Amaravati, August 1: ఏపీలో తరగతుల విలీనంపై కొన్ని పేపర్లు తప్పుడు వార్తలు రాస్తున్నాయని ఏపీ విద్యాశాఖ ప్రిన్స్‌పల్ సెక్రటరీ రాజశేఖర్ (Principal Secretary of AP Education Department Rajasekhar) మండిపడ్డారు. సోమవారం మధ్యాహ్నాం ఆయన సచివాలంలో మీడియాతో మాట్లాడారు. తరగతుల విలీనంపై ( merger of classes in AP) తప్పుడు వార్తలు రాస్తున్నారు. చరిత్రలో ఎన్నడూ జరగని ప్రక్రియని ఇప్పుడు చేస్తున్నాం. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి అమలు చేస్తున్నాం. పత్రికల్లో కథనాలు రాసేవాళ్ళు.. సమస్య ఏంటో చెప్తే మేము పరిష్కరిస్తాం.
అంతేగానీ తప్పుడు వార్తలు రాయొద్దు. సంఘాలు, టీచర్లు కొన్ని పాలసీలను వ్యతిరేకిస్తున్నారు. కానీ మేం మాత్రం ప్రతీ నిర్ణయం విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని తీసుకుంటున్నాం. పిల్లలకు మంచి చేసే నిర్ణయాలనే మేము తీసుకుంటున్నాం. గతంలో నిర్ణయాలు విద్యార్థుల కోసం కాకుండా ఇతర కారణాలతో తీసుకునేవాళ్లు. కానీ, ఇప్పుడు మేం మాత్రం విద్యార్థుల కోణంలో ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం’’ అని ఏపీ విద్యాశాఖ ప్రిన్స్‌పల్ సెక్రటరీ రాజశేఖర్ స్పష్టం చేశారు.