India

Tirupati Laddu Dispute: వీడియో ఇదిగో, తిరుపతి లడ్డూ ఘటనలో మాది తప్పు అని నిరూపిస్తే నీ బూట్లు తుడుస్తా, పవన్ కళ్యాణ్ కు ఛాలెంజ్ విసిరిన వైసీపీ నేత అంబటి రాంబాబు

Hazarath Reddy

లడ్డూలో కల్తీ నెయ్యి వాడారా అని ప్రశ్నకు సమాధానం చెప్పడం లేదని, తప్పు చేసినవాళ్లే ప్రాయశ్చిత్త దీక్ష చేపడతారని విమర్శించారు. టీటీడీ లడ్డూపై పూర్తిస్థాయి విచారణ జరగాల్సిందేనని అన్నారు. తప్పు జరిగిపోయిందని ఆంధ్రజ్యోతి, ఈనాడు ముందే రాసేస్తున్నాయని దుయ్యబట్టారు.

MLA Koneti Adimulam: ఏపీ హైకోర్టులో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు బిగ్ రిలీఫ్, లైంగిక వేధింపుల కేసును కొట్టేసిన హైకోర్టు

Arun Charagonda

ఎమ్మెల్యే ఆదిమూలంపై నమోదైన లైంగిక వేధింపుల కేసును ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఆదిమూలంపై ఫిర్యాదు చేసిన మహిళ కోర్టుకు హాజరై తాను చేసిన ఆరోపణలు, FIRలో అంశాలన్నీ అవాస్తవమని, కేసును కొట్టేయాలని న్యాయమూర్తికి వివరించడంతో కేసును హైకోర్టు కొట్టేసింది.

Accident Caught on Camera: షాకింగ్ వీడియో ఇదిగో, వేగంగా వచ్చి అదుపుతప్పి బైకును ఢీకొట్టిన కారు, ఎగిరి అవతల పడిన భార్యాభర్తలు, భార్యకు తీవ్ర గాయాలు

Hazarath Reddy

మెదక్‌లోని వెల్కమ్ బోర్డు వద్ద కారు బీభత్సం స‌ృష్టించింది. వేగంగా వస్తూ అదుపుతప్పి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో దంపతులు ఎగిరి అవతల పడ్డారు. మెదక్ మున్సిపాలిటీ మిషన్ భగీరథలో పనిచేస్తున్న సల్మాన్ కు అతని భార్యకు తీవ్ర గాయాలు అయ్యాయి.

Video: వీడియో ఇదిగో, పెన్సన్ కోసం 2 కి.మీ.లు బురదలో పాక్కుంటూ వెళ్లిన బామ్మ, అధికారులపై మండిపడుతున్న నెటిజన్లు

Hazarath Reddy

ఒడిశా రాష్ట్రంలోని సీఎం మోహన్‌ చరణ్‌ మాఝీ సొంత జిల్లా కియోంఝర్‌లోని రైసాన్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని పథూరీ దేహరీ అనే బామ్మ పెన్షన్‌ కోసం పడరాని పాట్లు పడుతున్న దృశ్యం ఒడిశాలో కనిపించింది.

Advertisement

'Can't Call Any Part Of India Pakistan': భారత భూభాగాన్ని పాకిస్థాన్‌తో పోల్చడం సరికాదు, కర్ణాటక హైకోర్టు జడ్జీ వివాదాస్పద వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు

Hazarath Reddy

ఈ కేసు విచారణలో భారత భూభాగంలోని ఏ భాగాన్ని ఎవరూ పాకిస్థాన్ అని పిలవలేరు అని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. "ఇది ప్రాథమికంగా దేశం యొక్క ప్రాదేశిక సమగ్రతకు విరుద్ధమని తెలిపింది. వివాదాస్పద వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు స్వయంగా కేసును స్వీకరించి కర్ణాటక హైకోర్టును నివేదిక కోరింది.

KTR Inspection Of STP: మూసీ సుందరీకరణ పేరుతో వేల కోట్ల కుంభకోణం, పాకిస్తాన్ కంపెనీకి సుందరీకరణ పనులా?..కేటీఆర్ ఫైర్,హైడ్రాపై త్వరలో ఓ నిర్ణయం

Arun Charagonda

పబ్లి సిటీ స్టంట్లతో సీఎం రేవంత్ ఎక్కువ కాలం ప్రభుత్వాన్ని నడపలేరు అని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కూకట్‌పల్లి నియోజకవర్గంలోని ఫతేనగర్ లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఎస్టిపిని సందర్శించింది బీఆర్ఎస్ బృందం. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్... మూసీ సుందరీకరణను సీఎం రేవంత్ పాకిస్తాన్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని ఆరోపించారు.

