India
Arrest Warrant On Robin Uthappa: రాబిన్ ఉతప్పకు షాక్, ఈపీఎఫ్ చెల్లింపు కేసులో అరెస్ట్ వారెంట్ జారీ, రూ.24 లక్షల డబ్బు జమ చేయాల్సిందేనని వెల్లడి
Arun Charagondaటీమిండియా మాజీ ఆటగాడు రాబిన్ ఉతప్పకు షాక్ తగిలింది. ఉద్యోగులను మోసం చేసిన ఈపీఎఫ్ కేసులో అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. రాబిన్ ఉతప్ప సెంచరీస్ లైఫ్ స్టైల్ బ్రాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రైవేట్ కంపెనీని నడుపుతున్నాడు. ద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ విరాళాలకు సంబంధించి మోసం చేశారనే ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ వారెంట్ జారీ చేశారు అధికారులు.
Health Tips: చలికాలంలో పచ్చి బఠానీలు తీసుకోవడం ద్వారా కలిగే లాభాలు..
sajayaపచ్చి బఠానీలు ఒక మంచి పోషకాహారమని చెప్పవచ్చు. దీన్ని సూపర్ ఫుడ్ అని కూడా అంటారు. చలికాలం వచ్చిందంటే చాలు ఇది ఈజీగా దొరుకుతుంది. అనేక రకాల వంటల్లో వీటిని ఉపయోగిస్తూ ఉంటారు.
Russia: ఉక్రెయిన్ పై రష్యా డ్రోన్లతో భీకర దాడి, భవనంలోకి దూసుకెళ్లి పేలిన డ్రోన్...షాకింగ్ వీడియో ఇదిగో
Arun Charagondaరష్యాలోని కజాన్‌లో భవనంలోకి డ్రోన్ కలకలం రేపింది. ఓ భవనంలో పై భాగాన్ని ఢీ కొట్టి పేలగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భవనంలో ఉన్న వారు పరుగులు తీయగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
YS Jagan Birthday Celebrations: జగన్ బర్త్ డే వేడుకల్లో అల్లు అర్జున్ ఫోటో, ఎన్టీఆర్ జిల్లాలో జగన్‌తో పాటు బన్నీ ఫోటోను ఏర్పాటు చేసిన వైసీపీ నేతలు...వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaమాజీ సీఎం జగన్ బర్త్ డే వేడుకలు ఏపీ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. జగన్ పుట్టినరోజు ఫ్లెక్సీ లో అల్లు అర్జున్ ఫోటో పెట్టి బర్త్ డే వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారు అభిమానులు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ లో జగన్ ఫోటోతో పాటు అల్లు అర్జున్ ఫోటో ను ఫ్లెక్సీలో ఏర్పాటు చేశారు. అంతేగాదు ఈ ఫ్లెక్సీపై రాజు బలవంతుడైనప్పుడే శత్రువులు అందరు ఏకం అవుతారంటూ కొటేషన్ వేయగా ఇది వైరల్‌గా మారింది.
KTR On Rythu Bharosa: రుణమాఫీపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే క్లారిటీ లేదు, 100 శాతం రుణమాఫీ అయిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా...ప్రభుత్వానికి సవాల్ విసిరిన కేటీఆర్
Arun Charagondaతెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసాపై చర్చ సందర్భంగా అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సీఎం 100శాతం రుణమాఫీ అంటాడు.. ఎమ్మెల్యేలు 70శాతం రుణమాఫీ అంటున్నారు...మీ ఎమ్మెల్యేలకు కనీసం ట్రైనింగ్ అయినా ఇవ్వండని చురకలు అంటించారు కేటీఆర్. ఏ ఒక్క ఊర్లో అయినా 100 శాతం రుణమాఫీ జరిగినట్లు నిరూపిస్తే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ సవాల్ విసిరారు. సీఎం రేవంత్ ...కొండారెడ్డిపల్లి పోదామా కొడంగల్ పోదామా సిరిసిల్ల పోదామా చెప్పాలన్నారు.
