన పోతిరెడ్డి లోకేష్ మృతదేహం లభ్యం అయింది.మరో ఇద్దరు విద్యార్థులు మణికంఠ, కిరణ్ మృతదేహాలు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Astrology: కృష్ణాష్టమి రోజున ఈ రాశుల వారు కృష్ణునికి ఈ వస్తువులు సమర్పిస్తే మీకు అదృష్టం కలిసి వస్తుంది.

sajaya

ఆగస్టు 26 కృష్ణాష్టమి. కృష్ణుని అనుగ్రహం పొందడానికి ఈ వస్తువులను సమర్పిస్తే మీకు ఖచ్చితంగా సానుకూల ఫలితాలు లభిస్తాయి. ఆ కృష్ణ పరమాత్ముని అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై ఉంటుంది. మీరు ఐశ్వర్యాలు పొందుతారు.

Fake Baba At Vikarabad: వికారాబాద్ పట్టణంలో దొంగ బాబా హల్చల్, డబ్బులు ఇవ్వకపోతే పాపం చుట్టుకుంటుందని బెదిరింపులు, దొంగబాబాకు దేహశుద్ది చేసిన స్థానికులు

Arun Charagonda

వికారాబాద్‌లో దొంగబాబాకు దేహశుద్ది చేశారు స్థానికులు. మీ ఇంట్లో నరదృష్టి ఉంది దయ్యాలు ఉన్నాయి 500, 1000 రూపాయలు ఇవ్వండి మేము తాయత్తు ఇస్తాము దయ్యాన్ని మాయం చేస్తామంటూ నాలుగైదు రోజుల నుండి రాజీవ్ గృహకల్పాల్లో హల్చల్ చేస్తున్నాడు ఓ దొంగ బాబా.

Astrology: ఆగస్టు 27 నుండి రెండు గ్రహాల కలయిక వల్ల..ఈ మూడు రాశుల వారికి అదృష్టం పెరుగుతుంది.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆగస్టు 27న బుధుడు ,శుక్రుడు కలయిక వల్ల మూడు రాశుల వారికి జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. ఆ మూడు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం బుద్ధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు.

MAA Revokes Suspension On Hema : నటి హేమపై సస్పెన్షన్ ఎత్తివేసిన 'మా', కానీ ఓ కండిషన్ పెట్టిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, థ్యాంక్స్ చెప్పిన హేమ..వీడియో

Arun Charagonda

బెంగళూరు రేవ్ పార్టీ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ పార్టీలో పలువురు సినీ నటులు ఉండగా నటి హేమ కూడా ఉన్నట్లు ఆరోపణలు రాగా ఆమె విచారణకు సైతం హాజరయ్యారు. ఇక డ్రగ్స్ పార్టీ నేపథ్యంలో హేమ మా సభ్యత్వాన్ని రద్దు చేశారు మంచు విష్ణు.

Advertisement

Telangana Congress: ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌కు చుక్కెదురు, ఫేక్ మెంబర్ షిప్ ఎఫెక్ట్‌, వెంకట్ సభ్యత్వాన్ని హోల్డ్‌లో పెట్టిన యూత్ కాంగ్రెస్!

Arun Charagonda

తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. తాజాగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌కు చుక్కెదురైంది. వెంకట్ సభ్యత్వాన్ని హోల్డ్‌లో పెట్టింది యూత్ కాంగ్రెస్.

Astrology: ఆగస్టు 26 కృష్ణాష్టమి రోజున అరుగుదైన ఐదు యోగాల కలయిక..ఈ 5 రాశులు వారికి అదృష్టం.

sajaya

ఈసారి కృష్ణాష్టమి ఆగస్టు 26వ తేదీ సోమవారం నా వచ్చింది. ఈ సందర్భంగా ఐదు యోగాలు ఒకేరోజు ఏర్పడడం చాలా విశేషం. జయంతి యోగం, సర్వసిద్ధి యోగం, హర్షణయోగం, శివయోగం, గజకేసరి యోగం కలయిక.

Health Tips: మీ కాళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా. అయితే మీ మీ గుండెల్లో బ్లాకులు ఉన్నట్టే.

sajaya

ఈ రోజుల్లో చాలామంది ఎక్కువగా ఇబ్బంది పడే సమస్యల్లో ముఖ్యమైనది గుండె సంబంధం సమస్యలు. చిన్న వయసులో వారికి కూడా ఈ గుండెపోట్లు రావడం హార్ట్ లో బ్లాక్లు ఏర్పడమనేది తీవ్రమైన అనారోగ్య సమస్యగా మనం చెప్పుకోవచ్చు.

HC Stay On N Convention Demolition: ఎన్‌ కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టు స్టే, కూల్చివేతలు ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు, నాగార్జునకు రిలీఫ్‌

Arun Charagonda

తెలంగాణ హైకోర్టులో నటుడు నాగార్జునకు రిలీఫ్ లభించింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై స్టే విధించింది న్యాయస్థానం. కూల్చివేతలు ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం తీర్పు వెలువరిస్తామని చెప్పింది హైకోర్టు. దీంతో నాగ్‌కు రిలీఫ్ దక్కింది.

Advertisement

Health Tips: మీ మొఖం చంద్రబింబంలో మెరిసిపోవాలనుకుంటున్నారా.. అయితే ఈ మూడు పనులు చేయండి చాలు.

sajaya

అందంగా ఉండాలని అందరికీ ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు ఇది ఈ కోరిక చాలా ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం ఎంత ముఖ్యమో మెరిసే చర్మం పొందడానికి కూడా మన ఆ విధంగానే ఆహారంలో కొన్ని ప్రత్యేక శ్రద్ధలు తీసుకోవాలి.

Health Tips: ఎన్ని మందులు వాడిన గొంతు నొప్పి దగ్గు తగ్గడం లేదా.. అయితే ఈ డికాషన్ తాగండి.

sajaya

వర్షాకాలం వచ్చిందంటే చాలు చాలామంది జలుబు దగ్గు వంటి సమస్యతో బాధపడుతుంటారు. ఎన్ని మందులు వాడినప్పటికీ కూడా దగ్గు అనేది చాలా రోజులు ఉంటుంది. దీంతో పాటు గొంతు నొప్పి కూడా అధికంగా ఉంటుంది.

Police Case On BRS MLA Palla: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదు, బఫర్ జోన్‌లో అనురాగ్ యూనివర్సిటీ నిర్మించారని ఫిర్యాదు, కేసు నమోదు చేసిన పోలీసులు

Arun Charagonda

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదైంది. బఫర్ జోన్‌లో అనురాగ్ యూనివర్సిటీ నిర్మించారని పల్లాపై కేసు నమోదు చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వెంకటాపురంలో ఉంది అనురాగ్ యూనివర్సిటీ. బఫర్ జోన్‌లో నిర్మాణాలు చేపట్టారని పోచారం పీఎస్‌లో ఇరిగేషన్ డిపార్టుమెంట్ ఈఈ పరమేశ్వర్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

Health Tips: పసుపు డ్రాగన్ ఫ్రూట్ తో మీ కొలెస్ట్రాల్ ఈజీగా తగ్గుతుంది.ఈ పండుతో గుండె సమస్యలు పరార్

sajaya

ఆరోగ్యానికి పండ్లు ఎంతో మేలు చేస్తాయి. ప్రతిరోజు రకరకాలైన పండ్లు తీసుకుంటూ ఉంటాం. ఆపిల్, అరటి, నారింజ, ద్రాక్ష వంటి అనేక రకాలైన పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తూ ఉంటాయి.

Advertisement
Advertisement