జాతీయం

Kagaznagar Rains: కాగజ్‌నగర్‌లో దంచి కొట్టిన వర్షం, రోడ్లపైకి చేరిన నీరు, స్తంభించిపోయిన జనజీవనం

Arun Charagonda

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం కాగజ్ నగర్ లో భారీగా వర్షం కురిసింది. కుండపోత వర్షంతో దహేగాం,పెంచికల్ పేట్ మరియు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో రోడ్లపైకి నీరు చేరగా జనజీవనం స్తంభించిపోయింది.

Astrology: ఆగస్టు 22 నుండి బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశం..ఈ 5 రాశుల వారికి సంపద పెరుగుతుంది.

sajaya

శ్రావణమాసం అంటే చాలా పవిత్రమైన మాసం. ఆగస్టు 22న బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశం దీనిద్వారా అన్నిరాశులకు కూడా శుభ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ ఐదు రాశుల వారికి బుధుని అనుగ్రహంతో సిరిసంపదలు పెరుగుతాయి.

Health Tips: పొరపాటున కూడా ఈ 3 ఆహార పదార్థాలను మళ్లీమళ్లీ వేడి చేయకూడదు దీనివల్ల చాలా ప్రమాదం.

sajaya

మన ఇళ్లల్లో కొన్ని ఆహార పదార్థాలు మిగిలిపోతూ ఉంటాయి. వాటిని మళ్లీ మనం తిరిగి తినడానికి ఉంచుకుంటాము. అయితే మళ్లీ తినేటప్పుడు వాటిని వేడి చేసి తింటాము. అలా వేడి చేయడం వల్ల అది ఆరోగ్యానికి హానికరమని మీకు తెలుసా.

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్, బీజాపూర్ జిల్లాలో జవాన్లకు తప్పిన ప్రమాదం,మావోయిస్టులు అమర్చిన ఐఈడీ నుండి తప్పించుకున్న జవాన్లు

Arun Charagonda

జవాన్లను లక్ష్యంగా చేసుకొని పైప్ బాంబులను (IED) అమర్చారు మావోయిస్టులు. ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్ జిల్లా చిన్నగులూరు పరిధిలోని అటవీ ప్రాంతంలో 250 మీటర్లు పొడవున్న వైరుతో కనెక్ట్ చేసిన అత్యంత ప్రమాదకరమైన బాంబుతో జవాన్లపై దాడి చేసేందుకు కుట్రపన్నారు మావోలు. వాటిని గుర్తించి నిర్వీర్యం చేశాయి భద్రత బలగాలు.

Advertisement

Health Tips: లిప్ స్టిక్ అతిగా వాడుతున్నారా..అయితే చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది జాగ్రత్త.

sajaya

మేకప్ లిస్ట్ లో ఎప్పుడు కూడా ఫస్ట్ ప్లేస్ లో ఉండేది లిప్ స్టిక్. లిప్ స్టిక్ అప్లై చేయకుండా ఏం మేకప్ కూడా పూర్తికాదు. మహిళలను మరింత అందంగా కనిపించేందుకు తరచుగా అనేక రకాలైనఉత్పత్తులను మార్కెట్లో తీసుకొస్తారు.

Health Tips: ఆపిల్ పండు ఇది మన శరీరానికి అమృతం.. దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.

sajaya

వర్షాకాలం వచ్చిందంటే చాలు మార్కెట్లోకి అనేక రకాలైన పండ్లు వస్తాయి. ఇవి మనకు ఎంతో ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా ఈ సీజన్ లో వచ్చే ఆపిల్ పండ్లు అనేక రకాలైన పోషకాలు ఉన్నాయి.ఇందులో మన ఆరోగ్యానికి మెరుగుపరిచే అనేకమైన విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.

Health Tips: అధిక బరువు తగ్గాలనుకుంటున్నారా..అయితే వేడి నీటిని ఇలా త్రాగండి.

sajaya

ఈ రోజుల్లో చాలామంది ఇబ్బంది పడే సమస్య అధిక బరువు. అధిక బరువు తగ్గడానికి రకరకాల అయిన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చాలామంది డైట్ కంట్రోల్ చేస్తారు. వ్యాయామం అతిగా చేస్తారు. ఏది చేసినప్పటికీ కూడా ప్రయోజనాలు చాలా తక్కువగా ఉంటాయి.

