Information

IND vs WI, Ishan kishan: రిషబ్ పంత్ స్థానంలో టీమిండియాకు మరో కీపర్ బ్యాట్స్ మన్ దొరికేశాడు, వెస్టిండీస్ తో రెండో టెస్టు మ్యాచ్‌లో మెరిసిన ఇషాన్ కిషన్..

kanha

వెస్టిండీస్ తో రెండవ టెస్ట్ మ్యాచ్‌లో, ఇషాన్ కిషన్ తన ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన విధానం ద్వారా అతని ఇన్నింగ్స్‌లో పంత్ లాంటి బ్యాటింగ్ ఉంది. ఈ యువ వికెట్ కీపర్ ఆటగాడు మైదానంలోకి ప్రవేశించిన వెంటనే దూకుడుగా నిలిచాడు. తక్కువ సమయంలో నాలుగు ఫోర్లు కొట్టాడు.

D K Shivakumar Is Richest MLA: దేశంలోనే అత్యంత ధనవంత ఎమ్మెల్యే శివకుమార్ ఆస్తుల విలువ రూ.1,413 కోట్లు

kanha

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి, కర్ణాటక డిప్యూటీ సీఎం అయిన డీకే శివకుమార్ ఆస్తుల విలువ రూ.1,413 కోట్లు కాగా ఆ తర్వాతి రెండు స్థానాల్లో ఉన్నవారు కర్ణాటకకు చెందిన వారేనని ఏడీఆర్ నివేదిక తెలిపింది.

Rains Alert to Hyderabad: రానున్న 12 గంటల్లో హైదరాబాద్‌ లో భారీ వర్షం.. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోనూ వానలు.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారుల హెచ్చరిక.. ప్రమాదకరస్థాయికి హుస్సేన్ సాగర్

Rudra

తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన నాలుగు రోజులుగా రాజధాని హైదరాబాద్ వర్షాలతో తడిసి ముద్దవుతుంది. రానున్న 12 గంటల్లో భాగ్యనగరంలో భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

IMD Weather Forecast: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన, వచ్చే 5 రోజుల పాటు అలర్ట్ జారీ చేసిన ఐఎండీ

Hazarath Reddy

కోస్తాంధ్ర - ఒడిశాను ఆనుకుని అల్పపీడన ప్రాంతం ఏర్పడినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ, ఒడిశా, మధ్యప్రదేశ్‌, కేరళ, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. దీంతో, ఈనెల 25 వరకు మోస్తరు నుంచి విస్తారంగా జల్లులు కరిసే అవకాశం ఉందని వెల్లడించింది.

Advertisement

Warning about Manholes: మ్యాన్‌ హోళ్లు తెరిస్తే క్రిమినల్‌ కేసులు.. భారీ వర్షాల నేపథ్యంలో జలమండలి వార్నింగ్‌

Rudra

గడిచిన మూడురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ జలమండలి అప్రమత్తమైంది. భారీ వర్షాలతో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టింది.

Heavy Rains in Telangana: తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు.. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దంటున్న వాతావరణశాఖ.. 24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఈ నెల 26 వరకు జోరువానలే

Rudra

భారీ వర్షాలతో తెలంగాణ అతలాకుతలం అవుతున్నది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మాదిరి వర్షం కురిసే అవకాశం ఉంది.

Earthquakes in Rajasthan: వరుస భూకంపాలతో వణికిపోయిన జైపూర్.. తెల్లవారుజామున 4.09 గంటల నుంచి 4.26 గంటల మధ్య మూడు భూకంపాలు.. ఏం జరుగుతోందో తెలియక హడలిపోయిన ప్రజలు

Rudra

వరుస భూకంపాలతో రాజస్థాన్ రాజధాని జైపూర్ వణికిపోయింది. ఈ తెల్లవారుజామున 4.09 నుంచి 4.23 గంటల మధ్య మూడు భూకంపాలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై వీటి తీవ్రత 3.1 నుంచి 4.22 మధ్య ఉంది. భూకంప కేంద్రం భూఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతున ఉన్నట్టు అధికారులు తెలిపారు.

SBI WhatsApp Banking: వాట్సాప్ ద్వారా 13 రకాల ఎస్‌బీఐ సేవలు పొందవచ్చు, ఎస్‌బీఐ వాట్సప్ బ్యాంకింగ్ కోసం నమోదు, ప్రారంభించడానికి దశల కోసం క్లిక్ చేయండి

Hazarath Reddy

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాట్సాప్‌లో అనేక బ్యాంకింగ్ సేవలను అందిస్తోంది. వినియోగదారులు తమ మొబైల్ ఫోన్‌ని ఉపయోగించి QR కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా WhatsApp ద్వారా SBI బ్యాంక్ సేవలను పొందవచ్చు. ఖాతా బ్యాలెన్స్, మినీ స్టేట్‌మెంట్, పెన్షన్ స్లిప్, లోన్ సమాచారం, అనేక ఇతర SBI బ్యాంకింగ్ సేవలు WhatsAppలో అందుబాటులో ఉన్నాయి.

