India

Andhra Pradesh: విజయవాడలో పట్టపగలే నడిరోడ్డుపై యువకుడి మీద కత్తితో దాడి, మెడపైన బలమైన గాయాలు కావడంతో అపస్మారక స్థితికి

Hazarath Reddy

విజయవాడ గొల్లపూడి మెయిన్ రోడ్డు వద్ద పట్టపగలే దారుణం.ఓ వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి.దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి. మెడపైన బలమైన గాయాలు కావడంతో అపస్మారక స్థితికి వెళ్లిన బాధితుడు .పోలీసులు రంగ ప్రవేశం,నిందితుల కోసం గాలింపు. బాధితుడు కంచికచర్ల పట్టణానికి చెందిన చరణ్ గా గుర్తింపు. ఎందుకు దాడిచేశారనే దానిపై అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.

TTD New Guidelines: కాలినడకన తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్, ఈ జాగ్రత్తలు పాటించకుండా మెట్ల మార్గాన్ని ఎంచుకోకూడదని సూచన, తాజా మార్గదర్శకాలు ఇవిగో..

Hazarath Reddy

కాలినడకన తిరుమల వెళ్తున్నారా? అయితే తిరుమల తిరుపతి దేవస్థానం తాజాగా కొన్ని సూచనలు చేసింది. ఇటీవల తిరుమలకు కాలి నడకన (tirumala walking path) వచ్చిన భక్తుల్లో కొందరు అనారోగ్యానికి గురైన సంఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ రకమైన సూచనల వచ్చాయి

Andhra Pradesh: విశాఖ జీవీఎంసీ ప్రైమరీ స్కూల్‌లో నాగుపాము హల్‌చల్, పామును చూసి హడలిపోయిన చిన్నారులు...వీడియో ఇదిగో

Arun Charagonda

విశాఖ‌ గాజువాక‌లోని ముల‌గాడ జీవీఎంసీ ప్రైమ‌రీ స్కూల్‌లో నాగుపాము హ‌ల్‌చ‌ల్‌ చేసింది. పామును చూసి హ‌డ‌లిపోయారు చిన్నారులు. స్నేక్ సొసైటీ అధ్య‌క్షుడు కిర‌ణ్‌కుమార్‌కు స‌మాచారం ఇచ్చారు ఉపాధ్యాయులు. పామును జాగ్ర‌త్త‌గా ప‌ట్టుకుని స‌మీపంలోని అడ‌విలో వ‌దిలి పెట్టారు కిర‌ణ్‌కుమార్‌.

Tesla Crashes Into Divider: కెనడాలో టెస్లా కార్లు ఢీకొని ఒక్కసారిగా ఎగసిన మంటలు, మంటల్లో నలుగురు భారతీయులు సజీవ దహనం

Hazarath Reddy

కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.‘టెస్లా’ కారు క్రాష్ అయి నలుగురు భారతీయులు చనిపోయారు. టొరంటో సమీపంలో గురువారం అర్ధరాత్రి తర్వాత కారు డివైడర్‌ని ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు.

Advertisement

KTR: మంచి మనసు చాటుకున్న కేటీఆర్, రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని తన వాహనంలో ఆస్పత్రికి తరలించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్

Arun Charagonda

రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైన వారిని తన ఎస్కార్ట్ వాహనంలో హాస్పిటల్‌కు పంపి మంచి మనసు చాటుకున్నారు కేటీఆర్. సిరిసిల్ల నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా మార్గమధ్యలో జిల్లెల్ల వద్ద ఓ యాక్సిడెంట్‌లో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన కేటీఆర్‌ అంబులెన్స్ వచ్చే వరకు సమయం పడుతుందని, తన ఎస్కార్ట్ వాహనంలో సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Teachers and Students Exchange Blows: కాలేజీలో చితక్కొట్టుకున్న టీచర్లు, విద్యార్థులు, కారణం ఏంటంటే..

Hazarath Reddy

బీహార్ రాష్ట్రంలోని బెగుసరాయ్‌లో కాలేజీలో పరీక్షల నేపథ్యంలో టీచర్లు, విద్యార్థులు కొట్టుకున్నారు. ఈ దాడిలో కొందరు విద్యార్థులు, ఒక స్టూడెంట్‌ తల్లి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో విద్యార్థులు ఆగ్రహించారు. కాలేజీ ప్రిన్సిపాల్‌, టీచర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Andhra Pradesh: వీడియో ఇదిగో, తెల్లవారితే పెళ్లి , ప్రియుడితో పరారైన పెళ్లి కూతురు, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పెళ్లి కూతురు తండ్రి

Hazarath Reddy

అనంతపురం :తెల్లవారితే పెళ్లి ,రాత్రి సంప్రదాయాల ప్రకారం చిన్న తాంబూలం,పెద్ద తాంబూలం కూడా చేశారు. అయితే అమ్మాయికి ఇష్టం లేకపోవడంతో నాలుగు గంటలకు గోపాల్ ప్లాజా కళ్యాణ మండపం నుండి వెళ్లిపోయింది.