Human Trafficking In Chandanagar: స్పా ముసుగులో వ్యభిచారం, వ్యభిచార ముఠా గుట్టురట్టు,నలుగురు యువతుల అరెస్ట్

Arun Charagonda

హైదరాబాద్ చందానగర్ లో స్పాసెంటర్ పై హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు దాడులు చేశారు. స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారు నిర్వహకులు. పక్క సమాచారంతో దాడి చేసి నలుగురు యువతులు,ముగ్గురు విటులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పట్టుబడ్డ వారి నుంచి నగదు,సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసును చందానగర్ పోలీసులకు అప్పగించారు హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు.

Advertisement

Uttar Pradesh: డ్రాయర్ దొంగతనం, ఉత్తరప్రదేశ్‌లో ఫన్నీ, గోడ మీద ఆరేసిన లోదుస్తుల దొంగతనం, సీసీ టీవీ వీడియో

Arun Charagonda

ఉత్తర ప్రదేవ్‌లోని ఆగ్రలో ఓ దొంగ చేసిన పని అందరికి నవ్వు తెప్పించక మానదు. ఓ గోడ మీద ఆరేసిన లోదుస్తులను దొంగలించాడు. బైక్ పై వచ్చిన ఓ వ్యక్తి లో దుస్తులను దొంగలించడం, ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది

UP Road Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యాను, బస్సు ఢీ.. పదిమంది దుర్మరణం.. మరో 27 మందికి తీవ్ర గాయాలు

Rudra

యూపీలోని బులంద్ షహర్ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పొట్టకూటి కోసం పనులకు వెళ్లి ఇండ్లకు తిరిగి వస్తున్న కార్మికులకు ఓ బస్సు మృత్యుశకటంగా మారింది.

Viral Video: భారీ వర్షంలో తడుస్తూ ట్రాఫిక్‌ ను కంట్రోల్ చేసిన లేడీ పోలీసు.. విధి నిర్వహణలో అంకితభావానికి సర్వత్రా ప్రశంసలు (వీడియోతో)

Rudra

మహారాష్ట్రలోని పూణేలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరంలోని పలు వీధుల్లో ట్రాఫిక్ జామ్ అవుతున్నది. ఈ క్రమంలో కత్రాజ్ చౌక్ వద్ద కూడా భారీ ట్రాఫిక్ నెలకొంది.

Chiranjeevi With Balakrishna:బాలయ్య ఫంక్షన్‌కు చిరంజీవి, బాలకృష్ణ 50 వసంతాల వేడుకకు హాజరుకానున్న మెగాస్టార్

Arun Charagonda

నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 1న హైటెక్ సిటీ నోవోటెల్ హోటల్ లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో స్వర్ణోత్సవ వేడుకలను జరుపనున్నారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రతినిధులు మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించారు.

Advertisement

Duvvada Srinivas: సోషల్ మీడియాకు దూరమైన మాధురి, డాక్టర్ల సూచన మేరకే ఈ నిర్ణయం, అందరి సపోర్టు కావాలని వీడియో రిలీజ్‌

Arun Charagonda

దువ్వాడ శ్రీనివాస్ - వాణి ఎపిసోడ్‌లో కీలకంగా మారారు మాధురి. తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన మాధురి సోషల్ మీడియాకు దూరమయ్యారు. తన ఆరోగ్యం మళ్లీ దెబ్బతిందని...మీ అందరి సపోర్టుతో నాకు చాలా ధైర్యంగా ఉందని తెలిపారు.

Hydra Demolishes Illegaal Constructions: అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరఢా, గండిపేటలో ఎఫ్టీఎల్‌ పరిధిలోని నిర్మణాల కూల్చివేత

Arun Charagonda

రంగారెడ్డి జిల్లా మొయినబాద్ మండలం చిలుకూరు గ్రామ రెవెన్యూ పరిధిలోని అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారే హైడ్రా అధికారులు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను ఇవాళ ఉదయం నుంచి కూల్చివేస్తున్నారు అధికారులు. పటిష్ట భద్రతల మధ్య కూల్చివేతలు జరుగుతుండగా పరిసరాల్లోకి ఎవ్వరిని అనుమతించటం లేదు పోలీసులు.

Champai Soren: జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం, బీజేపీలో చేరనున్న మాజీ సీఎం చంపై సోరైన్‌, పలువురు ఎమ్మెల్యేలతో బీజేపీలోకి!

