సమాచారం

Tejas Express: గంటకు 200 కిలోమీటర్ల వేగం, రైలు గంట ఆలస్యంగా వస్తే ప్రయాణికులకు రూ.100, రైల్వే ప్రయాణికులకు రూ.25 లక్షల ఉచిత బీమా, 60 రోజుల ముందుగా రిజర్వేషన్ చేసుకోవాలి, ప్రారంభమైన తేజస్ ఎక్స్‌ప్రెస్‌

Hazarath Reddy

అహ్మదాబాద్-ముంబైల మధ్య తేజస్ ఎక్స్ ప్రెస్ (Ahmedabad-Mumbai Tejas Express)రైలును కేంద్రమంత్రి పియూష్ గోయల్(Railway Minister Piyush Goyal ) అహ్మదాబాద్‌ రైల్వే స్టేషన్‌లో పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపాని(Gujarat Chief Minister Vijay Rupani), రాష్ట్ర మంత్రులు, రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Major Terror Attack Averted: భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసిన శ్రీనగర్ పోలీసులు, జైషే మహ్మద్‌ ఉగ్రవాద మూక అరెస్ట్, భారీ పేలుడు పదార్ధాలు స్వాధీనం,వెల్లడించిన జమ్మూ కశ్మీర్‌ డీజీపీ దిల్బాగ్‌ సింగ్‌

Hazarath Reddy

దేశంలో భారీ పేలుళ్లకు ఉగ్రవాదులు జరిపిన కుట్రలను జమ్మూ కాశ్మీర్ పోలీసులు( Jammu & Kashmir Cops) భగ్నం చేశారు. రిపబ్లిక్ డేకి (Republic Day 2020)ముందు భారీ పేలుళ్లు జరపాలని జైషే మహ్మద్‌ ఉగ్రవాద (Jaish-e-Mohammed)మూకలు చేసిన ప్రయత్నాలను పోలీసులు తిప్పి కొట్టారు.

CAA-Kerala GOVT: సీఏఏని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్, నిబంధనలకు విరుద్ధమంటున్న కేరళ సీఎం పినరయి విజయన్, సీఏఏపై సుప్రీంకోర్టు గడప తొక్కిన తొలి రాష్ట్రంగా గుర్తింపుకెక్కిన కేరళ, అసెంబ్లీలో ఇప్పటికే తీర్మానం

Hazarath Reddy

పౌరసత్వ సవరణ చట్టం(CAA)ని కేరళ ప్రభుత్వం(Kerala Govt) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టంపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సీఏఏకి(Citizenship Act) వ్యతిరేకంగా పిన్నరయి విజయన్ సర్కార్ (Pinarayi Vijayan) అసెంబ్లీలో తీర్మాణం కూడా చేసిన విషయం తెలిసిందే.

Jallikattu: ఒళ్లు ఝలదరించేలా ఎద్దులతో ఫైటింగ్, జల్లికట్టుకు రెడీ అయిన తమిళనాడు, జల్లికట్టు చరిత్ర ఏమిటి ? ఎందుకు తమిళనాడు వాసులు అంత క్రేజ్ చూపిస్తున్నారు, జల్లికట్టుపై విశ్లేషణాత్మక కథనం

Hazarath Reddy

సంక్రాంతి వచ్చేసింది. ఇప్పుడు తమిళనాడులో(Tamil Nadu) జల్లికట్టుకు(Jallikattu) అక్కడ జనం సిద్ధమవుతున్నారు. ఎద్దుల్ని(bulls) బరిలోకి దింపేందుకు నిర్వాహకులు సైతం శ్రమిస్తున్నారు. జల్లికట్టులో పాల్గొనే ఎద్దులకు అదిరిపోయేలా శిక్షణ ఇస్తున్నారు.ఇది ఓ సంప్రదాయ క్రీడ, గ్రామీణ ప్రాంత వేడుకగా తమిళనాడు వాసులు జరుపుకుంటారు.

