India

Delhi Air Pollution: ఢిల్లీలో కొనసాగుతున్న గాలి కాలుష్యం.. వాయు, నీటి కాలుష్యంతో సతమతమవుతున్న ప్రజలు, ఇంట్లోనే ఉండి యోగా, ప్రాణాయామం చేయాలని సూచన

Arun Charagonda

దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకు వాయు కాలుష్యం తీవ్రమవుతోంది. ఓ వైపు వాయు కాలుష్యం మరో వైపు నీటి కాలుష్యం వెరసీ ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికే ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. ఇవాళ ఉదయం గాలి నాణ్యత సూచి 358గా నమోదైంది. పెరుగుతున్న కాలుష్యంతో ప్రజల కళ్లల్లో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులుపడుతున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ...ఇంట్లోనే ఉండి యోగా, ప్రాణాయామం చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

Elon Musk on 2024 US Elections Results: గేమ్ సెట్‌ అండ్‌ మ్యాచ్‌, అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఎలాన్ మస్క్ సంచలన పోస్ట్, ట్రంప్ జోరు చూస్తుంటే ప్రభుత్వ సలహాదారు పదవి లాంఛనమే..

Hazarath Reddy

2024 ఎన్నికలలో అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ అభ్యర్థి అయిన డొనాల్డ్ ట్రంప్ మళ్లీ పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా స్వింగ్ రాష్ట్రాల్లో అమెరికా వైస్ ప్రెసిడెంట్ మరియు డెమొక్రాట్ అభ్యర్థి కమలా హారిస్ నుంచి ఆయనకు గట్టి పోటీ ఎదురవుతోంది.

2024 US Elections Results: దూసుకుపోతున్న ట్రంప్, మరో 31 ఎలక్టోరల్ ఓట్లు గెలిస్తే అమెరికా అధ్యక్ష పీఠం సొంతం, రెండు యుద్దభూముల్లో జెండా పాతిన రిపబ్లికన్ పార్టీ

Hazarath Reddy

2024 ఎన్నికలలో అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ అభ్యర్థి అయిన డొనాల్డ్ ట్రంప్ మళ్లీ పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా స్వింగ్ రాష్ట్రాల్లో అమెరికా వైస్ ప్రెసిడెంట్ మరియు డెమొక్రాట్ అభ్యర్థి కమలా హారిస్ నుంచి ఆయనకు గట్టి పోటీ ఎదురవుతోంది

Telangana Caste Census: తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభం, హైదరాబాద్‌లో ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్..ఎన్యుమరేటర్లకు సర్వే కిట్లు అందజేత

Arun Charagonda

తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభం అయింది. ఆయా జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వేను ప్రారంభించారు మంత్రులు, ప్రజాప్రతినిధులు. హైదరాబాద్ లో సమగ్ర కుటుంబ సర్వేను ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. హాజరైన హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎన్యుమరేటర్లకు సర్వే కిట్లు అందజేశారు మంత్రి పొన్నం.

Advertisement

KTR: గుట్టలను మట్టి చేసి భూదాహం తీర్చుకోవడం కాదు..ధాన్యం రాశుల వైపు చూడాలని సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్, కాసుల కక్కుర్తి కాదు..రైతు బతుకు వైపు చూడాలని సవాల్

Arun Charagonda

గుట్టలను మట్టిచేసి భూదాహం తీర్చుకోవడం కాదు రేవంత్ - గుట్టల్లా పేరుకుపోయిన ధాన్యం రాశుల వైపు చూడాలని సవాల్ విసిరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిన కేటీఆర్...గాలిమోటర్లో మూటలు మోసుడు కాదు - కొనేవారు లేక పేరుకుపోయిన ధాన్యం మూటల వైపు చూడు అన్నారు.

Nalgonda: కోదాడలో దారుణం, మహిళ గొంతు కోసిన ఆర్‌ఎంపీ డాక్టర్, అక్రమ సంబంధమే దాడికి కారణమని అనుమానం..బాధితురాలిని ఏరియా ఆస్పత్రికి తరలింపు

Arun Charagonda

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం నయనగర్ లో రేణుక అనే మహిళ గొంతు కోశారు ఆర్‌ఎంపీ. మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆర్ఎంపీ ఇద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు మొదలయ్యాయి. మెరుగైన చికిత్స నిమిత్తం బాధితురాలిని సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

TTD: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో సాయి దుర్గ తేజ్, అల్లు అర్జున్ భార్య స్నేహరెడ్డి, సుప్రభాత సేవలో శ్రీవారి దర్శనం...వీడియో

Arun Charagonda

తిరుమల శ్రీవారిని సుప్రభాత సేవలో దర్శించుకున్నారు హీరో సాయిదుర్గ తేజ్, అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి. వేర్వేరుగా శ్రీవారిని సుప్రభాత సేవలో దర్శించుకున్నారు. దర్శనానంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు.

TTD Chairman BR Naidu: టీటీడీ ఛైర్మ‌న్‌గా ప్ర‌మాణస్వీకారం చేసిన బొల్లినేని రాజ‌గోపాల్ నాయుడు, అనంతరం వరాహ స్వామిని దర్శించుకున్న బీఆర్ఎస్ నాయుడు..

Arun Charagonda

టీటీడీ ఛైర్మ‌న్‌గా ప్ర‌మాణస్వీకారం చేశారు బొల్లినేని రాజ‌గోపాల్ నాయుడు. ఆయ‌న‌తో ఆలయంలో ప్రమాణం చేయించారు ఈవో శ్యామలరావు. ఆలయ సంప్రదాయాలను పాటించి వరాహ‌ స్వామివారిని దర్శించుకున్నారు. ఛైర్మన్‌తో పాటు సభ్యులు సైతం ప్రమాణస్వీకారం చేశారు.

Advertisement

US Election 2024 Live Updates: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో దూసుకుపోతున్న ట్రంప్, 17 రాష్ట్రాల్లో గెలుపొందిన డోనాల్డ్ ట్రంప్, 177 సీట్లు ఎలక్టోరల్ సీట్లు కైవసం చేసుకున్న ట్రంప్

Arun Charagonda

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో డోనాల్డ్ ట్రంప్ దూసుకుపోతున్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ 177 ఎలక్టోరల్ సీట్లు కైవసం చేసుకున్నారు. 17 రాష్ట్రాల్లో ఆయన గెలుపొందారు. మరోవైపు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ 99 ఎలక్టోరల్ స్థానాలు కైవసం చేసుకోగా ఆమె 9 రాష్ట్రాల్లో గెలుపొందారు. అధికారం చేపట్టాలంటే.. 270 స్థానాలను గెలవాల్సి ఉంటుంది.

YS Vijayamma: జగన్‌పై తప్పుడు ప్రచారం సరికాదు, నకిలీ లేఖలు రాయాల్సిన అవసరం లేదు, ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తు పరువు నష్టం దావా వేస్తానని వైఎస్ విజయమ్మ హెచ్చరిక

Arun Charagonda

తనపై తన కొడుకు హత్యా ప్రయత్నం చేశాడని సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంపై వైఎస్ విజయమ్మ ఆందోళన వ్యక్తం చేశారు. పాత వీడియో బయటకు తీసి ఈ రకంగా తప్పుడు ప్రచారం చేయడం సరైన విధానం కాదు అని మండిపడ్డారు.

Telangana: రంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం, హైజీన్ కేర్‌ పరిశ్రమలో చెల‌రేగిన మంట‌లు..నేలమట్టం అయిన నూతనంగా నిర్మించిన షెడ్డూ

Arun Charagonda

రంగారెడ్డి జిల్లా నందిగామలోని కంసన్ హైజీన్ కేర్‌ పరిశ్రమలో అర్థరాత్రి మంట‌లు చెలరేగాయి. మంట‌లు చెల‌రేగ‌డంతో క్ష‌ణాల్లో నేల‌మ‌ట్టం అయింది నూతనంగా నిర్మించిన షెడ్డు. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో ఎవ‌రూ లేక‌పోవ‌డంతో ప్రాణ‌న‌ష్టం తప్పింది. ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమ‌ని అంచ‌నా వేస్తుండగా ఐదు ఫైర్ ఇంజ‌న్‌లతో మంట‌ల‌ను అదుపు చేసేందుకు శ్ర‌మిస్తోంది ఫైర్ సిబ్బంది.

Rahul Gandhi: దేశంలో ఇంకా కుల వివక్ష ఉంది, నిజం మాట్లాడితే దేశాన్ని విభజిస్తున్నారని ఆరోపణ చేస్తున్నారు...ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ ఫైర్

Arun Charagonda

ఈ దేశంలో కులాలు ఉన్నాయి. అదేవిధంగా కుల వివక్షలు ఉన్నాయని కూడా అందరికీ తెలుసు అన్నారు కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. తాను ఈ నిజాలు మాట్లాడితే దేశాన్ని విభజిస్తున్నానని పీఎం నరేంద్ర మోడీ, బీజేపీ నాయకులు ఆరోపణ చేస్తున్నారు అని మండిపడ్డారు.

Advertisement

'Road Like Hema Malini's Cheeks': వీడియో ఇదిగో, ఢిల్లీ ఉత్తమ్‌ నగర్‌ రోడ్లను హేమ మాలినీ బుగ్గల్లా నున్నగా చేస్తానంటూ ఆప్ ఎమ్మెల్యే నరేష్‌ బల్యాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు, చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్

Hazarath Reddy

ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే (AAP MLA) నరేష్‌ బల్యాన్‌ తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్‌ నగర్‌ (Uttam Nagar)రోడ్లను హేమ మాలినీ బుగ్గల్లా నున్నగా (Road like Hema Malinis cheeks) చేస్తానంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి.

Naked British Tourist Falls From Hotel Balcony: మద్యం మత్తులో హోటల్ గదిపై నుంచి నగ్నంగా కిందపడిన బ్రిటీష్ టూరిస్ట్

Vikas M

బాల్కనీ నుండి పడిన తర్వాత పక్కనే ఉన్న ఇంటర్నెట్ కేఫ్ సీలింగ్‌కి ఆ వ్యక్తి కాళ్లు తగిలి ఇరుక్కుపోయాడు. ఆ గదిలో మూలుగులు మరియు చప్పుడు వినిపించినట్లు హోటల్ సిబ్బంది నివేదించారు. X (గతంలో ట్విట్టర్ అని పిలుస్తారు)లో పోస్ట్ చేసిన చిత్రాలు వైరల్ అయ్యాయి.

Gujarat Bridge Collapse: గుజరాత్‌లో కుప్పకూలిన బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పిల్లర్లు, పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లుగా వార్తలు, వీడియో ఇదిగో..

Vikas M

గుజరాత్ రాష్ట్రంలో ముంబయి-అహ్మదాబాద్‌ మధ్య చేపడుతోన్న బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. గుజరాత్‌లోని వల్సాద్‌ సమీపంలో నిర్మాణంలో ఉన్న నాలుగు పిల్లర్లు కూలిపోయాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ముగ్గురు కార్మికులు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనా స్థలికి చేరుకున్న రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.

BSNL Diwali Offer: 365 రోజుల వ్యాలిడిటీతో బీఎస్ఎన్ఎల్ సంచలన ఆఫర్, 600 జీబీ డేటా, అపరిమిత కాల్‌లు, ఇంకా ఎన్నో బెనిఫిట్స్

Vikas M

ప్రభుత్వరంగ టెలికం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ (BSNL) తాజాగా సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. దీపావళి పండుగ సీజన్‌లో అన్ని ప్రధాన టెలికం ఆపరేటర్లు ప్రకటించిన ఆఫర్లు ముగిసిపోయినప్పటికీ.. నవంబర్ 7 వరకు అందుబాటులో ఉండేలా దీపావళి ప్రత్యేక ఆఫర్‌ను బీఎస్ఎన్‌ఎల్ పరిచయం చేసింది.

Advertisement

Match Fixing Scandal in Mizoram: భార‌త‌ ఫుట్‌బాల్‌లో మ్యాచ్ ఫికింగ్స్ క‌ల‌క‌లం, 24 మంది ఆటగాళ్లపై వేటు వేసిన మిజోరాం ఫుట్‌బాల్ స‌మాఖ్య

Vikas M

భార‌త‌ ఫుట్‌బాల్‌ అయిన మిజోరం ప్రీమియ‌ర్ లీగ్‌(Mizoram Premier League)లో ప‌లువురు ఆట‌గాళ్లు ఫిక్సింగ్‌కు పాల్ప‌డ్డారు. దాంతో, స్థానిక పోలీసుల సాయంతో విచార‌ణ చేపట్టిన మిజోరం ఫుట్‌బాల్ స‌మాఖ్య (MFA) క‌ఠిన నిర్ణ‌యం తీసుకుంది.

‘Thandel’ Release Date: సముద్రపు అలల మధ్య నాగచైతన్య కౌగిలిలో బందీ అయిన సాయిపల్లవి, ఫిబ్రవరి 7న గ్రాండ్‌గా విడుదల కానున్న తండేల్ మూవీ

Vikas M

ప్రేమ తీరం నుండి భావోద్వేగాలతో నిండిన సముద్రానికి ప్రయాణించడానికి సిద్ధంగా ఉండండి.. అంటూ తీరపు అలల మధ్య సాయిపల్లవి, నాగచైతన్య ఎమోషనల్‌గా ఒకరికొకరు హగ్‌ చేసుకున్న స్టిల్‌ను షేర్ చేశారు. ఇప్పుడీ రిలీజ్‌ అప్‌డేట్‌ పోస్టర్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.

Alibaba Layoffs: ఆలీబాబా గ్రూపు లేఆప్స్, వందలాది మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపిన ప్రముఖ చైనా దిగ్గజం

Vikas M

అలీబాబాగా వ్యాపారం చేస్తున్న అలీబాబా గ్రూప్ తన మెటావర్స్ విభాగంలోని పలువురు ఉద్యోగులను తొలగించింది. చైనీస్ ఇ-కామర్స్ మరియు టెక్ దిగ్గజం వ్యాపార పునర్నిర్మాణంలో భాగంగా తన శ్రామిక శక్తిని తగ్గించుకుంది.

KPMG Layoffs: ఆగని లేఆప్స్, వందలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్న KPMG, దూసుకొస్తున్న ఆర్థికమాంద్య భయాలే కారణం

Vikas M

శ్రామిక శక్తి యొక్క పరిమాణం, నైపుణ్యాలను మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సమలేఖనం చేయడానికి సంస్థ తన కొనసాగుతున్న ప్రయత్నాలపై దృష్టి సారిస్తుంది కాబట్టి తొలగింపులు దేశంలోని దాదాపు 330 మంది ఉద్యోగులపై ప్రభావం చూపుతాయి

Advertisement
Advertisement