TTD Darshan Tickets: టీటీడీ దర్శన టికెట్ల తేదీల్లో మార్పులు చేసిన టీటీడీ, మార్చి నెల టికెట్ల తేదీల మార్పు, అదే రోజు గదుల కోటా రిలీజ్
Arun Charagondaమార్చి నెల దర్శన టిక్కెట్ల విడుదల తేదీల్లో మార్పులు చేసింది టీటీడీ. ఈ నెల 25న ఉదయం 11 గంటలకు మార్చి నెల శ్రీవాణి దర్శన టిక్కెట్లు విడుదల.. 26వ తేదీ ఉదయం 11 గంటలకు రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి, తిరుమలలోని వసతి గదులు కోటా విడుదల చేయనుంది.
Telangana: దేవరకొండలో ఘోర రోడ్డు ప్రమాదం, బైక్ ని ఢీ కొట్టిన డీసీఎం.. ముగ్గురు అక్కడికక్కడే మృతి, చనిపోయిన వారిలో ఒక మహిళ...వీడియో
Arun Charagondaనల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో మల్లేపల్లి రోడ్డులో గల దర్గా దగ్గర బైక్ ని ఢీ కోట్టింది డీసీఎం.. బైక్ పై ఉన్న ముగ్గురు అక్కడికి అక్కడే మరణించారు. మృతులు దేవరకొండ మండలం తాటికొల్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.. దర్గా నుండి దేవరకొండ పట్టణం వైపు వస్తున్నా బైక్ ని వెనుకనుండి వచ్చి డీసీఎం గుద్దడంతో బైక్ పై ఉన్న ముగ్గురు అక్కడికి అక్కడే మృతి చెందారు.మృతులలో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉన్నారు.
PM Modi In Kuwait: 43 ఏళ్ల తర్వాత కువైట్‌లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన, రెండు రోజుల పాటు పర్యటించున్న ప్రధాని, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా టూర్
Arun Charagondaరెండు రోజుల పర్యటనలో భాగంగా కువైట్ చేరుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రెండు రోజుల పర్యటనలో భాగంగా భారతదేశం- కువైట్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమే లక్ష్యంగా ప్రధాని పర్యటన సాగనుంది. 43 ఏళ్ల తర్వాత భారత్ నుంచి కువైట్ పర్యటనకు ప్రధాని వెళ్లారు. కువైట్ ఎమిర్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్ ఆహ్వానం మేరకు కువైట్‌లో పర్యటించనున్నారు మోదీ.
Tremors in Prakasam: ప్రకాశం జిల్లా ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో స్వల్ప భూప్రకంపనలు.. భయంతో స్కూల్ నుంచి బయటకు పరుగులుతీసిన విద్యార్థులు
Rudraఏపీలోని ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు మండలంలో శనివారం ఉదయం స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, ముండ్లమూరు, వేంపాడు, మారెళ్ల, తూర్పుకంభంపాడులో భూమి కంపించినట్టు స్థానికులు తెలిపారు.
Car Attack: జర్మనీలో ఘోరం.. క్రిస్మస్ మార్కెట్‌లోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి.. 60 మందికి గాయాలు (వీడియో)
Rudraజర్మనీలో ఘోరం జరిగింది.మాగ్డేబర్గ్ లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ మార్కెట్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. రద్దీగా ఉన్న వారిమీదకు దూసుకెళ్లింది.
Madhya Pradesh: షాకింగ్...రోడ్డు పక్కన 52 కేజీల బంగారం..రూ.10 కోట్ల డబ్బు, ఐటీ దాడుల నేపథ్యంలో కారును వదిలేసి పారిపోయారని ఉంటారని పోలీసుల అనుమానం...వీడియో
Arun Charagondaరోడ్డు పక్కన 52 కిలోల బంగారం, రూ.10 కోట్ల డబ్బు...షాకింగ్ న్యూస్ మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్‌లో ఓ కారులో లభ్యమైన 52 కిలోల బంగారం, రూ.10 కోట్ల డబ్బు లభ్యమైంది.
Hyderabad Traffic Restrictions: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు, ఎల్బీ స్టేడియం పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు..వేడుకల్లో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి
Arun Charagondaఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడకలను నిర్వహించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియం పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు.
Nara lokesh: మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, కువైట్‌లో ఇబ్బందులు పడుతున్న మహిళను స్వస్థలం నెల్లూరుకు చెర్చిన లోకేష్
Arun Charagondaఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు మంత్రి నారా లోకేష్ .నెల్లూరుకు చెందిన షేక్ మున్నీ జీవనోపాధి కోసం కువైట్ వెళ్లి అక్కడ అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. తనను ఎలాగైనా ఇండియాకు రప్పించండి అన్న అంటూ మంత్రి లోకేష్ ను "ఎక్స్" లో కోరగా మంత్రి లోకేష్ స్పందించారు.
