Representational Picture. Credits: PTI

పదో తరగతి అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు బుధవారం (నేడు) విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో ఉదయం 10 గంటలకు ఈ ఫలితాలను విడుదల (AP 10th Supplementary Result) చేశారు. 64.23 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను bse.ap.gov.inలో చెక్‌ చేసుకోవచ్చు. ఈ పరీక్షల్లో పాసయ్యే వారిని కంపార్ట్‌మెంటల్‌ అని కాకుండా రెగ్యులర్‌ విద్యార్థులుగా పరిగణించనుంది. వారికి రెగ్యులర్‌ విద్యార్థులకు మాదిరిగానే పరీక్షల్లో వచ్చిన మార్కుల ప్రకారం డివిజన్లను కేటాయించనుంది.

తరగతుల విలీనంపై తప్పుడు వార్తలు రాస్తున్నారు, సమస్య ఏంటో చెప్తే మేము పరిష్కరిస్తామని తెలిపిన ఏపీ విద్యాశాఖ ప్రిన్స్‌పల్‌ సెక్రటరీ రాజశేఖర్‌

ఈ మేరకు నిబంధనలు సడలిస్తూ పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ గ‌తంలో మెమో జారీ చేశారు. ఈ ఒక్క విద్యాసంవత్సరానికి మాత్రమే ఈ సడలింపు వర్తించనుందని పేర్కొన్నారు. కోవిడ్‌ కారణంగా గత రెండేళ్లుగా స్కూళ్లు సరిగా నడవకపోవడం, ముఖ్యంగా 8, 9 తరగతుల విద్యార్థులకు పాఠాల నిర్వహణ పూర్తిస్థాయిలో లేకపోవడంతో వారు చాలా వెనుకపడ్డారు. దీంతో పదో తరగతి పరీక్షల్లో దాదాపు 2 లక్షల మంది ఉత్తీర్ణులు కాలేకపోయిన విష‌యం తెల్సిందే.

చెక్ చేసుకోవడం ఎలా

Visit bse.ap.gov.in

Click on AP SSC Supplementary results 2022 on the home page

Enter your hall ticket number in the results page.

Click on submit button

The results will be displayed

Download a copy for further use