India

Students Request TGSRTC Bus Services: టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు విద్యార్థుల లేఖ, షాద్‌నగర్‌ రూట్‌లో బస్సు సర్వీసులు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన...వీడియో ఇదిగో

Arun Charagonda

షాద్ నగర్ - ఆమన్ గల్ రూట్లో బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు లేఖ రాశారు విద్యార్థులు. షాద్ నగర్ - ఆమన్ గల్ రూట్లో గతంలో 10 బస్సులు నడిస్తే ఇప్పుడు 4 బస్సులే నడుపుతున్నారు అన్నారు. బస్సుల సంఖ్యను పెంచాలి అంటూ సజ్జనార్‌కు లేఖ రాశారు విద్యార్థులు.

Talasani Srinivas yadav: త్వరలో ముత్యాలమ్మ ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేకం...మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు..వెల్లడించిన తలసాని శ్రీనివాస్ యాదవ్

Arun Charagonda

త్వరలో ముత్యాలమ్మ ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుందని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా కుంభాభిషేకం, మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తామని వెల్లడించారు.

Pandameru River Flood: పండమేరు వాగు ఉగ్రరూపం ఎలా ఉందో చూడండి, వరదల్లో కొట్టుకుపోయిన బైకులు, ఆటోలు, అనంతపురం వర్షాలకు సంబంధించిన డ్రోన్ వీడియో ఇదిగో..

Hazarath Reddy

అనంతపురంలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పండమేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరదతో వాగుకు ఇరువైపులా ఉన్న కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. వరద ప్రవాహం పెరుగుతుండడంతో ప్రజలు ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

Hyderabad: కుక్కను తరుముతూ 3వ అంతస్తు నుండి పడి యువకుడు మృతి, మృతుడిని తెనాలికి చెందిన ఉదయ్‌గా గుర్తించిన పోలీసులు

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో కుక్కల దాడి నుంచి తప్పించుకునే క్రమంలో హోటల్ మూడో అంతస్తు నుంచి పడి 23 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని తెనాలికి చెందిన ఉదయ్‌గా గుర్తించారు. అతడు రామచంద్రపురంలోని అశోక్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఆదివారం రాత్రి ఉదయ్‌ స్నేహితులతో కలిసి చందానగర్‌లోని వీవీ ప్రైడ్‌ హోటల్‌కు వెళ్లగా ఈ ఘటన చోటుచేసుకుంది.

Advertisement

Dharani Portal: ధరణి నిర్వహణ ఎన్‌ఐసీకి, మూడు సంవత్సరాల పాటు భూ రికార్డుల నిర్వహణ బాధ్యత చూడనున్న ఎన్‌ఐసీ, కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం

Arun Charagonda

భూముల రికార్డుల నిర్వహణ బాధ్యతలను నేషనల్‌ ఇన్‌ఫర్మేటిక్స్‌ సెంటర్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్ల పాటు ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలు చూడనుంది ఎన్ఐసీ. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరింత సాంకేతిక నైపుణ్యాన్ని తీసుకురావడానికి మరియు వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు.

Anantapur Rains: వీడియోలు ఇవిగో, అనంతపురంలో ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం ఎదురు చూస్తున్న ప్రజలు, ఉగ్రరూపం చూపిస్తోన్న పండమేరు వాగు

Hazarath Reddy

అనంతపురంలో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. భారీ వరదకు పండమేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరదతో వాగుకు ఇరువైపులా ఉన్న కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. వరద ప్రవాహం పెరుగుతుండడంతో ప్రజలు ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

Anantapur Rains: భారీ వర్షాలకు ఉప్పొంగిన పండమేరు వాగు, జల దిగ్భంధంలో అనంతపురం, హైదరాబాద్ - బెంగళూరుకు రాకపోకలు బంద్, వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

అనంతపురంలో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. భారీ వరదకు పండమేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరదతో వాగుకు ఇరువైపులా ఉన్న కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. వరద ప్రవాహం పెరుగుతుండడంతో ప్రజలు ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

Guidelines For Deepam Scheme: ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం, దీపం పథకం ద్వారా దీపావళి నుండి అమలు, ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే!

Arun Charagonda

కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మరో పథకాన్ని అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. మహిళలకు దీపావళి కానుకగా దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించనుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు అఫిషియల్‌గా ప్రకటించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ నెల 31వ తేదీ నుంచి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందింనుండగా ఏడాదికి రూ.2,684 ఖర్చు చేయనున్నారు. ఎల్‌పీజీ కనెక్షన్‌ ఉన్న అర్హులైన ప్రతి కుటుంబానికి ఈ పథకాన్ని వర్తింపచేయనున్నారు.

Advertisement

Cyclone Dana: సైక్లోన్ దన దూసుకొస్తోంది, తీర ప్రాంతాల ప్రజలకు హై అలర్ట్, రేపు తుపానుగా మారే అవకాశం, తుపాను లైవ్ ట్రాకర్ ఇదిగో..

Hazarath Reddy

తూర్పు తీర రాష్ట్రాలకు తుపాను ముప్పు పొంచి ఉంది. తూర్పు మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రంలో ఇవాళ తెల్లవారుజామున అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది.

Kattaleru Vagu: ఎన్టీఆర్ జిల్లా కట్టలేరు వాగుపై వరద ప్రవాహం, నీటిలో ఇరుక్కుపయిన టిప్పర్ లారీ, 20 గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు

Arun Charagonda

ఎన్టీఆర్ జిల్లాగంపలగూడెం మండలం వినగడప కట్టలేరు వాగుపై వరద ప్రవాహం ముంచెత్తింది. ఎగువున తెలంగాణ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా తోటమూల- వినగడప మధ్య ఉన్న వంతెనపై వరద నీరు పోటెత్తింది. కట్లేరు వద్ద ధ్వంసమైన వంతెన ప్రక్కన నిర్మించిన తాత్కాలిక రహదారిపై లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ వరద నీటిలో ఇరుక్కుపోయింది. దీంతో సమీప 20 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.