Actor Mohan Babu: తన ఫోటోలు, వాయిస్ ను గూగుల్ లో, సోషల్ మీడియాలో వాడొద్దని కోర్టుకు మోహన్ బాబు.. తొలగించాలని తీర్పునిచ్చిన న్యాయస్థానం
Rudraఇప్పటికే వరుస వివాదాలతో వార్తల్లో నిలిచిన నటుడు మోహన్ బాబు ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ వేశారు. తన ఫోటోలు, వాయిస్ ను గూగుల్ లో, సోషల్ మీడియాలో వాడొద్దంటూ ఆదేశాలు ఇవ్వాలని అందులో అభ్యర్థించారు.
Sachin On Sushila Meena Bowling: రాజస్థాన్ యువతి బౌలింగ్‌కు సచిన్ ఫిదా, లేడి జహీర్ అంటూ కితాబు... సచిన్ ట్వీట్ కు స్పందించిన జహీర్ ఖాన్
Arun Charagondaరాజస్థాన్ కు చెందిన చిన్నారి సుశీల మీనా బౌలింగ్‌కు ఫిదా అయ్యారు లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్. సుశీల బౌలింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి సచిన్‌కు చేరగా ఈ వీడియోని ట్వీట్ చేస్తూ ప్రశంసలు గుప్పించారు. జహీర్ ఖాన్ తరహాలోని స్పీడ్, అలాగే బౌలింగ్ యాక్షన్ అచ్చు గుద్దినట్టు ఉందని మెచ్చుకున్నారు సచిన్.
Bajaj Chetak: చేతక్ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ చార్జింగ్ తో 153 కి.మీ... గరిష్ఠ ధర రూ.1.27 లక్షలు
Rudraప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ బజాజ్ ఆటో.. చేతక్ బ్రాండ్ తో మరో ఎలక్ట్రిక్ స్కూటర్ సిరీస్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 35 సిరీస్ లో భాగంగా సంస్థ విడుదల చేసిన మూడు స్కూటర్లు 3501, 3502, 3503 వెరైటీలుగా లభించనున్నాయి.
Spin Legend R Ashwin: అశ్విన్ కు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇవ్వండి.. కేంద్రానికి కాంగ్రెస్ ఎంపీ విజయ్ వసంత్ అభ్యర్ధన
Rudraఅంతర్జాతీయ క్రికెట్ కు ఇటీవల వీడ్కోలు పలికిన భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ విజయ్ వసంత్ కేంద్ర యువజన క్రీడల మంత్రి మన్ సుక్ మాండవీయకు రిక్వెస్ట్ చేశారు.
Road Accidents in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో నెత్తురోడిన రహదారులు.. రెండు ప్రమాదాల్లో మొత్తం ఏడుగురు దుర్మరణం.. నల్గొండ జిల్లా దేవరకొండలో ముగ్గురు.. సత్యసాయి జిల్లాలో నలుగురు మృతి
Rudraరోడ్డు ప్రమాదాలతో తెలుగు రాష్ట్రాలలోని రహదారులు శనివారం తెల్లవారుజామున నెత్తురోడాయి. రెండు రోడ్డు ప్రమాదాల్లో మొత్తంగా ఏడుగురు మరణించగా పలువురు గాయపడ్డారు.
Fire Accident In Software Company: హైదరాబాద్ లోని సాఫ్ట్ వేర్ కంపెనీలో మంటలు.. భయంతో పరుగులు పెట్టిన ఉద్యోగులు (వీడియో)
Rudraహైదరాబాద్ మాదాపూర్ లో ఉన్న ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇనార్బిట్‌మాల్ ఎదురుగా ఉన్న సత్యభవనంలో ఈ ఘటన జరిగింది.
Pushpa-2 New Record: వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన పుష్ప, షారూక్ సినిమా కూడా సాధించలేదని రికార్డు సాధించిన అల్లు అర్జున్
VNSపుష్ప 2 ది రూల్ విడుదలైన మొదటిరోజు నుంచే హిందీలో రికార్డులను నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షారుఖ్ ఖాన్ జవాన్ రికార్డును బద్దలుకొట్టి అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచిన ఈ చిత్రం. తాజాగా మరో అరుదైన రికార్డును అందుకుంది