Mohan Babu: నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ, రూ.10 లక్షలతో పారిపోయిన పనిమనిషి, సీపీకి ఫిర్యాదు చేసిన మోహన్ బాబు భార్య

Arun Charagonda

నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగింది. హైదరాబాద్ జల్ పల్లిలోని నివాసం లో రూ.10 లక్షలతో పారిపోయారు పనిమనిషి నాయక్. నిన్న రాత్రి రాచకొండ సీపీకి మోహన్ బాబు ఫిర్యాదు చేయగా తిరుపతిలో నాయక్ ను అదుపులోకి తీసుకున్నారు రాచకొండ పోలీసులు.

HC on Elderly Couple's Alimony: భరణం కోసం భార్యాభర్తలు గొడవ, ఈ వయసులో మీ గొడవతో కలియుగం వచ్చినట్లుందంటూ కీలక వ్యాఖ్యలు చేసిన హైకోర్టు జడ్జి

Hazarath Reddy

జీవన భృతి కోసం కొట్టుకున్న భార్యాభర్తల కేసులో అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మీ గొడవతో కలియుగం వచ్చేసినట్టుంది’ అంటూ దుపరి విచారణలోగా మీలో మీరు మాట్లాడుకుని ఒప్పందం కుదుర్చుకోండని సూచించారు. కేసు విచారణను వాయిదా వేశారు.

Advertisement

Youtuber Harsha Sai: నా నుంచి డబ్బుల బ్లాక్ మెయిల్ చేయడానికే అత్యాచారం కేసు పెట్టారు, రేప్ ఆరోపణలపై స్పందించిన హర్ష సాయి

Hazarath Reddy

నిన్న ఓ యువతి హర్ష సాయి తనని మోసం చేసాడని, తనపై అఘాయిత్యం చేసి వీడియోలతో బెదిరిస్తున్నాడని ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. యూట్యూబ్ లో పాపులర్ అయిన హర్ష సాయిపై ఇలా ఆరోపణలు రావడంతో సంచలనంగా మారింది.

Viral Video: వీడియో ఇదిగో, ఆడుకుంటున్న పిల్లలపైకి దూసుకొచ్చిన తాచు పామును కొరికి చంపిన పెంపుడు కుక్క, తాడు తెంపుకుని మరీ పరిగెత్తుకు వచ్చి..

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీలో ఓ ఇంటిలో చోటుచేసుకున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంటి యజమాని పంజాబ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం ఓ పాము తమ గార్డెన్ లోకి దూరిందని చెప్పారు. అక్కడ తన పిల్లలతో పాటు పనిమనిషి పిల్లలు ఆడుకుంటున్నారని తెలిపారు.

R Krishnaiah To Joins Congress: కాంగ్రెస్‌లోకి ఆర్‌ కృష్ణయ్య?, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన కృష్ణయ్యతో ఎంపీ మల్లు రవి భేటీ

Arun Charagonda

మరో నాలుగేళ్లు ఉండగానే తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఆర్ కృష్ణయ్య. ఈ నేపథ్యంలో ఇవాళ కృష్ణయ్యతో భేటీ అయ్యారు నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి. విద్యానగర్‌లోని కృష్ణయ్య నివాసంలో మర్యాదపూర్వకంగా కలవగా వీరిద్దరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్ కృష్ణయ్య కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జోరందుకుంది.

Telugu States Rain Alert: తెలుగు రాష్ట్రాలకు 3 రోజుల పాటు భారీ వర్ష సూచన, హైదరాబాద్ నగరంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక, ఎమర్జెన్సీ నంబర్లు ఇవే..

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ వర్షాల అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నట్లు విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం వెల్ల­డించింది.

Advertisement

Urmila Matondkar Divorce: విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కిన 'రంగీలా' హీరోయిన్ ఊర్మిళ, 8 సంవత్సరాల వివాహా బంధానికి బ్రేక్!

Arun Charagonda

ఊర్మిళ మటోండ్కర్ విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కింది. 8 ఏళ్ల వివాహా బంధానికి స్వస్తి చెబుతూ విడాకులు కావాలంటూ కోర్టు వెళ్లింది ఊర్మిళ. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవడం లేదని, భర్త నుంచి తనకు విడాకులు కావాలని కోర్టుకు వెళ్లినట్టు సమాచారం.

Lion Attack: వైరల్ వీడియో..సింహంతో వెకిలి చేష్టలు, చేతిని కొరికేసిన సింహం, వీడియో పాతదే కానీ వైరల్!