BRS MLA Sanjay Kumar: రాజకీయ వ్యభిచారిగా మారిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, రైతు పక్షపాతి జీవన్‌రెడ్డిపై కక్ష సాధింపు సరికాదన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే

Arun Charagonda

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై మండిపడ్డ కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రాజకీయ వ్యభిచారిగా మారారు అన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పించుకొని ఇప్పుడు తాను కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదు అనడం చూస్తుంటే నేను విడాకులు ఇవ్వలేదు కానీ మళ్ళీ పెళ్లి చేసుకున్నాను అన్నట్టుగా ఉందన్నారు.

Advertisement

West Bengal: వీడియో ఇదిగో, మహిళ పెదాల మీద ముద్దు పెట్టబోయిన ASI, ఎందుకో తెలుసా...

Hazarath Reddy

పశ్చిమ బెంగాల్ నుండి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఒక మహిళా పోలీసు తాను తాగలేదని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఒక మహిళను దాదాపు ముద్దు పెట్టుకున్నట్లు చూపిస్తుంది.

Sarada Peetham: శారదా పీఠానికి మరో ఎదురు దెబ్బ, గడ్డ భూమిలో శారద పీఠం నిర్మాణం ఉందన్న ఎమ్మార్వో, పై అధికారులను సంప్రదించాక కూల్చివేతలపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడి

Arun Charagonda

పెందుర్తి చిన ముషిడివాడలోని శారదా పీఠానికి మరో ఎదురు దెబ్బ తగిలింది. పీఠానికి అనుకొని ఉన్న సర్వే నంబర్ 90 లో సుమారు 20 సెంట్లు భూమి గడ్డ స్థలంలో ఉందని పెందుర్తి ఎంఆర్ఓ ఆనంద్ కుమార్ ప్రకటించారు. ఇదే విషయమై ఆయన తమ కార్యాలయంలో శుక్రవారం మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ.. తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ ఫిర్యాదు ప్రకారం రికార్డులను పరిశీలించిన అనంతరం శారదా పీఠానికి చెందిన కొంత భూమి గడ్డ స్థలంలో ఉందన్నారు. అయితే ఆ భూమిని స్వాధీనం చేసుకునే అధికారం తనకు లేదని.. తమ పై అధికారులు ఆదేశాల ప్రకారం నడుచుకుంటామన్నారు. విషయం సున్నితమైనది కావడంతో పై అధికారులు దృష్టికి తీసుకువెళతామని పేర్కొన్నారు.

Rachamallu on Sharmila: జగన్‌ తన చెల్లిపై ప్రేమతోనే ఆస్తిలో షర్మిలకు వాటా ఇచ్చారు, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

వైఎస్‌ జగన్‌పై షర్మిల అన్యాయంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఉదయం పొద్దుటూరులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జగన్‌ తన చెల్లిపై ప్రేమతో ఆస్తిలో షర్మిలకు వాటా ఇచ్చారన్నారు.

KTR On Electricity Charges Hike: పదినెలలకే కరెంట్ ఛార్జీల పెంపా?, డిస్కంల ప్రతిపాదనలను తిరస్కరించాలని కేటీఆర్ డిమాండ్, విద్యుత్ ఛార్జీల పెంపును ప్రజల్లోనే ఎండగడతాం అని వెల్లడి

Arun Charagonda

విద్యుత్ ఛార్జీల పెంపునకు సంబంధించిన ఈఆర్సీ సిరిసిల్లలో ఏర్పాటు చేసిన బహిరంగ విచారణలో పాల్గొని మాట్లాడారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ ఏర్పడిన నాడు మనం తీవ్రమైన విద్యుత్ కొరతతో ఉన్నాం....పారిశ్రామిక వేత్తలు పవర్ హాలిడేస్ వద్దని ఇందిర పార్క్ వద్ద ధర్నాలకు దిగిన పరిస్థితి ఉండేదన్నారు. మరో వైపు రైతులు కరెంట్ లేక తీవ్ర నిరాశలో ఉన్న పరిస్థితి నెలకొందన్నారు.

Advertisement

TDP vs Janasena: వీడియో ఇదిగో, కోమాలోకి పోయిన టీడీపీ పార్టీని బతికించింది జనసేన పార్టీ, గుర్తు పెట్టుకోవాలంటూ టీడీపీకి జనసేన నేతలు మాస్ వార్నింగ్

Hazarath Reddy

చింతలపూడిలో టీడీపీ-జనసేన పార్టీలో ముసలం పుట్టింది. జంగారెడ్డిగూడెంలో జరిగిన చింతలపూడి నియోజకవర్గం జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే తీరుపై జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గెలిపించిన టీడీపీని తామే ఓడిస్తామంటూ మాజీ డీసీసీబి చైర్మన్ కరాటం రాంబాబు హెచ్చరించారు.