Arun Charagonda

జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తె దిశగా పరిణామాలు కనిపిస్తున్నారు. జేఎంఎం సీనియర్ నేత, మాజీ సీఎం చంపై సోరెన్ బీజేపీలో చేరే అవకాశం ఉంది. చంపై సోరెన్‌తో పాటు కొంతమంది జేఎంఎం ఎమ్మెల్యేలు బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. సోరెన్ బృందం ఢిల్లీకి బయల్దేరారు. జార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలుండగా జేఎంఎం నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడగా హేమంత్ సోరేన్ సీఎంగా ఉన్నారు. ఇటీవల ఈడీ కేసులో హేమంత్ సోరేన్ జైల్లో ఉన్నపుడు సీఎంగా చంపై సోరెన్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.

Jogulamba Gadwal: వరుస దొంగతనాలు, షెట్టర్ పగులగొట్టి మరి దొంగతనాలు, హడలెత్తుతున్న షాప్ యజమానులు

Arun Charagonda

జోగులంబా గద్వాల జిల్లాలో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. జులకల్ స్టేజ్ లో అర్ధరాత్రి షెట్టర్ పగులగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇందుకు సంబంధించి సీసీ టీవీలో వీడియో రికార్డు కాగా వరుస దొంగతనాలతో షాప్ యజమానులు హడలెత్తుతున్నారు

Advertisement

Kolkata Doctor case updates: కోల్‌కతా డాక్టర్ హత్యాచారం కేసులో కీలక పరిణామం, బీజేపీ నేత సహా ఇద్దరు డాక్టర్లకు సమన్లు, ప్రధాన నిందితుడికి మానసిక పరీక్ష

Arun Charagonda

కోల్‌కతా ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసుల్లో దోషులను శిక్షించాలని దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతోంది. ముఖ్యంగా కోల్ కతాలో మెడికల్ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుండగా దేశవ్యాప్తంగా వీరికి వైద్యులు, మెడికల్ కాలేజీ విద్యార్థులు సంఘీభావం చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన థియేటర్ ఆర్టిస్టులు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ శనివారం అర్ధరాత్రి మార్చ్‌తో నిరసనల్లో పాల్గొన్నారు.

Stray Dogs Attack: ములుగులో పిచ్చి కుక్కల స్వైరవిహారం, ఏడుగురు యువకులతో పాటు రెండు మేకలపై దాడి,భయాందోళనలో స్థానికులు

Arun Charagonda

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేశాయి. వెంకటాపురం మం. నూగురు గ్రామంలో ఏడుగురిపై పిచ్చికుక్క దాడి చేసింది. హుటాహుటిన వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు గ్రామస్తులు. రెండు మేకలను సైతం కరిచాయి పిచ్చికుక్కలు. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

Chandrababu In Delhi: ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు, ఇవాళ పలువురు కేంద్రమంత్రులను కలవనున్న టీడీపీ అధినేత

Arun Charagonda

టీడీపీ చంద్రబాబు ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. రాష్ట్రానికి రావాల్సిన అభివృద్ధి పనులపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పాటు నిర్మలా సీతారామన్‌లను కలిశారు చంద్రబాబు. అమరావతి పునర్ నిర్మాణం, పోలవరం నిర్మాణానికి సహకారం అందించాలని కోరారు. అలాగే ఏపీ అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని చెప్పిన విధంగా సాయం అందించాలని కోరారు.

Andhra Pradesh Shocker:భర్తను కొట్టి, భార్యపై ముగ్గురు యువకుల అత్యాచారం , ఏలూరులో కిరాతక సంఘటన

Arun Charagonda

భర్తను కొట్టి.. అతని భార్యపై ముగ్గురు యువకుల అత్యాచారం చేసిన సంఘటన ఏలూరులో చోటు చేసుకుంది. జీవనోపాధి కోసం వచ్చి రాంకోఠిలో ఉంటున్న భర్తకు నగరానికి చెందిన ముగ్గురు యువకులు పరిచయం అయ్యారు. ఈ క్రమంలో ముగ్గురితో కలిసి భర్త మద్యం తాగాడు. ఆ తర్వాత ఆ ముగ్గురు భర్తపై దాడి చేసి భార్యపై అత్యాచారం చేశారు.

Advertisement
Advertisement