Arun Charagonda

చనువిచ్చింది కదా అని సింహంతో ఆడితే ఇలాగే ఉంటుంది. జమైకాలోని ఓ జూలో ఉన్న సింహంతో వెకిలి చేష్టలు చేశాడు. సింహం నోట్లో చెయ్యి పెట్టి చెలగాటం ఆడగా ఆ వ్యక్తి వేళ్లను పట్టేసింది మృగ రాజు. అతికష్టం మీద సింహం నోట్లో నుంచి వేళ్లను విడిపించుకున్నాడు ఆ వ్యక్తి. వీడియో పాతదే కానీ ఇప్పుడు మళ్లీ వైరల్‌గా మారింది.

Devara Ticket Price: దేవర టీంకు షాక్‌, టికెట్ ధరల పెంపుపై హైకోర్టులో పిటిషన్, ఏ ప్రాతిపదికన టికెట్ల పెంపుకు అవకాశం ఇచ్చారో చెప్పాలన్న పిటిషనర్

Arun Charagonda

దేవర సినిమా టీంకు షాక్ తగిలింది. దేవర సినిమా టికెట్ ధరల పెంపుకు ప్రభుత్వం అనుమతిచ్చిన సంగతి తెలిసందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. టికెట్ ధరల పెంపుతో సామాన్యులపై భారం పడుతుందని..ఏ ప్రాతిపదికన టికెట్ల పెంపుకు అవకాశం ఇచ్చారో చెప్పాలన్నారు పిటిషనర్.

Smoke From Flight At Chennai Airport: ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌కి తప్పిన పెను ప్రమాదం,ఇంధనం నింపుతున్న సమయంలో చెలరేగిన మంటలు..వీడియో ఇదిగో

Arun Charagonda

చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌కి పెను ప్రమాదం తప్పింది. చెన్నై విమానాశ్రయం నుండి దుబాయ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ విమానం బయలుదేరడానికి ముందు ఇంధనం నింపుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Advertisement

Edupayala Vana Durga Bhavani Temple: నీట మునిగిన ఏడుపాయల వనదుర్గ భవాని ఆలయం, భారీ వర్షాలతో గర్బగుడిలోకి ప్రవేశించిన నీరు..వీడియో ఇదిగో

Arun Charagonda

మెదక్ లోని ఏడుపాయల వనదుర్గ భవాని ఆలయం రెండో రోజుల జలదిగ్బందంలోనే ఉంది. సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో గర్భగుడిలోనికి ప్రవేశించింది వరద. ఆలయం ఎదుట ఉదృతంగా ప్రవహిస్తుంది మంజీరా నది. దీంతో ఈ నెలలో 12 రోజులు ఆలయం మూతపడింది.

Delhi Shocker: ఐఫోన్ కొని పార్టీ ఇవ్వలేదని చంపేశారు, ఢిల్లీలో దారుణం, కత్తితో పొడిచి చంపేసిన స్నేహితులు

Arun Charagonda

ఢిల్లీలో దారునం చోటు చేసుకుంది. ఐఫోన్ కొని పార్టీ ఇవ్వలేదని బాలుడిని హత్య చేశారు స్నేహితులు. సచిన్(16) అనే బాలుడు స్నేహితులతో కలిసి వెళ్లి ఐఫోన్ కొన్నాడు. ఈ క్రమంలో వారు పార్టీ అడగగా సచిన్ నిరాకరించగా గొడవ జరగడంతో సచిన్‌ను కత్తితో పొడిచి పరారయ్యారు. ఆస్పత్రికి తరలించే లోపే సచిన్ మృతి చెందాడు.

Actor Jayam Ravi: భార్య ఆర్తిపై పోలీసులకు హీరో జయం రవి ఫిర్యాదు, తన వస్తువులను తిరిగి ఇప్పించాలని పోలీసులకు కంప్లైంట్

Arun Charagonda

భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశారు తమిళ హీరో జయం రవి. విడాకుల తర్వాత తన భార్య ఆర్తి తనను ఇంటి నుంచి గెంటివేసిందని, తన వస్తువులను తిరిగి ఇప్పించాలని పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు జయం రవి.

CM Revanth Reddy On Hydra Demolitions: ఓఆర్ఆర్ లోపల ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చేయాల్సిందే, బాధిత పేదలకు డబుల్ బెడ్ రూం ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి, పాతబస్తీ మెట్రోపై కీలక రివ్యూ

Arun Charagonda

హైదరాబాద్ మెట్రో, ఓఆర్ఆర్ లోపల ఉన్న అక్రమ నిర్మాణాలపై కీలక రివ్యూ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్‌లో ఆక్రమిత చెరువులు, నాలాలతో పాటు మూసీ పరివాహక ప్రాంతాల పరిధిలో నివసించే అర్హులైన పేదల వివరాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. అర్హులైన పేదలు రోడ్డున పడే పరిస్థితి ఉండకూడదని, అలాంటి వారికి డబుల్ బెడ్రూమ్ లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపించాలని చెప్పారు.

Advertisement
Advertisement