Advertisement

Kaifi Azmi: 20వ శతాబ్దపు ప్రఖ్యాత భారతదేశపు కవి, 11 ఏళ్లకే ఘజల్ రాసిన కైఫి అజ్మీ, ప్రేమ కవిత్వం నుంచి అట్టడుగు వర్గాల ప్రతినిధిగా ఆయన కవిత్వం, కైఫి అజ్మీ 101వ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం

Hazarath Reddy

20వ శతాబ్దపు భారతదేశపు ప్రఖ్యాత కవులలో ఒకరైన కైఫీ అజ్మీ(Kaifi Azmi) 101వ పుట్టిన రోజు సంధర్భంగా(101st Birth Anniversary) గూగుల్ తన పేజిపై డూడుల్(Google Doodle) ను అంకితమిచ్చింది. ఈ డూడుల్ ద్వారా గొప్ప భారతీయ ఉర్దూ కవి మరియు గేయ రచయిత కైఫీ అజ్మీకి ఘనంగా నివాళి అర్పించింది. ప్రఖ్యాత కవులలో ఒకరైన కైఫీ అజ్మీ 14 జనవరి 1919 న ఉత్తర ప్రదేశ్ లోని అజమ్‌ఘర్‌లో జన్మించారు. చిన్న వయస్సులోనే కవిత్వం రాయడం ప్రారంభించారు.

TRAI Good News: కేబుల్ టీవీ వినియోగదారులకు గుడ్ న్యూస్, రూ.130కే 200 ఛానల్స్, 12 రూపాయలకే నచ్చిన స్పోర్ట్స్ ఛానల్, తాజాగా సవరణలు చేసిన ట్రాయ్

Hazarath Reddy

కేబుల్ టీవీ వినియోగదారులకు ట్రాయ్(టెలికాం రెగులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) (Telecom Regulatory Authority of India (TRAI))శుభవార్తను చెప్పింది. ట్రాయ్ తాజా సవరణల ప్రకారం బిల్లు భారం ఇకపై కాస్త తగ్గనుంది. కొత్త సవరణలతో కేబుల్ బిల్లులో 14 శాతం ఆదా అయ్యే అవకాశం ఉంది.

Jagan-KCR Meet: 4వసారి కలవనున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వేదిక కానున్న ప్రగతి భవన్, కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం, పెండింగ్‌లో ఉన్న అంశాలు, చర్చకు వచ్చే అంశాలపై ఓ లుక్కేయండి

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు (Telugu States Chief Ministers) నేడు మరోసారి సమావేశం కాబోతున్నారు. ఈ మధ్నాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..(Chief Minister K Chandrasekhar Rao)ఏపీ ముఖ్యమంత్రి జగన్(Chief Minister YS Jagan Mohan Reddy) ను విందుకు ఆహ్వానించారు. ఏపీ సీఎం జగన్ రెండు రోజులుగా హైదరాబాద్‌లోని(Hyderabad) లోటస్ పాండ్‌లోనే ఉంటున్నారు. నాలుగు నెలల విరామం తరువాత ఇద్దరి మధ్య సాగుతున్న సమావేశం కావటంతో దీని పైన ఆసక్తి నెలకొని ఉంది.

AP High Court New Judges: ఏపీ హైకోర్టుకు కొత్తగా నలుగురు న్యాయమూర్తులు, ఇప్పుడు మొత్తం హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 19, న్యాయవాదుల కోటా నుంచి నలుగురు నియామకం

Hazarath Reddy

ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh)రాష్ట్ర హైకోర్టు ( high court) న్యాయమూర్తులుగా రావు రఘునందన్‌రావు, బట్టు దేవానంద్, దొనడి రమేశ్, నైనాల జయసూర్య నియమితులయ్యారు. వీరి నియామకానికి శుక్రవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదముద్ర వేయడంతో కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. వీరి నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 19కి చేరుకోనుంది.