Helicopter Crash: అమెరికాలో ఘోరం.. రేడియో ట‌వ‌ర్‌ ను ఢీకొన్న హెలికాప్ట‌ర్‌.. న‌లుగురు మృతి.. వీడియో ఇదిగో

Rudra

అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న హూస్ట‌న్ సిటీలో ఓ రేడియో ట‌వ‌ర్‌ ను ఓ హెలికాప్ట‌ర్ ఢీకొన్న‌ది.

Lawrence Bishnoi-Karni Sena: లారెన్స్ బిష్ణోయ్ ని ఎన్ కౌంటర్ చేసే పోలీసు అధికారికి రూ. 1.11 కోట్లు ఇస్తాం.. కర్ణిసేన చీఫ్ రాజ్ షెకావత్ (వీడియో)

Rudra

గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ను చంపే పోలీసు అధికారి ఎవ్వరికైనా రూ. 1,11,11,111 బహుమతిగా ఇస్తామని క్షత్రియ కర్ణిసేన జాతీయ అధ్యక్షుడు రాజ్ షెకావత్ బహిరంగ ప్రకటన చేశారు.

Advertisement

Congress MLA Anirudh Reddy On AP CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫైర్, తిరుమలలో ఎమ్మెల్యేల సిఫారసు లెటర్ తిరస్కరించడంపై ఆగ్రహం

Arun Charagonda

ఏపీ సీఎం చంద్రబాబు పై సీరియస్ అయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. తిరుమల గుడికి తెలంగాణ నుండి లెటర్స్ వస్తే ఈవో యాక్సెప్ట్ చేయడం లేదని.. ఇదే ఆంధ్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలంగాణలోని యాదగిరి గుట్ట, భద్రాచలం ఈవోలకు కాల్ చేస్తే స్పెషల్ దర్శనాలు అవుతున్నాయన్నారు.

Youtuber Harsha Sai: బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన యూట్యూబర్ హర్ష సాయి.. నేడే విచారణ.. ఏమవుతుందో??

Rudra

తనపై నార్సింగి పోలీస్ స్టేషన్‌ లో నమోదైన కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి హైకోర్టును ఆశ్రయించారు.

Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానికి షాక్, బర్త్ డే వేడుకలకు అనుమతి నిరాకరణ,సీపీ నేతలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసిన పోలీసులు

Arun Charagonda

బర్త్ డే రోజు మాజీ మంత్రి కొడాలి నానికి బిగ్ షాక్ తగిలింది. గుడివాడలో కొడాలి నాని పుట్టినరోజు వేడుకల ఫ్లెక్సీ ఏర్పాటుని అడ్డుకున్నారు పోలీసులు. మంగళవారం జరగాల్సిన కొడాలి నాని పుట్టినరోజు వేడుకలకు పోలీసుల అనుమతి నిరాకరించగా వైసీపీ నేతలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు పోలీసులు.

Jeevan Reddy Follower Killed: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడి దారుణ హత్య.. పోలీసులపై మండిపడ్డ కాంగ్రెస్ నేత

Rudra

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డి(53) దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది.

Advertisement

Jagtial: స్నేహితులతో గ్రూప్ వీడియో కాల్‌లో పురుగుల మందు తాగిన యువకుడు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన స్నేహితులు..వీడియో ఇదిగో

Arun Charagonda

జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టులో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. స్నేహితులతో గ్రూప్ వీడియో కాల్ చేసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు ఓ వ్యక్తి.

Gangula Kamalakar: బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంట విషాదం, గంగుల కమలాకర్ తల్లి కన్నుమూత, సంతాపం తెలిపిన కేసీఆర్

Arun Charagonda

కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ ఇంట విషాదం నెలకొంది. గంగుల కమలాకర్ తల్లి అనారోగ్యంతో కన్నుమూశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి సంతాపం ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు.

Salman Khan Warning Row: 'సల్మాన్‌ ఖాన్‌ ను బెదిరించి తప్పు చేశా'.. పోలీసులకు నిందితుడి మరో మెసేజ్

Rudra

బాలీవుడ్ నటుడు సల్మాన్‌ ఖాన్‌ ను చంపేస్తాం అంటూ ఇటీవల బెదిరింపులు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. బిష్ణోయ్‌ గ్యాంగ్‌ తో ఉన్న గొడవకి ముగింపు పలకాలంటే తమకు రూ.5 కోట్లు ఇవ్వాలంటూ ఇటీవల ముంబయి ట్రాఫిక్‌ పోలీసుల వాట్సప్‌ నంబర్‌ కు ఒక మెసేజ్ వచ్చిన విషయం తెలిసిందే.

Hyderabad Horror: వెంట‌ప‌డిన కుక్క.. భయపడి పరిగెత్తుతూ హోటల్ భవనం నుంచి కిందప‌డి యువ‌కుడి మృత్యువాత‌.. హైదరాబాద్ లో దారుణం

Rudra

హైద‌రాబాద్‌ లోని చందాన‌గ‌ర్ లో ఘోరం జరిగింది. ఓ కుక్క నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని తెనాలికి చెందిన ఉద‌య్ (23) అనే యువ‌కుడు ఆర్‌సీ పురంలోని అశోక్‌ న‌గ‌ర్‌ లో నివాసం ఉంటున్నాడు.

Advertisement
Advertisement