ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన గృహనిర్మాణ శాఖపై సమీక్షా సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి ఏపీఎస్‌హెచ్‌సీఎల్ ఛైర్మన్ డి.దొరబాబు, సీఎస్ సమీర్ శర్మ, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై. శ్రీలక్షి, ఇంధనశాఖ స్పెషల్ సీఎస్ కె. విజయానంద్, ఆర్ధికశాఖ కార్యదర్శి కె. వి. వి. సత్యనారాయణ, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్. శ్రీధర్, ఏపీఎస్‌హెచ్‌సీఎల్ ఎండీ ఎన్. భరత్ గుప్తా, సీసీఎల్‌ఎ కార్యదర్శి అహ్మద్ బాబు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంపై సీఎం సమీక్షించారు. గృహ నిర్మాణం వేగవంతంగా ముందుకు సాగాలని సీఎం అన్నారు. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమానికి అత్యంత ప్రాధానత్య ఇవ్వాలన్నారు. విశాఖలో ఇచ్చిన ఇళ్ల నిర్మాణ పనులు కూడా వేగంగా జరగాలన్నారు. కాలనీల్లో మౌలిక వసతులపై దృష్టిపెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు.
గృహ నిర్మాణ శాఖపై సీఎం వైయస్ జగన్ సమీక్షhttps://t.co/JAati2oWwA
— YSR Congress Party (@YSRCParty) August 1, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)