తాజా వార్తలు

Sudden Death Caught on Camera: షాకింగ్ వీడియో ఇదిగో, డ్యాన్స్ వేస్తున్న ఆడ గుర్రం తన్నడంతో బాలుడు మృతి, యూపీలో విషాదకర ఘటన

Hazarath Reddy

వివాహ వేడుకలో ఆడ గుర్రం తన్నడంతో మైనర్ బాలుడు మృతి చెందిన విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో కెమెరాకు చిక్కింది. ఈ దురదృష్టకర ఘటనకు సంబంధించిన వీడియో కూడా ఆన్‌లైన్‌లో వచ్చింది

Telangana: వీడియో ఇదిగో, ఉద్యోగాలు ఇవ్వాలంటూ ప్రజాభవన్ ముందు ఆందోళనకు దిగిన డీఎస్సీ 2008 బాధితులు, 5 నెలలుగా అపాయింట్మెంట్ ఆర్డర్ల కోసం ఎదురు చూస్తున్నామని ఆవేదన

Hazarath Reddy

డీఎస్సీ 2008 బాధితులు ప్రజా భవన్‌కు భారీగా తరలివచ్చారు. అపాయింట్మెంట్ ఆర్డర్స్(Appointment Orders) ఇవ్వాలంటూ ప్రజా భవన్(Praja Bhavan) ముందు ఆందోళన(Dharna)కు దిగారు. తమకు ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం క్యాబినెట్ లో నిర్ణయం తీసుకొని ఏడాది గడిచిపోయిన తమకు ఇంతవరకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Ambati Rambabu Slams Nara Lokesh: వీడియో ఇదిగో, మీ తండ్రి లేకపోతే నువ్వో పెద్ద సుద్ద పప్పువి, నారా లోకేష్ మీద విరుచుకుపడిన అంబటి రాంబాబు

Hazarath Reddy

Andhra Pradesh Cylinder Explosion: వీడియో ఇదిగో, నంద్యాలలో ఇంట్లో ఒక్కసారిగా పేలిన గ్యాస్‌ సిలిండర్‌, ఇద్దరు మృతి, మరో తొమ్మిది మందికి గాయాలు

Hazarath Reddy

ఏపీలోని నంద్యాల పరిధి చాపిరేవులలోని ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. 9 మందికి గాయాలయ్యాయి. చాపిరేవులకు చెందిన వెంకటమ్మ (70) ఇంటికి బేతంచర్ల మండలం పెండేకల్లు గ్రామానికి చెందిన సుబ్బమ్మ, రాముడు అనే బంధువులు సోమవారం రాత్రి వచ్చారు. వారికి రాత్రి భోజనాలు వండిపెట్టి పొరపాటున గ్యాస్‌ ఆఫ్‌ చేయకుండా నిద్రపోయారు.

Advertisement

HFEA: శృంగారంలో పాల్గొనాల్సిన అవసరం లేకుండానే నచ్చిన రూపంలో బిడ్డను కనేయవచ్చు, సంచలన విషయాలను వెల్లడించిన HFEA, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

ఒక దశాబ్దం కంటే తక్కువ సమయంలో, ఒక బిడ్డను పొందేందుకు సెక్స్ అవసరం ఉండకపోవచ్చు. రాబోయే ప్రక్రియ స్వలింగ జంటలు సంతానం పొందే అవకాశానికి దారులు తెరుస్తుంది. హ్యూమన్ ఫెర్టిలైజేషన్ అండ్ ఎంబ్రియాలజీ అథారిటీ బోర్డు (HFEA) గత వారం ఒక సమావేశాన్ని నిర్వహించింది.

APSRTC Buses for Kumbh Mela 2025: రూ. 8 వేలకే 8 రోజుల పాటు కాశీ, వారణాసి, అయోధ్య యాత్ర, మ‌హా కుంభమేళాకు ప్ర‌త్యేక బ‌స్సులు న‌డ‌ప‌నున్న‌ ఏపీఎస్ఆర్‌టీసీ, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

కుంభమేళాకు వెళ్లేవారికి APSRTC శుభవార్తను అందించింది. యూపీలోని ప్ర‌యాగ‌రాజ్‌లో జ‌రుగుతున్న మ‌హా కుంభమేళాకు ప్ర‌త్యేక బ‌స్సులు (APSRTC Special Buses for Kumbh Mela 2025) న‌డ‌ప‌నున్న‌ట్లు ఏపీఎస్ఆర్‌టీసీ ప్ర‌క‌టించింది. విజ‌య‌వాడ నుంచి ఈ ప్ర‌త్యేక బ‌స్సులను ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు జిల్లా ప్రజార‌వాణా అధికారి ఎంవై దానం సోమ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

Hyderabad Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, ఫ్లైఓవర్‌పై అతి వేగంగా వెళ్తూ కరెంటు పోలును, డివైడరును ఢీకొన్న బైక్, ముగ్గురు అక్కడికక్కడే మృతి

Hazarath Reddy

హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంతో ముగ్గురు మైనర్లు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ నగరంలోని బహదూర్‌పురా నుంచి ఆరాంఘర్ చౌరస్తా వరకు నిర్మించిన ఫ్లైఓవర్ పై బైక్ పై వేగంగా వెళ్తూ అదుపుతప్పి ఒక్కసారిగా కరెంటు పోలును, ఆ తర్వాత డివైడరు ఢీకొంది.

Baghpat Watchtower Collapse: వీడియోలు ఇవిగో, ఆదినాథుడి ఆలయంలో లడ్డూ మహోత్సవంలో కుప్పకూలిన వేదిక, 20 మందికి పైగా గాయాలు, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

Hazarath Reddy

ఉత్తర ప్రదేశ్‌ (Uttar Pradesh) రాష్ట్రంలోని బాగ్‌పత్‌ (Baghpat)లో ఆదినాథుడి ఆలయంలో లడ్డూ వేడుక నిర్వహిస్తుండగా చెక్కతో నిర్మించిన వేదిక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది (Platform Collapses). ఈ ఘటనలో 20 మందికి పైగా గాయపడ్డారు. యూపీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బరౌత్‌లోని జైన్‌ కమ్మూనిటీ ఇవాళ ‘లడ్డూ మహోత్సవ్‌’ (Laddoo Mahotsav)ను నిర్వహించింది.

Advertisement

Woman Allegedly Hits Cab Driver: వీడియో ఇదిగో, విమానం మిస్సయిందని క్యాబ్ డ్రైవ‌ర్‌ను చిత‌క‌బాదిన మ‌హిళ‌, ముంబై పోలీసులు ఏమన్నారంటే..

Hazarath Reddy

ముంబ‌ై విమానాశ్ర‌యంలో ఇటీవ‌ల షాకింగ్ ఘ‌ట‌న చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఓ మ‌హిళ క్యాబ్ డ్రైవ‌ర్‌ను దుర్భాష‌లాడుతూ, చిత‌క‌బాదింది. ఎయిర్‌పోర్టుకు ఆల‌స్యంగా తీసుకురావ‌డంతో విమానం మిస్స‌యింద‌ని ఆరోపిస్తూ ఇలా క్యాబ్ డ్రైవ‌ర్‌పై దాడికి పాల్ప‌డింది. అయితే, ఇందులో డ్రైవ‌ర్ త‌ప్పు ఏమీ లేద‌ని ఆ మ‌హిళే ఆల‌స్యంగా ఇంటి నుంచి బ‌య‌లుదేరిన‌ట్లు స‌మాచారం

Telangana: వీడియో ఇదిగో, విచక్షణారహితంగా మహిళపై దాడి చేసిన స్థానిక రాజకీయ నేతలు, అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంటలో ఘటన

Hazarath Reddy

అశ్వారావుపేట శాసనసభ నియోజకవర్గ పరిధిలోని అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంటలో కొంతమంది రాజకీయ నాయకులు ఓ మహిళపై దాడి చేసిన వీడియో వైరల్ అవుతుంది. బాధిత మహిళ, ఓ నాయకుడికి మధ్య జరిగిన గొడవలో సదరు వ్యక్తితో పాటు పక్కనే ఉన్న మరి కొందరు వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేసినట్లు తెలుస్తోంది.

Road Accident: హైదరాబాద్ మణికొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. పదేండ్ల కూతురు మృతి, తండ్రికి గాయాలు (వీడియో)

Rudra

హైదరాబాద్ లో పెరిగిన ట్రాఫిక్ రద్దీ, ఇరుకైన రోడ్లు వెరసి రోజూ రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. ప్రమాదాల నివారణకు అటు ట్రాఫిక్ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం మాత్రం పెద్దగా కనిపించడం లేదు.

Case Against Kris Gopalakrishnan: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్ పై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు.. మరో 17 మందిపై కూడా.. ఎందుకంటే??

Rudra

దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు సేనాపతి క్రిస్ గోపాలకృష్ణన్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైనది. బెంగళూరు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు ఐఐఎస్ సీ డైరెక్టర్ బలరాం సహా మొత్తం పద్దెనిమిది మందిపై సదాశివనగర్ పోలీసులు కేసు పెట్టారు.

Advertisement

PM Modi To Visit White House In February: వచ్చే నెలలో వైట్‌ హౌజ్‌ కు ప్రధాని మోదీ.. అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడి

Rudra

ప్ర‌ధాని నరేంద్ర మోదీ అమెరికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లే అవ‌కాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్ర‌వ‌రిలో అంటే వచ్చే నెల మోదీ వైట్‌ హౌజ్‌ ను విజిట్ చేయ‌నున్న‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా తెలిపారు.

4-Day Work Week Culture: వారానికి 4 రోజుల ప‌నే.. మా కంపెనీల్లో ఇంతే.. ఎలాంటి శాల‌రీ కటింగ్ కూడా వుండదు!.. బ్రిటన్‌ లోని 200 కంపెనీల సంచ‌ల‌న నిర్ణ‌యం

Rudra

ప‌ని గంట‌ల విష‌య‌మై భార‌త్‌ తో పాటు ప్ర‌పంచ‌వ్యాప్తంగా పలు దేశాల్లో తీవ్ర చ‌ర్చ న‌డుస్తున్న సమయంలో బ్రిటన్ లోని దాదాపు 200 కంపెనీలు సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాయి.

Nagoba Jatara 2025: నేటి నుంచి నాగోబా మహా జాతర.. 600 మంది పోలీసులతో భారీ బందోబస్తు.. 31న మంత్రులు, జిల్లా అధికారుల సమక్షంలో దర్బార్‌

Rudra

ఆదివాసీల ఆరాధ్య దైవం, రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌ నాగోబా మహా జాతరకు అంతా సిద్ధమైంది. పుష్యమాస అమావాస్యను పురస్కరించుకొని మంగళవారం రాత్రి 11 గంటలకు మహాపూజల నిర్వహణతో జాతర ప్రారంభం కానుంది.

Bike Accident On Flyover: ముగ్గురు మైనర్ల ప్రాణాలను తీసిన అతివేగం.. హైదరాబాద్‌ లో ఆరాంఘర్‌ ఫ్లైఓవర్‌ పై రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి (వీడియో)

Rudra

మైనర్ల చేతికి వాహనాలు ఇవ్వకూడదని పోలీసులు ఎంత మొత్తుకున్నా తల్లిదండ్రులు ఏ మాత్రం పట్టించుకోవట్లేదు. పెద్దవారు చేసే ఇలాంటి తప్పిదాలతో పిల్లలు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

Advertisement

No Night Shows For Minors: ఉదయం 11 గంటలకు ముందు, రాత్రి 11 గంటల తర్వాత సినిమా థియేటర్లకు మైనర్లను అనుమతించొద్దు.. తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Rudra

ఉదయం 11 గంటలకు ముందు, రాత్రి 11 గంటల తర్వాత 16 ఏండ్లలోపు పిల్లలను అంటే మైనర్లను సినిమా థియేటర్లకు అనుమతించొద్దని హైకోర్టు అభిప్రాయపడింది. దీనిపై తగిన నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హోం శాఖకు సూచించింది.

Guillain-Barré Syndrome: నరాల మీద దాడి చేస్తున్న కొత్త వ్యాధి జీబీఎస్, ఒక్కో ఇంజెక్షన్ ధర వేల రూపాయల పైమాటే, గిలియన్ బారే సిండ్రోమ్ లక్షణాలు, చికిత్స గురించి తెలుసుకోండి

Hazarath Reddy

మహారాష్ట్రలో గిలియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) వ్యాధి కలకలం రేపుతోంది. ఈ వ్యాధి బారీనపడి బాధితుడు ఒకరు చనిపోయారు. మృతికి గల కారణంపై ఇంకా స్పష్టత రానప్పటికీ వైద్యులు మాత్రం జీబీఎస్ కారణంగానే మరణించి ఉంటారని అనుమానిస్తున్నారు.

Padma Awards Controversy in Telangana: తెలంగాణలో పద్మ అవార్డులపై కాంగ్రెస్‌, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం, బండి సంజయ్ వ్యాఖ్యలపై మండిపడిన కాంగ్రెస్ పార్టీ

Hazarath Reddy

తెలంగాణలో మరో​సారి రాజకీయం వేడెక్కింది. రాష్ట్రంలో పద్మ అవార్డుల ప్రకటనపై బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఒకరిపై మరోకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్‌, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వం పేర్లనే రాష్ట్రాలు కూడా పెట్టాలని కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) డిమాండ్ చేశారు.

Nellore Politics: ఎమ్మెల్యే కోటంరెడ్డికి బిగ్‌ షాకిచ్చిన కార్యకర్తలు, టీడీపీ పార్టీని వదిలి వైసీపీలో చేరిన 200 మంది ఎమ్మెల్యే మద్దతుదారులు

Hazarath Reddy

నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి నియోజకవర్గంలో టీడీపీకి చెందిన సుమారు 200 మంది కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ క్రమంలో వారికి వైఎస్సార్‌సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఆనం విజయకుమార్‌ రెడ్డి.31వ డివిజన్‌కి చెందిన టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డితో పాటు మరో 200 మంది టీడీపీ కీలక కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు.

Advertisement
Advertisement