Advertisement

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, 20 మంది సజీవదహనం..,మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం, కొనసాగుతున్న సహాయక చర్యలు, విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోడీ

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh)ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏసీ బస్సు.. ట్రక్కును ఢీకొనడంతో (Truck, bus catch fire) మంటలు చెలరేగి, 20 మందికిపైగా ప్రయాణికులు చనిపోయారు. కన్నౌజ్‌ జిల్లాలోని (Kannauj)చిబ్రమౌ ప్రాంతంలో శుక్రవారం రాత్రి 45 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్‌ బస్సు, డీజిల్‌ ట్యాంకర్‌ని ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే బస్సుకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో దాదాపు 20 మంది సజీవదహనమైనట్లు తెలుస్తోంది.

Jagananna Vidya & Vasathi Deevena: ఏపీలో మరో రెండు కొత్త పథకాలు, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, విద్యార్థులకు ప్రతి ఏటా రూ. 30 వేలు, నేరుగా తల్లుల ఖాతాలో జమ, జూన్ 1 నుంచే అన్ని ప్రభుత్వ స్కూల్స్‌లో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం

Hazarath Reddy

ఏపీలో పరిపాలనలో దూసుకుపోతున్న సీఎం జగన్ (CM Jagan) మరో రెండు కొత్త (Two New Schemes)శ్రీకారం చుట్టారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హమీని నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన చెబుతున్నారు. ఇందులో భాగంగా ‘జగనన్న విద్యా దీవెన’,(Jagananna Vidya Deevena) ‘జగనన్న వసతి దీవెన’ (Jagananna Vasathi Deevena) అనే రెండు కొత్త పథకాలను తీసుకొస్తున్నారు.

Crimes In India 2018: రోజుకు 80 హత్యలు, 91 అత్యాచారాలు, 289 కిడ్నాప్‌లు, ఆత్మహత్యలకు పాల్పడిన రైతులు 10,349, 2018లో జరిగిన నేరాలపై నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) వార్షిక నివేదిక కఠోర వాస్తవాలు..

Hazarath Reddy

80 హత్యలు (80 murders) 91 అత్యాచారాలు (91 rapes)289 కిడ్నాప్‌లు(289 kidnappings)..ఒక్కరోజులో భారతదేశం మొత్తమ్మీద నమోదవుతున్న నేరాలు ఘోరాల సగటు ఇది. 2018లో దేశంలో జరిగిన నేరాలపై∙నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) వార్షిక నివేదిక (Crimes In India 2018)చెబుతున్న కఠోర వాస్తవాలు ఇవి. భారతదేశంలో 2018లో నేరాల సంఖ్య సగటున 1.3 శాతం ఎక్కువ అయింది.

Jagananna Amma Vodi: సీఏం గుడ్ న్యూస్, అమ్మ ఒడి డబ్బులు అర్హులందరికీ వచ్చేస్తాయి, హాజరుతో పనిలేదు, 9వ తేదీ నేరుగా తల్లుల అకౌంట్లోకి అమౌంట్, వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం

Hazarath Reddy

పరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సీఎం అమ్మఒడి పథకం (Jagananna Amma Vodi) లబ్ధిదారులకు గుడ్ న్యూస్ వినిపించారు. ఈ పథకానికి 75శాతం హాజరు ఉండాలనే నిబంధనను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. తొలి ఏడాది మాత్రమే మినహాయింపు ఇచ్చారు. రెండో ఏడాది నుంచి 75శాతం హాజరు నిబంధన కచ్చితంగా అమలు చేయాలని విద్యాశాఖ అధికారులను సీఎం ఆదేశించారు.

Advertisement

Bharat Bandh 2020: రేపు భారత్ బంద్, డబ్బులు ముందే తీసి పెట్టుకోండి, 14 డిమాండ్లను పరిష్కరించాలంటూ దేశ వ్యాప్త సమ్మె, 25 కోట్ల మంది పాల్గొనే అవకాశం, ప్రధాని మోడీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఏకమైన 10 కార్మిక సంఘాలు

Hazarath Reddy

ప్రధాని నరేంద్ర మోడీ తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా 10 కార్మిక సంఘాలు (10 central trade unions) ఏకమయ్యాయి. పది సెంట్రల్ ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో (INTUC, AITUC, HMS, CITU, AIUTUC, TUCC, SEWA, AICCTU, LPF, UTUC)లు సంయుక్తంగా జనవరి 8న దేశ వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. వివిధ కార్మిక సంఘాలతో పాటు, బ్యాంకింగ్‌ సంఘాలు, వివిధ రంగాల స్వతంత్ర సమాఖ్యలు, సంఘాలు సమ్మెను విజయవంతం చేయాలని కోరుతున్నాయి.

