Bank Holidays in December: డిసెంబర్ లో 18 రోజులు బ్యాంకులు బంద్.. సెలవుల జాబితా ఇదిగో..
బ్యాంకు వినియోగదారులకు అలర్ట్. పండుగలు, వారాంతాలతో కలిపి డిసెంబర్ లో మొత్తం 18 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.
Newdelhi, Dec 2: బ్యాంకు వినియోగదారులకు (Bank Customers) అలర్ట్. పండుగలు, వారాంతాలతో కలిపి డిసెంబర్ లో మొత్తం 18 రోజుల పాటు బ్యాంకులకు (Banks) సెలవులు ఉన్నాయి. కస్టమర్లకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రతి నెలా బ్యాంకు సెలవుల (Bank Holidays ) జాబితాను ముందుగానే జారీ చేస్తుందన్న విషయం తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే డిసెంబర్ కు సంబంధించిన సెలవుల జాబితాను కూడా విడుదల చేసింది. అయితే ఆర్‌బీఐ సెలవుల జాబితాలోని బ్యాంకు సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవు.
#Bank holidays in #December: Branches to remain shut for 18 days; check state-wise listhttps://t.co/aVV9Rhkto1
— Hindustan Times (@htTweets) December 1, 2023
డిసెంబర్ లో బ్యాంకు సెలవుల జాబితా..
- డిసెంబర్ 1 (శుక్రవారం) – అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ ఆవిర్భావ దినోత్సవం / స్థానిక విశ్వాస దినోత్సవం.
- డిసెంబర్ 3 (ఆదివారం) – దేశవ్యాప్త సెలవు.
- డిసెంబర్ 4 (సోమవారం) – సెయింట్ ఫ్రాన్సిస్ జావియర్ ఫీస్ట్ డే – గోవాలో బ్యాంకులకు సెలవు.
- డిసెంబర్ 9 (రెండో శనివారం) – దేశవ్యాప్త సెలవు.
- డిసెంబర్ 10 (ఆదివారం) – దేశవ్యాప్త సెలవు.
- డిసెంబర్ 12 (మంగళవారం) – పా-తోగాన్ నెంగ్మింజా సంగ్మా – మేఘాలయలో బ్యాంకులకు సెలవు.
- డిసెంబర్ 13, 14 (బుధ, గురువారం) – లోసూంగ్/ నామ్ సూంగ్ – సిక్కింలో బ్యాంకులకు సెలవు.
- డిసెంబర్ 17 (ఆదివారం) – దేశవ్యాప్త సెలవు.
- డిసెంబర్ 18 (సోమవారం) – యూ సోసోథామ్ వర్ధంతి – మేఘాలయలో బ్యాంకులకు సెలవు.
- డిసెంబర్ 19 (మంగళవారం) – గోవా విముక్తి దినోత్సవం – గోవాలో బ్యాంకులకు సెలవు.
- డిసెంబర్ 23 (నాలుగో శనివారం) – దేశవ్యాప్తంగా సెలవు.
- డిసెంబర్ 24 (ఆదివారం) – దేశవ్యాప్త సెలవు.
- డిసెంబర్ 25 (సోమవారం) – క్రిస్మస్ సందర్భంగా దేశవ్యాప్త సెలవు.
- డిసెంబర్ 26 (మంగళవారం) – క్రిస్మస్ సంబురాల సందర్భంగా మిజోరం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో సెలవు.
- డిసెంబర్ 27 (బుధవారం) – క్రిస్మస్ సంబురాల సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో బ్యాంకులకు సెలవు.
- డిసెంబర్ 30 (శనివారం) – యూ కియాంగ్ నాంగ్ బాహ్- మేఘాలయలో బ్యాంకులకు సెలవు.
- డిసెంబర్ 31 (ఆదివారం) – దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
(The above story first appeared on LatestLY on Dec 02, 2023 09:51 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