YS Sharmila: ఆస్తుల పంపకాల్లో జగన్ మోసం చేశాడు, మూడు పేజిల బహిరంగ లేఖ విడుదల చేసిన వైఎస్ షర్మిల

Arun Charagonda

ఆస్తుల పంపకాల్లో జగన్ తనను ఎలా మోసం చేశారో మూడు పేజీల బహిరంగ లేఖను విడుదల చేసింది ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఇవాళ ఉదయం సాక్షి పేపర్ చూశాను.... సాక్షి మీడియా జగన్ మోహన్ రెడ్డి తిలో ఉంది. కాబట్టి ఏదైనా నమ్మించగలడు అని ఎక్స్ వేదికగా వెల్లడించారు. YSR అభిమానులకు అసలు వాస్తవాలు తెలియజేసే ప్రయత్నం నాది...అందుకే మూడు పేజీల లేఖను విడుదల చేసినట్లు వెల్లడించారు.

LAC Patrolling Pact: ఉద్రిక్తతలకు ముగింపు పలికేలా చైనా-భారత్ మధ్య కీలక ఒప్పందం, సరిహద్దుల నుంచి వెనక్కి వస్తున్న భారత్‌-చైనా బలగాలు

Hazarath Reddy

భారత్‌, చైనాల మధ్య వాస్తవాధీన రేఖ(LAC) వెంబడి గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికేలా ఇటీవల ఇరుదేశాల (India-China) మధ్య కీలక ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే.

Ind Vs NZ 2nd Test: రెండో టెస్టులోనూ మారని టీమిండియా ఆటతీరు, తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకే ఆలౌట్, 7 వికెట్లు తీసిన సాంటర్న్

Arun Charagonda

న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులోనూ టీమిండియా ఆటతీరు మారలేదు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 156 పరుగులకే ఆలౌట్ అయింది. శుభ్‌మ‌న్ గిల్ (30) పరుగులు చేయగా యశస్వి జైస్వాల్ (30) ,రవీంద్ర జడేజా (38), ఆకాశ్ దీప్ (6) పరుగులు చేయగా వాషింగ్టన్ సుందర్ 18 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.

Advertisement

Lizard At Beer Bottle:  బీరు తాగుతున్నారా అయితే జాగ్రత్త..బీరు బాటిల్‌లో బల్లి అవశేషాలు..వికారాబాద్‌లో షాకింగ్ ఘటన, వైన్స్ షాపు నిర్వాహకులతో గొడవకు దిగిన బాధితుడు!

Arun Charagonda

బీరు సీసాలో బల్లి అవశేషాలు కనిపించడం కలకలం రేపింది. వికారాబాద్ జిల్లా ధారూరులో స్థానిక విజయదుర్గా వైన్ షాపులో రూ.4వేల విలువైన మద్యం కొనుగోలు చేశారు ఎం.లక్ష్మీకాంత్ రెడ్డి, అనంతయ్య. బడ్వైజర్ బీరు సీసాలో బల్లి అవశేషాలు ఉన్నట్లు గుర్తించి వైన్స్ షాపు నిర్వాహకులను సంప్రదించగా నిర్వాహకులు తమకు ఏం సంబంధం లేదని బదులివ్వడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది.

Delhi Air Pollution: ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీం చీఫ్ జస్టిస్ కీలక వ్యాఖ్యలు, మార్నింగ్ వాక్‌కు వెళ్లడం మానేశానని, కాలుష్యం ఆందోళనకరంగా మారుతుందని వెల్లడి

Hazarath Reddy

దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) మళ్లీ ఎక్కువైంది. పొరుగు రాష్ట్రాల్లో వ్యర్థాలను తగులబెడుతుండడంత దేశ రాజధానిలో కాలుష్యం పెరిగింది. ఎన్ని క‌ఠిన‌ చ‌ర్యలు తీసుకుంటున్నా కాలుష్యం మాత్రం త‌గ్గడంలేదు.దీనికి తోడు పొగమంచు కూడా రాజధాని ప్రాంతాన్ని ఆవహించింది

Akkineni Nagarjuna: అక్కినేని శత జయంతి ఉత్సవాలు, మెగాస్టార్ చిరంజీకి నాగార్జున ఆహ్వానం, చిరుకు జాతీయ పురస్కారం అందిస్తామన్న కింగ్ నాగ్..

Arun Charagonda

అక్కినేని శత జయంతి ఉత్సవాలకు హాజరుకావాలని మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించారు కింగ్ నాగార్జున. అక్కినేని శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాం అని...ఈ వేడుకలకు బిగ్ బి అమితాబచ్చన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు అన్నారు. అమితాబచ్చన్ చేతుల మీదుగా చిరంజీవికి అక్కినేని జాతీయ పురస్కారం అందజేస్తాం అని..ఈ నెల 28న అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని శత జయంతి వేడుకలు జరుగుతాయన్నారు.

Karnataka: షాకింగ్ వీడియో ఇదిగో, ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ను కారుతో పాటే ఈడ్చుకువెళ్లిన డ్రైవర్, అనంతరం కారు వదిలి పరార్

Hazarath Reddy

కర్ణాటకలోని శివమొగ్గ (Shivamogga)లో ఓ వ్యక్తి ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ను తన కారు బ్యానెట్‌ (Car Bonnet)పైకి ఎక్కించుకొని అలాగే కొంతదూరం ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది

Advertisement
Advertisement