TSPSC Notification 2020: డిగ్రీ అర్హతతో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల, నెల జీతం రూ. 78,910 వరకు పొందవచ్చు, ఇతర జీతభత్యాలు అదనం, పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి

Vikas Manda

నియామక ప్రక్రియకు సంబంధించి నోటిఫికేషన్ లో పేర్కొన నిబంధనలు పూర్తిగా చదివిన తర్వాతనే దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియను కొనసాగించే ముందు అభ్యర్థులు టిఎస్‌పిఎస్‌సి వెబ్‌సైట్‌లో......

Iran Bounty Offer: ట్రంప్ తల తీయండి..రూ.570 కోట్లు గెలుచుకోండి, సంచలనం రేపుతున్న వీడియో, అమెరికా - ఇరాన్ దేశాల మధ్య తీవ్ర రూపం దాల్చిన వార్

Hazarath Reddy

అమెరికా వైమానిక దాడిలో మరణించిన ఇరాన్ మేజర్ జనరల్ కసీమ్ సోలెమన్‌(Iranian Major General Qaseem Soleimani) యొక్క అంత్యక్రియలు( funeral ceremony) సోమవారం జరిగాయి. మషద్ నగరంలో (Mashhad city)జరిగిన ఊరేగింపులో ఓ వీడియో (Video) సంచలనం రేపుతోంది. ఈ వీడియో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను(US President Donald Trump) హతమార్చిన వారికి రూ. 80 మిలియన్ డాలర్లు (రూ. 570 కోట్లు) గెలుచుకోవచ్చని చెబుతోంది. కాగా ఇరాన్ అధికారిక ఛానల్ ఈ ప్రకటన చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఉద్రికత్తలను మరింతగా రేపుతోంది.

Vaikunta Dwara Darshanam: వైకుంఠ దర్శనం రెండు రోజులే, ఈ నెల 20 నుంచి ఉచిత లడ్డూ, వెల్లడించిన టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన కలియుగ వైకుంఠం

Hazarath Reddy

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం(Vaikunta Dwara Darshanam) పది రోజుల పాటు కల్పించాలని కోరుతూ వేసిన పిటిషన్ పై హైకోర్టులో (High Court) నిన్న విచారణ జరిగింది. ఈ విషయమై స్పష్టత ఇవ్వాలని, టీటీడీ (TTD Board) బోర్డు సమావేశమై ఓ నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుమలలోని అన్నమయ్య భవన్ లో టీటీడీ పాలక మండలి సమావేశమైంది.

Advertisement

Tourist Bus Caught Fire: మంటల్లో కాలి బూడిదైన టూరిస్టు బస్సు, శ్రీకాకుళంలో తప్పిన పెను ప్రమాదం, 18 మందికి గాయాలు, గాయపడిన వారిని శ్రీకాకుళం ఆస్పత్రికి తరలింపు, వెనుక నుంచి మరొక బస్సు బలంగా ఢీకొట్టడంతో ఘటన, ( వీడియో)

Hazarath Reddy

శ్రీకాకుళం జిల్లా (Srikakulam) పైడిభీమవరం దగ్గర ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ముందుగా వెళ్తున్న టూరిస్టు బస్సును వెనుక నుంచి వచ్చిన మరో బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఉత్తరాఖండ్‌కు చెందిన టూరిస్ట్‌ బస్సు మంటల్లో కాలి (Tourist Bus Catches Fire)బూడిదయింది. పూరిలో జగన్నాధస్వామి దర్శనం చేసుకుని విశాఖపట్నం వెళ్తుండగా.. ఒక పర్రిశమకు చెందిన బస్సు అదుపు తప్పి టూరిస్ట్‌ బస్‌ను ఢీకొనడంతో మంటలు వ్యాపించాయి.