Advertisement

'No Caste' and 'No Religion': దరఖాస్తుల్లో విద్యతో పాటు నో క్యాస్ట్‌ , నో రిలీజియన్‌ కాలమ్‌ తప్పనిసరిగా ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన తెలంగాణ హైకోర్టు

Hazarath Reddy

పుట్టిన రోజు ధ్రువీకరణ పత్రం కోసం పెట్టుకునే దరఖాస్తులో కులం, మతం వద్దనుకునేవారికి వీలుగా ఓ కాలమ్‌ ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ బుధవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. విద్యతో పాటు ఇతర అన్ని దరఖాస్తుల్లో ‘నో క్యాస్ట్‌’, ‘నో రిలీజియన్‌’ అనే కాలమ్‌ను తప్పుకుండా చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

IRCTC: రైలు టికెట్ బుక్ చేసుకునే ప్రయాణికులకు రూ.10 లక్షల జీవిత బీమా, సంచలన నిర్ణయం తీసుకున్న ఇండియన్ రైల్వే

Hazarath Reddy

రైల్వే ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ శుభవార్తను అందించింది. ఇకపై రిజర్వేషన్‌ చేసుకుని ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు ఆటోమెటిక్‌గా రూ.10 లక్షల జీవిత బీమా రక్షణ లభించనున్నది.

NITI Aayog Report: గడిచిన 8 ఏండ్లలో 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు.. నీతిఆయోగ్ తాజా నివేదిక లెక్కలు ఇవే!

Rudra

నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి దేశంలో పేదరికం అంతకంతకు తగ్గిపోతున్నది. ఈ మేరకు నీతిఆయోగ్ తాజా నివేదిక వెల్లడించింది. 2015 నుంచి ఇప్పటివరకూ దేశంలో 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డట్టు నివేదిక వివరించింది.

Heavy Rains in Telangana: తెలంగాణలో నేడు భారీ వర్షాలు.. రేపటి నుంచి అతి భారీ వర్షాలు.. వచ్చే రెండుమూడు రోజులూ ఇంతే.. ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ

Rudra

తెలంగాణకు వాతావరణశాఖ కీలక సూచన చేసింది. రాష్ట్రంలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రేపటి నుంచి శుక్రవారం వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలంటూ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.

Advertisement

Andhra Pradesh Weather Forecast: బంగాళాఖాతంలో 48 గంటల్లో వాయుగుండం ఏర్పడే అవకాశం, జూలై 17 నుండి 21 వరకు ఏపీలో భారీ వర్షాలు

Hazarath Reddy

ఈ నెల 17 నుంచి జూలై 21 వరకు రానున్న ఐదు రోజుల్లో ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉత్తరాదిలోని కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Rains in Telugu States: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఐఎండీ వర్ష సూచన.. నేటి నుంచి 20 వరకు వర్షాలు.. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు

Rudra

నేటి నుంచి రానున్న నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నట్టు భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్ లపై అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని వెల్లడించింది.

MBBS Counseling: 20 నుంచి ఎంబీబీఎస్‌ సీట్లకు కౌన్సెలింగ్‌.. 22 నుంచి వెబ్‌ ఆప్షన్ల నమోదు.. పూర్తి వివరాలు ఇవే..

Rudra

అఖిల భారత కోటా ఎంబీబీఎస్, బీడీ ఎస్‌ సీట్ల భర్తీకి మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ (ఎంసీసీ) తాజాగా షెడ్యూల్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మెడికల్, డెంటల్‌ కాలేజీల్లోని 15 శాతం సీట్లను అఖిల భారత కోటా కింద భర్తీ చేయనున్నారు.

APPSC Group 1 Mains Result 2023 Declared: ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ ఫలితాలు విడుదల, ఇంటర్వ్యూలు తేదీ ఇదిగో..

Hazarath Reddy

ఏపీలో ఇటీవల జరిగిన ఏపీపీఎస్సీ(APPSC) గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. జూన్‌ 3 నుంచి 10వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 10 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 5,028 మంది అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే.

Advertisement

AP PGCET-AP EDCET Results Declared: ఏపీ పీజీసెట్‌, ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల, ర్యాంకు కార్డు కోసం డైరెక్ట్ లింక్ ఇదిగో..

Hazarath Reddy

ఏపీలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ పీజీసెట్‌ 2023(AP PGCET 2023), బీఈడీ(BEd) కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన ఎడ్‌సెట్‌ 2023 పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ప్రసాద్‌ రెడ్డి శుక్రవారం విడుదల చేశారు.

AP PGCET 2023 Results: ఏపీ పీజీసెట్‌ ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డు ఇలా పొందండి

kanha

ఏపీ పీజీసెట్-2023 ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి.ఇందుకు సంబంధించిన ఫలితాలను అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. ర్యాంకుల ఆధారంగా పలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టనున్నారు.

Northern India Floods: ఉత్తరాది వరదలకు 145 మందికి పైగా బలి.. ఒక్క హిమాచల్‌ప్రదేశ్‌లోనే 91 మంది మృతి.. నేడు ఉత్తరాఖండ్, హిమాచల్, హర్యానాను కుదిపేయనున్న భారీ వర్షాలు

Rudra

ఉత్తరాదిన కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటివరకు 145 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వరదల కారణంగా ఒక్క హిమాచల్‌ప్రదేశ్‌లోనే 91 మంది ప్రాణాలు కోల్పోయారు.

IMD Weather Forecast: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన అలర్ట్, తెలంగాణలో రాబోయే ఐదు రోజులు, ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 5 రోజులు పాటు వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలో రాబోయే ఐదు రోజులు, ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement