India

Seaplane: వీడియో ఇదిగో, ప్రకాశం బ్యారేజ్ నుంచి శ్రీశైలానికి సీప్లేన్ ట్రయిల్ రన్ సక్సెస్, రేపు లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

Hazarath Reddy

విజయవాడ-శ్రీశైలం ‘సీ ప్లేన్’ ట్రయల్ రన్ విజయవంతమైంది. మొదట విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి ‘సీ ప్లేన్‌’ శ్రీశైలానికి వచ్చింది. అక్కడి జలాశయం నీటిలో సురక్షితంగా ల్యాండ్‌ అయింది.

Venu Swamy: జ్యోతిష్యుడు వేణుస్వామికి మహిళా కమిషన్ మళ్లీ నోటీసులు,ఈ నెల 14న విచారణకు రావాలని కోర్టు ఆదేశాలతో నోటీసులు

Arun Charagonda

ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామికి మహిళా కమిషన్‌ రెండోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 14న విచారణకు రావాలంటూ కోర్టు ఆదేశాలతో నోటీసులు జారీ చేసింది. మొదటి నోటీసుకు హాజరుకాకుండా కోర్టును ఆశ్రయించారు వేణుస్వామి. స్టే ఎత్తివేస్తూ వేణుస్వామిపై వారంలోపు చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

Yadadri Now as Yadagirigutta: యాదాద్రి పేరును తిరిగి యాదగిరిగుట్టగా మారుస్తూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, టీటీడీ బోర్డు మాదిరిగా యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటుకు ప్రతిపాదన

Hazarath Reddy

యాదాద్రిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యాదాద్రి పేరును తిరిగి యాదగిరిగుట్టగా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కూడా అధికారులకు తెలిపారు

Hyderabad: ఓలా ఈవీ షోరూం దగ్గర కస్టమర్ల ఆందోళన, నెలల తరబడి తిప్పించుకుంటున్నారని షోరూమ్‌కు చెప్పుల దండ వేసిన కస్టమర్..వీడియో

Arun Charagonda

ఓలా ఈవీ షోరూం దగ్గర ఓ కస్టమర్‌ వినూత్న నిరసన చేపట్టారు. హైదరాబాద్ అశోక్‌నగర్‌లో నెలల తరబడి తిప్పించుకుంటున్నారంటూ షోరూమ్‌కు చెప్పుల దండ వేశారు కస్టమర్‌. ఒక్కసారిగా బ్యాటరీ రేంజ్‌ పడిపోవడంతో నెలక్రితం షోరూమ్‌లో వాహనాన్ని ఇచ్చారు కస్టమర్‌. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Jammu and Kashmir: జ‌మ్మూక‌శ్మీర్ అసెంబ్లీలో ఆర్టిక‌ల్ 370 రచ్చ, ఎమ్మెల్యేని ఈడ్చుకుంటూ బయటపడేసిన మార్ష‌ల్స్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

జ‌మ్మూక‌శ్మీర్ అసెంబ్లీలో వ‌రుస‌గా రెండో రోజు బీజేపీ, ఎన్సీ ఎమ్మెల్యేల‌ మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది. ఆర్టిక‌ల్ 370(Article 370)ని పున‌రుద్ద‌రించాల‌ని ఇంజినీర్ ర‌షీద్ సోద‌రుడు, అవామీ ఇతెహ‌ద్ పార్టీ ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మ‌ద్ షేక్ గురువారం బ్యానర్‌ను ప్ర‌ద‌ర్శించిన విష‌యం తెలిసిందే.

Maharashtra Elections 2024: ఆరు నూరైనా ఆర్టికల్ 370ని పునరుద్ధరించే ప్రశ్నే లేదు, మహా ఎన్నికల్లో కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ

Hazarath Reddy

రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని కోరుతూ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో గందరగోళం నెలకొనడంపై ప్రధాని మోదీ స్పందించారు. మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్ర‌ధాని మోదీ అక్క‌డ ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు.

Bengaluru Shocker: దారుణం, పసికందును వాటర్ ట్యాంకులో పడేసి కనిపించడం లేదని కథనం అల్లిన తల్లి, అసలు ట్విస్ట్ ఏంటంటే..

Hazarath Reddy

బెంగళూరు సమీపంలోని ఇగ్గలూరు గ్రామంలో ఓ తల్లి తన నెల రోజుల కూతురును ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్‌లో పడేసిన తరువాత కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Hydra: మళ్లీ రంగంలోకి దిగిన హైడ్రా, ఈ సారి ఏకంగా 50 మందికి నోటీసులు...15 రోజుల్లో సమాధానం చెప్పాలని నోటీసుల్లో వెల్లడి

Arun Charagonda

హైడ్రా మళ్లీ రంగంలోకి దిగింది. అక్రమ కట్టడాలు నిర్మించిన 50 మందికి పోలీసులు నోటీస్ జారీ చేశారు. ఈసారి పార్కులు ,నాళాలు, ఫుట్‌పాత్‌లు అక్రమ నిర్మాణాలు తొలగించనున్నారు. వారం నుండి 15 రోజుల్లో గా అక్రమాలు కూల్చేయాలని హెచ్చరిక జారీ చేశారు. సర్వే ఆఫ్ ఇండియా ద్వారా సర్వే చేయించింది హైడ్రా.

Advertisement

Hyderabad: పంజాగుట్టలో కారు బీభత్సం, తనిఖీలు చేస్తున్న పోలీసులపైకి దూసుకెళ్లిన కారు, డ్రైవర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు

Arun Charagonda

హైదరాబాద్ పంజాగుట్టలో కారు డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. తనిఖీలు చేస్తున్న పోలీసుల పైకి దూసుకెళ్లింది కారు. ఆపకుండా కారును హోంగార్డును ఈడ్చుకెళ్లాడు డ్రైవర్ సయ్యద్. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి రాగా పోలీసులు కేసు నమోదుచేశారు.

Rain Alert for AP: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, ఏపీ ప్రజలకు నాలుగు రోజుల పాటు రెయిన్ అలర్ట్, తమిళనాడుకు ముంచెత్తనున్న భారీ వర్షాలు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని వానలు వీడడం లేదు. ఇటీవల కురిసిన వర్షాలకు రాష్ట్రం తడిసి ముద్దైన సంగతి విదితమే. మళ్లీ రాష్ట్రానికి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఏపీలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Bandi Sanjay: కేటీఆర్‌పై బండి సంజయ్ ఫైర్, కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ యాక్టివ్ సీఎం, కాంగ్రెస్‌ - బీఆర్ఎస్ కలిసి బీజేపీపై కుట్ర చేస్తున్నాయని ఆగ్రహం

Arun Charagonda

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మండిపడ్డారు కేంద్రమంత్రి బండి సంజయ్. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కేటీఆర్‌ యాక్టివ్ సీఎం అని ఆరోపించారు. కేటీఆర్ రోజుకో అంశాన్ని ప్రస్తావించి మళ్లీ దాని ఊసెత్తరు‌, రేవంత్‌ రెడ్డివి కాంప్రమైజ్‌ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. రెండు పార్టీలు కలిసి బీజేపీపై కుట్ర చేస్తున్నాయి.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతల మాటలు ప్రజలు నమ్మరన్నారు.

Harishrao: హైదరాబాద్‌లో ఇండ్లు కూల్చి..నల్గొండలో పాదయాత్ర?, సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్రపై హరీశ్‌ రావు ఫైర్..దమ్ముంటే హైదరాబాద్ నుండి పాదయాత్ర మొదలుపెట్టాలని సవాల్

Arun Charagonda

సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అక్రమ అరెస్టులు, నిర్బందాల పట్ల మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన హరీశ్‌..కనీసం మీరు పుట్టిన ఈ ఒక్క రోజైనా నిర్బంధాలు, అక్రమ అరెస్టులు లేకుండా పాలన కొనసాగించాలని కోరుకుంటూ..జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పారు.

Advertisement

kethireddy venkatrami Reddy: చెరువు కబ్జా నోటీసుల వెనుక రాజకీయ కోణం ఉందన్న కేతిరెడ్డి, ఈ అంశంపై కోర్టులోనే తేల్చుకుంటానని స్పష్టం

Arun Charagonda

ధర్మవరం చెరువు కబ్జా, అధికారుల నోటీసులపై స్పందించారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. ఈ నోటీసుల వెనుక రాజకీయ కోణం ఉందని ఆరోపించారు. గతంలోనే ఈ అంశంపై కోర్టుకు వెళ్లానని..ఈ అంశం కోర్టులో ఉండగానే నోటీసులు ఇవ్వడం సరికాదన్నారు. ఈ విషయంలో కంటెంట్ ఆఫ్ కోర్టు కింద కేసు వేస్తానని..తన భూముల విషయంలో చాలా క్లియర్‌గా ఉన్నానని వెల్లడించారు.

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి బర్త్ డే గిఫ్ట్, పంట చేనులో సీఎం రేవంత్‌ ముఖచిత్రం..వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అందరూ శుభాకాంక్షలు చెప్తున్నారు. అయితే.. ఓ రైతు మాత్రం వినూత్నంగా రేవంత్‌పై అభిమానాన్ని చాటుకున్నారు. తన పంటచేనులో రేవంత్ ముఖచిత్రం వచ్చేలా.. సాగు చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరలవుతోంది. కాగా.. రైతులకు రుణమాఫీ చేసి వారికి ఆర్థికభారాన్ని రేవంత్ సర్కార్ తొలగించిన సంగతి తెలిసిందే.

Mancherial: మంచిర్యాలలో దారుణం, వీధి కుక్కలను బంధించి తిండిపెట్టని వైనం, చనిపోయిన 10 కుక్కలు..మండిపడుతున్న స్థానికులు

Arun Charagonda

తెలంగాణలోని మంచిర్యాలలో దారునం చోటు చేసుకుంది. వీధి కుక్కలను బంధించి పది రోజులుగా తిండి పెట్టకుండా మర్చిపోయారు సిబ్బంది. మంచిర్యాల పశు సంరక్షణ కేంద్రంలో పది రోజులుగా తిండి లేకపోవడంతో 8 వీధి కుక్కలు మృతి చెందాయి. కొనఊపిరితో మరో 12 శునకాలు కొట్టుమిట్టాడుతున్నాయి.

BRS Leaders Arrest: సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర, బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్ట్‌లు, ప్రజాస్వామ్యం అంటే ఇదేనా అని బీఆర్ఎస్ నేతల ఫైర్

Arun Charagonda

సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్ట్ చేశారు పోలీసులు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను అరెస్టు చేశారు పోలీసులు. గతంలో సీఎం ప్రోగ్రాం ను అడ్డుకుంటామని హెచ్చరించారు చిరుమర్తి లింగయ్య. తనను అరెస్ట్ చేయడంపై తీవ్రంగా మండిపడ్డారు లింగయ్య. ప్రజాస్వామ్యం అంటే ఇదేనా అని ప్రశ్నించారు.

Advertisement

KTR Birthday Wishes to CM Revanth Reddy: సీఎం రేవంత్‌ రెడ్డికి కేటీఆర్‌ బర్త్‌ డే విషెస్‌.. విచారణకు వచ్చిన సిబ్బందికి చాయ్‌, ఉస్మానియా బిస్కెట్లు ఇస్తానని కామెంట్

Rudra

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

CM Chandrababu Srishailam Tour: రేపు శ్రీశైలం మహా క్షేత్రానికి చంద్రబాబు.. సీప్లేన్ ద్వారా చేరుకోనున్న ఏపీ సీఎం

Rudra

శ్రీశైలం మహా క్షేత్రంలో శనివారం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. సీప్లేన్ ద్వారా క్షేత్రానికి చేరుకోనున్న బాబు స్వామివారిని దర్శించుకోనున్నారు.

Ponguleti Srinivas Reddy: మరోసారి మంత్రి పొంగులేటి సంచలన కామెంట్స్, తప్పు చేసిన వారికి ఆటంబాంబు పేలబోతోందని కామెంట్,ప్రజాక్షేత్రంలోకి శిక్ష తప్పదని హెచ్చరిక

Arun Charagonda

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి సంచలన కామెంట్ చేశారు. వరంగల్ జిల్లా రాయపర్తి ,వర్ధన్నపేట మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు పొంగులేటి. అనంతరం మాట్లాడిన ఆయన నాటు బాంబు కాదు లక్ష్మి బాబు కాదు తప్పు చేసిన వారికి అటుంబంలాగా పనిచేస్తుందని తెలిపారు. చట్టం తన పనిని తాను చేసుకుంటూ పోతుందని తప్పు చేసిన వారికి ప్రజాక్షేత్రంలో శిక్ష పడుతుందని తెలిపారు.

Man Grows Ganja Plants in Pots: మేడపైన కుండీల్లో గంజాయి మొక్కలు పెంచుతున్న వ్యక్తి అరెస్ట్.. వరంగల్ లో ఘటన (వీడియోతో)

Rudra

వరంగల్ జిల్లాలో వింత సంఘటన చోటుచేసుకుంది. నగరంలోని శివనగర్ కి చెందిన పల్లెబోయిన కుమార్ (60) అనే వ్యక్తి సులభంగా డబ్బు సంపాదించడానికి, తన అవసరాల కోసం అడ్డదారులు తొక్కాడు.

Advertisement
Advertisement