Maharashtra Government: కీలక శాఖలన్నీ ఎన్పీపీ గుప్పెట్లో..,కలకలం రేపుతున్న రాజీనామాలు, ఆర్థిక శాఖతో అజిత్ పవార్, పర్యాటక శాఖతో ఆదిత్య ఠాక్రే, హోం మంత్రిత్వ శాఖతో దేవ్ ముఖ్, మొత్తం మంత్రిత్వ శాఖల లిస్ట్ ఇదే..

Hazarath Reddy

మహారాష్ట్రలో మహా వికాస్‌ ఆఘాడి ప్రభుత్వంలోని (Maha Vikas Aghadi)మంత్రులకు ఎట్టకేలకు శాఖలు కేటాయించారు. సీఎం ఉద్దవ్‌ ఠాక్రే (Chief Minister Uddhav Thackeray)పంపిన ప్రతిపాదనకు గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోషియారీ(Maharashtra Governor Bhagat Singh Koshyari) ఆమోదం తెలిపారు. దీంతో కూటమి ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన శాఖల అప్పగింత అంకం ముగిసింది. ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌కు (Deputy CM Ajit Pawar) ఆర్థికశాఖ, అనిల్‌ దేవ్‌ముఖ్‌కు హోం మంత్రిత్వశాఖ, సుభాష్‌ దేశాయ్‌కు పరిశ్రమలను కేటాయించారు.

Gurdwara Attack: పాక్‌లో గురుద్వారాపై దాడి, ఇది భారత్ కుట్రే అంటున్న దాయాది దేశం, తీవ్రంగా ఖండించిన భారత్, పాక్ ఎంబసీ ఎదుట సిక్కుల ధర్నా, దాడికి వ్యతిరేకంగా ఏకమైన అన్ని రాజకీయ పార్టీలు, అక్కడ అసలేం జరిగింది ?

Hazarath Reddy

పాకిస్తాన్‌లోని (Pakistan)చారిత్రక నాన్‌కానా సాహిబ్‌ గురుద్వారాపై (attack on Nankana Sahib Gurdwara) జరిగిన రాళ్ల దాడి దేశంలో ప్రకంపనలే రేపుతోంది. ఈ దాడిని అన్ని రాజకీయ పార్టీలు ఏకమై ఖండించాయి. ఇది పిరికిపందల సిగ్గుమాలిన చర్య అంటూ శనివారం ఢిల్లీలో వందలాది మంది ర్యాలీ (Protests) చేపట్టారు. సిక్కులకు, సిక్కుల ప్రార్థనా స్థలాలకు పాక్‌ ప్రభుత్వం తగు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు.

Adani Ports Buys Krishnapatnam Port: కృష్ణపట్నం పోర్టులోకి అడుగుపెట్టిన ఆదానీ గ్రూపు, కేపీసీఎల్‌ నుంచి 75 శాతం వాటా కొనుగోలు, డీల్ విలువ రూ.13,572 కోట్లు, 25 శాతం వాటాతో కేపీసీఎల్

Hazarath Reddy

దేశంలో అతిపెద్ద మల్టీపోర్ట్‌ ఆపరేటర్‌ అయిన అదానీ గ్రూప్‌ కంపెనీ అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ (Gautam Adani-led Adani Ports and Special Economic Zone Ltd) ఎట్టకేలకు కృష్ణపట్నం పోర్టు(Krishnapatnam Port)లో పాగా వేసింది. కృష్ణపట్నం పోర్ట్‌ కంపెనీలో (కేపీసీఎల్‌) (KPCL)75 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్టు శుక్రవారం ప్రకటించింది. దీని విలువ రూ.13,572 కోట్లుగా ఉంది.

Advertisement
Advertisement